News


యస్‌బ్యాంక్‌ బాండ్ల రేటింగ్‌ డౌన్‌గ్రేడ్‌

Wednesday 1st January 2020
Markets_main1577875934.png-30594

యస్‌ బ్యాంక్‌కు చెందిన రూ.21వేల కోట్ల విలువైన బాండ్లపై కేర్‌ రేటింగ్స్‌ సంస్థ నెగిటివ్‌ అవుట్‌లుక్‌ను కేటాయించింది. ఇటీవల బ్యాంక్‌ నిధుల మూలధన నిధుల సేకరణలో భాగంగా ఇన్ఫ్రాస్ట్రక్చర్‌ బాండ్స్‌, లోయర్‌ టైర్‌-II బాం‍డ్లు, టైర్‌ -II బాండ్లు జారీ ద్వారా మొత్తం రూ.16,430.60 కోట్ల సమీకరించింది. కేర్‌ రేటింగ్‌ సంస్థ ఈ బాండ్ల రేటింగ్‌ను ఎ(+) నుంచి ఎ రేటింగ్‌ డౌన్‌గ్రేడ్‌ చేయడంతో పాటు నెగిటివ్‌ అవుట్‌లుక్‌ కేటాయించినట్లు బ్యాంకు మంగళవారం తెలిపింది. అలాగే అదనంగా రూ.3600 కోట్ల విలువైన బాండ్ల రేటింగ్‌ను బిబిబి(+) నుంచి బిబిబి కు, రూ.904.10 కోట్ల విలువైన అప్పర్‌ టైర్‌-II బాండ్ల రేటింగ్‌ను, రూ.82 కోట్ల శాశ్వత బాండ్ల రేటింగ్‌ను రూ.82 కోట్ల రుణంపై రేటింగ్‌ ఎ నుంచి ఎ(-)కు డౌన్‌గ్రేడ్‌ చేయడంతో పాటు నెగిటివ్‌ అవుట్‌లుక్‌ను కేటాయించినట్లు యస్‌బ్యాంక్‌ తెలిపింది. ప్రధాన ఈక్విటీ మూలధనాన్ని పెంచడంలో ఊహించిన దానికంటే ఎక్కువ ఆలస్యంతో యస్‌ బ్యాంక్‌ రుణ సాధనాలకు కేటాయించిన రేటింగ్‌లను సవరణ చేసినట్లు కేర్‌ రేటింగ్‌ సంస్థ ప్రకటనలో తెలిపింది. 
బాండ్ల రేటింగ్‌పై డౌన్‌గ్రేడ్‌ చేయడంతో పాటు నెగిటివ్‌ అవుట్‌లుక్‌ను కేటాయిండంతో బుధవారం మిడ్‌సెషన్‌ సమయానికి యస్‌బ్యాంక్‌ షేరు అరశాతం నష్టపోయి రూ.47 వద్ద ట్రేడ్‌ అవుతోంది. 

 



You may be interested

రిజర్వు రేషియో తగ్గించిన చైనా

Wednesday 1st January 2020

బ్యాంకుల రిజర్వు రిక్వైర్‌మెంట్‌ రేషియో(ఆర్‌ఆర్‌ఆర్‌)ను 50 బేసిస్‌ పాయింట్ల మేర తగ్గిస్తున్నట్లు పీపుల్స్‌ బ్యాంక్‌ ఆఫ్‌ చైనా(పీబీఓసీ) ప్రకటించింది. జనవరి 6నుంచి ఇది అమల్లోకి రానుంది. తాజా తగ్గింపుతో పెద్దబ్యాంకుల ఆర్‌ఆర్‌ఆర్‌ 12.5 శాతానికి దిగిరానుంది. 2018 నుంచి పీపుల్స్‌ బ్యాంక్‌ 8 మార్లు తగ్గించింది. బ్యాంకులకు మరింత ఫండ్స్‌ అందుబాటులోకి వచ్చేందుకు, లిక్విడిటీ పెంచేందుకు పీబీఓసీ ఈ చర్య చేపట్టింది. త్వరలో చైనా ప్రభుత్వం వృద్ధి పుంజుకునేందుకు మరిన్ని

ఐపీఓకి వస్తున్న పార్క్‌ హోటల్స్‌

Wednesday 1st January 2020

ఏపీజే సురేంద్ర గ్రూప్‌నకు చెందిన పార్క్‌ హోటల్స్‌ పబ్లిక్‌ ఆఫర్‌ కోసం ముసాయిదా పత్రాలను సెబి వద్ద దాఖలు చేసింది. ఈ ఆఫర్‌తో రూ. 1000 కోట్లు సమీకరించాలని కంపెనీ యోచిస్తోంది. ఐపీఓలో కొత్తగా రూ. 400 కోట్ల ఈక్విటీ షేర్లను జారీ చేయనుంది. మరో రూ.600 కోట్లను ఓఎఫ్‌ఎస్‌ ద్వారా సమీకరించనుంది. ఓఎఫ్‌ఎస్‌లో రూ. 125.4 కోట్లు ప్రమోటర్ల వాటాలు విక్రయించడం ద్వారా, రూ. 354.9 కోట్లు ఏపీజే

Most from this category