News


క్యూ4లో సిమెంట్‌ కౌంటర్లకు డిమాండ్‌!

Saturday 25th January 2020
Markets_main1579934880.png-31198

మిడ్‌, స్మాల్‌ కం‍పెనీలపై క్యూ3 ఎఫెక్ట్‌?
ఏయూ స్మాల్‌ ఫైనాన్స్‌, చోళమండలం భేష్‌
- సర్థీ గ్రూప్‌ ఎండీ, సీఐవో కుంజ్‌ బన్సల్‌

ఈ ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసిక(అక్టోబర్‌- డిసెంబర్‌) ఫలితాల సీజన్‌ వేగమందుకుంది. ఇప్పటివరకూ పలు లార్జ్‌ క్యాప్‌ కంపెనీల పనితీరు వెల్లడైంది. అయితే ఇకపై మిడ్‌, స్మాల్‌ క్యాప్‌ కంపెనీల ఫలితాలు వెలువడవలసి ఉంది. ఇటీవల ఈ కౌంటర్లకు డిమాండ్‌ పెరిగింది. దీంతో ఫలితాల కోసం ఆసక్తి ఎదురుచూస్తున్నట్లు సర్థీ గ్రూప్‌ ఎండీ, సీఐవో కుంజ్‌ బన్సల్‌ తెలియజేశారు. ఒక ఆంగ్ల చానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో సిమెంట్‌, ఎఫ్‌ఎంసీజీ తదితర రంగాలపై అభిప్రాయాలను వ్యక్తం చేశారు. వివరాలు చూద్దాం..

ర్యాలీ నిలుస్తుందా?
సాధారణంగా ఫలితాల సీజన్‌ చివరి దశలో మిడ్‌, స్మాల్‌ క్యాప్‌ కంపెనీలు పనితీరును వెల్లడిస్తుంటాయి. కొద్ది రోజులుగా ఈ కౌంటర్లు జోరందుకోవడంతో ఫలితాలకు ప్రాధాన్యత ఏర్పడింది. భవిష్యత్‌లో మరింత రికవరీను సూచిస్తూ సానుకూలంగా వెలువడవచ్చు. లేదా ప్రతికూల పరిస్థితులను ప్రతిబింబిస్తూ నిరుత్సాహాన్ని కలిగించవచ్చు. క్యూ3 ఫలితాలు స్థబ్దుగా వెలువడే అవకాశముంది. ఇప్పటివరకూ వెలువడిన ఫలితాలు చూస్తే.. ఉదాహరణకు ప్రయివేట్‌ రంగ బ్యాంకింగ్‌ను తీసుకుంటే.. అంచనాలకు అనుగుణంగానే ఉన్నాయి. నిరుత్సాహపరచలేదు. కొన్ని ఫలితాలలో రుణ వృద్ధి కొంతమేర తక్కువగా నమోదైంది. ప్రస్తుత పరిస్థితుల్లో యాజమాన్యాలు అప్రమత్తంగా వ్యవహరించడం దీనికి కారణంకావచ్చు.  

బీమా రంగం భళా..
బీమా కంపెనీల నుంచి సానుకూల ఫలితాలు వెలువడ్డాయి. మందగమన పరిస్థితుల్లోనూ పటిష్ట వృద్ధిని కనబరిచాయి. ప్రీమియంలు, కొత్త బిజినెస్‌, మార్జిన్లు తదితర కీలక అంశాలను పరిగణిస్తే.. 15-25 శాతం మధ్య పురోగతి నమోదైంది. వెరసి మంచి పనితీరుతో ఆశ్చర్యపరిచాయి. ఇక ఐటీ రంగం విషయానికొస్తే.. అంచనాలను అందుకుంటూ ఓమాదిరి పనితీరును ప్రదర్శించాయి. కాగా.. ఫలితాలు, బడ్జెట్‌ నేపథ్యంలో ఇటీవల మార్కెట్లు ఒకే శ్రేణిలో కదులుతూ వచ్చాయి.  

క్యూ3 ఓకే
గత కొన్నేళ్లుగా నిలకడను చూపుతున్న సిమెంట్‌ రంగ కంపెనీలు మరోసారి ఇదే బాటలో క్యూ3 ఫలితాలు ప్రకటించాయి. అంతంతమాత్రంగా అమ్మకాల పరిమాణం నమోదైంది. అయితే రియల్టీ రంగం పుంజుకుంటే క్యూ4(జనవరి-మార్చి)లో సిమెంట్‌ రంగ కంపెనీలు ఉన్నట్లుండి జోరందుకోవచ్చు. ఇది జరిగితే ఇటీవల తగ్గిన ముడివ్యయాల కారణంగా మార్జిన్లు బలపడవచ్చు. దీనికితోడు గత నెల రోజులుగా సిమెంట్‌ కంపెనీలు గతంలోలేని విధంగా నెమ్మదిగా ధరలు పెంచుతూ వచ్చాయి. దీంతో క్యూ4లో సిమెంట్‌ రంగం మెరుగైన ఫలితాలు సాధించే అవకాశముంది.

క్లిష్ట సమయంలోనూ
ఐఎల్‌అండ్‌ఎఫ్‌ఎస్‌ సంక్షోభం తదుపరి రెండేళ్లుగా లిక్విడిటీ సమస్యలు తలెత్తిన కఠిన పరిస్థితుల్లోనూ కొన్ని ఎన్‌బీఎఫ్‌సీలు, బ్యాంకులు ఉత్తమ ఫలితాలు సాధిస్తూ వచ్చాయి. ప్రధానంగా ఏయూ స్మాల్‌ ఫైనాన్స్‌ బ్యాంక్‌, చోళమండలం ఫైనాన్స్‌ ప్రోత్సాహకర పనితీరును చూపాయి. చోళమండలం మధ్య, దీర్ఘకాలానికి ఆకర్షణీయంగా కనిపిస్తోంది. అయితే నాణ్యమైన కంపెనీలు చౌకగా లభించవన్నది వాస్తవం! పటిష్ట పనితీరును కంపెనీలు కొనసాగించగలిగితే.. షేర్ల ధరలూ పెరిగేందుకు వీలుంటుంది!!

ఫుట్‌వేర్‌ గుడ్‌
రిజర్వాయర్లలో జలకళ, సాగుబడి పెరగడం, పంటలకు తగిన ధరలు, ద్రవ్యోల్బణం వంటి అంశాలు గ్రామీణ ఆదాయాలు పుంజుకునేందుకు దోహదపడనున్నాయి. దీనికి కేం‍ద్ర ప్రభుత్వం ప్రకటించనున్న బడ్జెట్‌ జతకలిస్తే.. ఎఫ్‌ఎంసీజీ తదితర వినియోగ రంగంలో డిమాండ్‌ కనిపించవచ్చు. వినియోగ రంగంలోనూ క్యూ3 కంటే క్యూ4 ఫలితాలు ఆకట్టుకునే వీలుంది. ప్రధానంగా గత రెండు, మూడు త్రైమాసికాలుగా పటిష్ట పనితీరు చూపుతున్న ఫుట్‌వేర్‌ రంగం భవిష్యత్‌లోనూ వృద్ధి చూపే అవకాశముంది. ఈ సానుకూల అంశాలను ఫుట్‌వేర్‌ కంపెనీల షేర్లు ఇప్పటికే ప్రతిబింబిస్తున్నాయి. You may be interested

ఐటీఐ ఎఫ్‌పీఓ: తొలిరోజు 6శాతం సబ్‌స్ర్కిప్షన్‌

Saturday 25th January 2020

ప్రభుత్వ రంగ ఇండియన్‌ టెలిఫోన్‌ ఇండస్ట్రీస్‌(ఐటీఐ) ఫాలో ఆన్‌ ఆఫర్‌(ఎఫ్‌పీఓ) బిడ్డింగ్‌ ప్రక్రియలో భాగంగా తొలిరోజు 6శాతం సబ్‌స్క్రైబ్‌ అ‍య్యింది. కంపెనీ ఫాలో ఆన్‌ పబ్లిక్‌ ఆఫర్‌ శుక్రవారం(24న) మొదలైంది. ఆఫర్‌లో భాగంగా మొత్తం జారీ చేసిన 18.18 కోట్ల షేర్లకు గానూ శుక్రవారం ఇష్యూ ముగింపు సమయానికి 1.01 కోటి ఈక్విటీ షేర్లకు బిడ్‌ ధాఖలయ్యాయి. ఇందులో రిటైల్‌ వ్యక్తిగత ఇన్వెస్టర్ల కోసం కోసం కేటాయించిన మొత్తం 32

తగ్గిన పెట్రోల్‌ డీజీల్‌ ధరలు

Saturday 25th January 2020

 భారీగా తగ్గిన పెట్రోల్‌ డీజీల్‌ ధరలు న్యూఢిల్లీ: శనివారం ఒక్కసారిగా పెట్రోల్‌, డీజీల్‌ ధరలు భారీగా తగ్గాయి. చైనాలో విస్తరిస్తున్న కరోనా వైరస్‌ ప్రభావంతో అంతర్జాతీయ మార్కెట్‌లో ముడి చమురు ధరలు తగ్గడంతో పెట్రోల్‌ రూ.27 పైసలు, డీజిల్‌ రూ.30 పైసలు తగ్గింది. శనివారం దేశ రాజధాని ఢిల్లీలో లీటరు పెట్రోల్‌ ధర రూ.74.16 గా ఉంటే ఆర్థిక రాజధాని ముంబైలో రూ.79.76, కోల్‌కతాలో రూ.76.77, చెన్నైలో రూ.77.03 గా ఉంది.

Most from this category