News


సిమెంట్‌ షేర్లకు డిమాండ్‌

Wednesday 8th January 2020
Markets_main1578476241.png-30768

కాకతీయ 20 శాతం హైజంప్‌
ఓరియంట్‌ సిమెంట్‌ 7 శాతం ప్లస్‌

గత నెలలో కేంద్ర ఆర్థిక శాఖ రూ. 100 లక్షల కోట్లతో ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ రంగానికి బూస్ట్‌ నివ్వనున్న ప్రణాళికలు ప్రకటించాక ఇటీవల జోరం‍దుకున్న సిమెంట్‌ రంగ కౌంటర్లు మరోసారి ఇన్వెస్టర్లను ఆకట్టుకుంటున్నాయి. ఫిబ్రవరిలో కేంద్ర ప్రభుత్వం ప్రకటించనున్న సాధారణ బడ్జెట్‌లో గృహ, నిర్మాణ రంగాలకు మేలు చేయగల ప్రతిపాదనలుండవచ్చన్న అంచనాలు సిమెంట్‌ రంగానికి జోష్‌నిస్తున్నట్లు మార్కెట్‌ విశ్లేషకులు పేర్కొన్నారు. దీనికితోడు వడ్డీ రేట్లకు కీలకమైన రెపో రేటును రిజర్వ్‌ బ్యాంక్‌ దశాబ్దకాలపు కనిష్టానికి చేర్చడం, ఇటీవల స్టేట్‌బ్యాంక్‌సహా పలు బ్యాంకులు గృహ రుణ వడ్డీ రేట్లను తగ్గించడం వంటి అంశాలు దీనికి జత కలుస్తున్నట్లు తెలియజేశారు. ఈ నేపథ్యంలో సిమెంట్‌ రంగంలోని లిస్టెడ్‌ కంపెనీల షేర్లన్నీ నష్టాల మార్కెట్లోనూ దాదాపులాభాలతో కదులుతున్నాయి. వివరాలు చూద్దాం..
 

జోరుగా...
మధ్యాహ్నం 2.50 ప్రాంతంలో బీఎస్‌ఈలో కాకతీయ సిమెంట్‌ షేరు 20 శాతం అప్పర్‌ సర్క్యూట్‌ను తాకింది. రూ. 229 వద్ద ఫ్రీజయ్యింది. ఈ బాటలో ఓరియంట్‌ సిమెంట్‌ 7 శాతంపైగా ఎగసి రూ. 82.5 వద్ద ట్రేడవుతోంది. హైడెల్‌బర్గ్‌ సిమెంట్‌ 4 శాతం జంప్‌చేసి రూ. 194ను తాకగా.. స్టార్‌ సిమెంట్‌ 3.3 శాతం పుంజుకుని రూ. 93 వద్ద ట్రేడవుతోంది. ఇతర కౌంటర్లలో శ్రీ సిమెంట్‌, బిర్లా కార్పొరేషన్‌, జేకే లక్ష్మీ సిమెంట్‌, సాగర్‌ సిమెంట్స్‌, అంబుజా, అల్ట్రాటెక్‌, దాల్మియా భారత్‌, ఇండియా సిమెంట్స్‌, ఏసీసీ సైతం 2-1 శాతం మధ్య బలపడ్డాయి. You may be interested

కొత్త పెట్టుబడులకు చాలా సమయం ఉంది!

Wednesday 8th January 2020

పరిశీలించి అడుగెయ్యండి సమీర్‌ అరోరా కార్పొరేట్‌ టాక్స్‌ కోత తర్వాత మార్కెట్‌ పరిధి విస్తృతమవుతుందని ఎక్కువమంది భావించారని, కానీ ఇంకా ఆ పరిస్థితి రాలేదని హీలియోస్‌ క్యాపిటల్‌ అనలిస్టు సమీర్‌ ఆరోరా చెప్పారు. ఆ సమయంలో తాము కూడా కొన్ని స్టాకులను కొన్నామని, వాటిలో కొన్ని మంచి రాబడులు ఇచ్చాయని చెప్పారు. కానీ కొన్ని మాత్రం ఇంకా పాజిటివ్‌గా మారలేదన్నారు. ముఖ్యంగా దీర్ఘకాలంగా అట్టిపెట్టుకున్న స్టాకులు ఇంతవరకు మంచి ఫలితం చూపలేదన్నారు. కానీ

యాక్సిస్‌ బ్యాంకులో భారీగా రాజీనామాలు..!

Wednesday 8th January 2020

నెలల వ్యవధిలో 15వేల మంది రాజీనామా గడచిన కొన్ని నెలల్లో యాక్సిస్‌ బ్యాంక్‌లో దాదాపు 15వేల మంది రాజీనామా చేశారు. ముఖ్యంగా వినియోగదారులకు ప్రత్యక్షంగా సేవలను అందించే శాఖల నుంచే ఎక్కువగా రాజీనామాలు జరిగినట్లు తెలుస్తుంది. అలాగే కొందరు సీనియర్‌ స్థాయి అధికారులు కూడా తన పదవుల నుంచి వైదొలిగారు. అటోమేషన్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌ అత్యధునిక సాంకేతికను అందిపుచ్చుకునే దిశగా బ్యాంకు అడుగులు వేస్తోంది. ఈ అంశం పాత ఉద్యోగులకు అసౌకర్యాన్ని

Most from this category