News


సిమెంట్‌, రియల్టీ రంగాలు భేష్‌?!

Tuesday 14th January 2020
Markets_main1578992869.png-30923

స్థానిక కంపెనీలకు అవకాశాలెక్కువ
సిమెంట్‌లో అల్ట్రాటెక్‌ పరిశీలించొచ్చు
గోద్రెజ్‌, ప్రెస్టేజ్‌, ఒబెరాయ్‌.. గుడ్‌
-యస్‌ సెక్యూరిటీస్‌ నిపుణులు ప్రశాంత్‌

పటిష్ట యాజమాన్య నిర్వహణలో ఐటీ దిగ్గజం టీసీఎస్‌.. డిజిటల్‌, ప్రొడక్టుల విభాగాలలో స్థిరమైన వృద్ధిని చూపుతున్నట్లు యస్‌ సెక్యూరిటీస్‌ నిపుణులు ప్రశాంత్‌ ప్రభాకరన్‌ పేర్కొన్నారు. దీంతో ఐటీ రంగంలో టీసీఎస్‌ బాగా ముందు‍న్నట్లు చెబుతున్నారు. ఇటీవల వివాదాల్లో చిక్కుకున్నప్పటికీ ఇన్ఫోసిస్‌ మెరుగైన పనితీరును ప్రదర్శించిందని.. రానున్న త్రైమాసికాలలో టీసీఎస్‌, ఇన్ఫోసిస్‌ పీఈల మధ్య అంతరం​ తగ్గే అవకాశముందనీ అభిప్రాయపడ్డారు. ఒక ఇంటర్వ్యూలో ఇంకా రియల్‌ ఎస్టేట్‌, సిమెంట్‌, ఆటో రంగాలపై అభిప్రాయాలను వెల్లడించారు. వివరాలు చూద్దాం..

గ్యాప్‌ తగ్గవచ్చు
ఇటీవల ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్‌ ఆకర్షణీయ ఫలితాలు సాధించింది. అయితే షేరు వీలువ రీత్యా టీసీఎస్‌ను అందుకునేందుకు మరికొంతకాలం పట్టవచ్చు. రెండు మూడు క్వార్టర్లలో ఇందుకు అవకాశముంది. ప్రస్తుతం టీసీఎస్‌ ఫలితాలపట్ల అత్యంత ఆసక్తి కనిపిస్తోంది. కాగా.. రియల్‌ ఎస్టేట్‌ రంగం సానుకూలంగా కనిపిస్తోంది. గత ఐదారేళ్ల గణాంకాలు తీసుకుంటే ప్రధాన పట్టణాలలో పలు అనుమతులను పొందాయి. అయితే కొత్త ప్రాజెక్టులకు అనుమతులు 0.6 శాతం తగ్గడం గమనించదగిన అంశం. అంటే ఇప్పటికే ప్రారంభమైన ప్రాజెక్టులు పూర్తయితేనే.. మార్కెట్లో తదుపరి డిమాండ్‌ ఊపందుకోనున్నట్లు చెప్పవచ్చు. ఈ రంగం‍లో సమర్ధ నిర్వహణ, పటిష్ట బ్యాలన్స్‌షీట్స్‌ కలిగిన కంపెనీలు జోరు చూపే వీలుంది. ఈ రంగంలో ఇప్పటికే గోద్రెజ్‌ ప్రాపర్టీస్‌ మంచి ఫలితాలు సాధిస్తోంది. ఇతర కంపెనీలలో ప్రెస్టేజ్‌ ఎస్టేట్స్‌, ఒబెరాయ్‌ రియల్టీలను భవిష్యత్‌ పెట్టుబడులకు పరిగణించవచ్చు.
  

స్థానిక కంపెనీలు
సిమెంట్‌ రంగంలో స్థానిక కంపెనీలకు అవకాశాలు అధికంగా కనిపిస్తున్నాయి. అయితే ఇలాంటి కంపెనీల ఎంపికలో అప్రమత్తత అవసరం. స్థిరమైన నిర్వహణ, తక్కువ రుణ భారం వంటి అంశాలకు ప్రాధాన్యత ఇవ్వవలసి ఉంటుంది. బెంగళూరు, ముంబై, ఢిల్లీ వంటి ప్రాంతాలలో రియల్టీ పుంజుకునే అవకాశముంది. తద్వారా సిమెంట్‌ కంపెనీలకు డిమాండ్‌ కనిపించవచ్చు. వెరసి సిమెంట్‌ రంగంలో ఎంపిక చేసిన మిడ్‌ క్యాప్స్‌లో ఇన్వెస్ట్‌ చేయవచ్చు. ధరలు, అమ్మకాల పరిమాణం రీత్యా బ్లూచిప్‌ కంపెనీలలో అల్ట్రాటెక్‌ సిమెంట్‌ మెరుగ్గా కనిపిస్తోంది. సిమెంట్‌ రంగంలో మరింత కన్సాలిడేషన్‌కు అవకాశముంది.

ఆటో- అశోక్‌ లేలాండ్‌..?
ఆటో రంగంలో ప్యాసింజర్‌ వాహన కంపెనీలపట్ల ప్రస్తుతం నిరాసక్తంగా ఉన్నాం. అయితే అశోక్‌ లేలాండ్‌ కౌంటర్‌ ఆకర్షణీయంగా ఉంది. ఆర్థిక రికవరీ కనిపిస్తే ముందుగా లబ్ది పొందేది ఈ కంపెనీయే. రుణ భారాన్ని తగ్గించుకోవడంతోపాటు.. పైస్థాయి యాజమాన్యంలో మార్పులు చోటుచేసుకున్నాయి. పరిస్థితులకు అనుగుణంగా వృద్ధిపై దృష్టి పెడుతోంది. ఇటీవల అశోక్‌ లేలాండ్‌ షేరు గరిష్టం నుంచి చూస్తే.. 50-60 శాతం క్షీణించింది!
 

ప్రయివేట్‌.. మేలు
బ్యాంకింగ్‌ రంగంలో పీఎస్‌యూలకంటే ప్రయివేట్‌ దిగ్గజాలు మేలు. పీఎస్‌యూ బ్యాంక్స్‌ చౌకగా లభిస్తున్నప్పటికీ నిర్వహణలో యాజమాన్య అస్పష్టత ప్రతికూల అంశంగా చెప్పవచ్చు. ఒకప్పుడు రుణాలలో 75-80 శాతం వాటా ఆక్రమించిన పీఎస్‌యూ బ్యాంక్స్‌ వాటా ఇటీవల 58-59 శాతానికి జారింది. ప్రభుత్వ నియంత్రణలు, నిర్వహణను అంచనా వేయలేము. సమర్థ నిర్వహణతో విస్తరిస్తున్న ప్రయివేట్‌ రంగ సంస్థలు హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌, ఐసీఐసీఐ బ్యాంకును పెట్టుబడుల కోసం పరిగణించవచ్చు. ఇక స్పెషాలిటీ కెమికల్స్‌ రంగం విషయానికివస్తే.. లాభాలు స్వీకరించడంమేలు. చైనా సమస్యలు తదితర పలు సానుకూల అంశాల కారణంగా పలు కంపెనీలు భారీ ర్యాలీని సాధించాయి. ఇకపైన కూడా మార్జిన్లు మెరుగుపరచుకోగలిగే కంపెనీలున్నప్పటికీ.. అత్యుత్తమ రిటర్నులకు అవకాశాలు తక్కువే!  You may be interested

ఇండస్‌ఇండ్‌ నికర లాభం 32% అప్‌

Tuesday 14th January 2020

షేరు హెచ్చుతగ్గులు పెరిగిన వడ్డీ ఆదాయం తగ్గిన మొండిబకాయిలు ప్రయివేట్‌ రంగ దిగ్గజం ఇండస్‌ఇండ్‌ బ్యాంక్‌ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2019-20) మూడో త్రైమాసికంలో ఆకర్షణీయ ఫలితాలు ప్రకటించింది. క్యూ3(అక్టోబర్‌-డిసెంబర్‌)లో ఇండస్‌ఇండ్‌ నికర లాభం 32 శాతం ఎగసి రూ. 1300 కోట్లను అధిగమించింది. ఇందుకు ప్రధానంగా వడ్డీ ఆదాయం పుంజుకోవడం, పన్ను వ్యయాలు తగ్గడం వంటి అంశాలు సహకరించాయి. వార్షిక ప్రాతిపదికన నికర వడ్డీ ఆదాయం(NII) సైతం 34 శాతం పెరిగి రూ. 3074

ఈ షేర్ల చార్టుల్లో ఎంఏసీడీ బుల్లిష్‌!

Tuesday 14th January 2020

సోమవారం ముగింపు ప్రకారం 63 షేర్ల చార్టుల్లో ఎంఏసీడీ(మూవింగ్‌ ఏవరేజ్‌ కన్వర్జన్స్‌ డైవర్జన్స్‌) ఇండికేటర్‌ బుల్లిష్‌ సంకేతాలు ఇస్తోంది. ఈ షేర్లలో ఎంఏసీడీ బుల్లిష్‌ క్రాసోవర్‌ ఏర్పరిచింది. ఇలా పాజిటివ్‌గా  మారిన కంపెనీల్లో ఇన్ఫోసిస్‌, టాటాస్టీల్‌, కోల్‌ ఇండియా, అదానీ పవర్‌, జస్ట్‌ డయిల్‌, అవెన్యూ సూపర్‌ మార్ట్‌, ఎల్‌ఐసీ హౌసింగ్‌, బీఈఎల్‌, ఎల్‌అండ్‌టీ ఫైనాన్స్‌, పెట్రోనెట్‌, టాటాకాఫీ తదితరాలున్నాయి. ఈ కౌంటర్లలో ట్రెండ్‌ బలంగా ఉందని టెక్నికల్‌ విశ్లేషకులు

Most from this category