News


వృద్ధి కోసమే క్యాపిటల్‌: రవనీత్‌ గిల్‌ 

Wednesday 2nd October 2019
Markets_main1570037838.png-28679

డిపాజిటర్లు, రుణ గ్రహీతలు యస్‌ బ్యాంకు పట్ల నమ్మకంతోనే ఉన్నారని, వృద్ధి కోసమే బ్యాంకుకు నిధుల అవసరం ఉందని యస్‌ బ్యాంకు సీఈవో రవనీత్‌ గిల్‌ తెలిపారు. సెప్టెంబర్‌ త్రైమాసికం పనితీరు ఇటీవలి కాలంలో బ్యాంకుకు మెరుగైన పనితీరు అవుతుందన్నారు. పలు అంశాలపై ఆయన ఓ వార్తా సంస్థకు ఇంటర్వ్యూ ఇచ్చారు. 

 

బ్యాంకుపై ఇన్వెస్టర్లలో ఎంతో ఆందోళన ఉంది కదా..?
జూలై-సెప్టెంబర్‌ క్వార్టర్‌లో అంతకుముందు కాలంతో పోలిస్తే అధిక ఖాతాలు తెరిచాం. నూతన ఫిక్స్‌డ్‌ డిపాజిట్లు త్రైమాసికం వారీగా 39 శాతం పెరిగాయి. మా లయబిలిటీలు (చెల్లింపుల బాధ్యతలు) అంతకుముందు క్వార్టర్‌లో మాదిరే ఉన్నాయి. కాసా డిపాజిట్లు కూడా 30 శాతానికి పైనే ఉన్నాయి. అంటే డిపాజిటర్లు, క్లయింట్లు బ్యాంకు పట్ల నమ్మకంతో ఉన్నారని తెలుస్తోంది. కొన్ని రుణ ఖాతాలకు సంబంధించి పరిష్కారంలో జాప్యం నెలకొన్నా కానీ, ఆస్తుల నాణ్యత స్థిరపడింది. సాధారణంగా కంపెనీ పనితీరుకు అనుగుణంగానే షేరు ధర కొనసాగుతుంటుంది. కానీ, కొన్ని సందర్భాల్లో... ఈ రంగం ఒత్తిళ్లను ఎదుర్కోవడం, ప్రస్తుత ఆర్థిక రంగ పరిస్థితులు వంటి సందర్భాల్లో కంపెనీ పనితీరు, షేరు ధరకు పోలిక ఉండదు. లిక్విడిటీ పరంగా మేం నియంత్రణ సంస్థల పరిమితులకు మించి సౌకర్యంగానే ఉన్నాం. 

 

ఎన్‌బీఎఫ్‌సీ, సంక్షోభ కంపెనీల్లో బ్యాంకు ఎక్స్‌పోజర్‌ గురించి..?
ఇండియాబుల్స్‌ అంశాన్ని చూస్తే.. ఈ ఖాతా పనితీరు అద్భుతంగా ఉంది. ఒక్క రోజు కూడా చెల్లింపుల్లో జాప్యం లేదు. గత వారం కూడా భారీ చెల్లింపులను సకాలంలోనే చేసింది. గడిచిన రెండు త్రైమాసికాల్లో ఇండియాబుల్స్‌ ఎక్స్‌పోజర్‌ను మేం 30 శాతం వరకు తగ్గించుకున్నాం. ఈ సంస్థకు సంబంధించిన రుణాలకు తగినంత హామీలు ఉన్నాయి. మాకు రియల్‌ ఎస్టేట్‌ ఎక్స్‌పోజర్‌ ఎక్కువగా ఉందని తెలిసిందే. అంతకు మించిన హామీలు కూడా ఉన్నాయి.

 

షేరు ధర పతనం నిధుల సమీకరణ ప్రణాళికలపై ఏ మేరకు ప్రభావం చూపనుంది?
తదుపరి వృద్ధి క్యాపిటల్‌ మాకు అవసరం. ఇందుకోసం ప్రైవేటు ఈక్విటీ, వ్యూహాత్మక, అతిపెద్ద భారత కుటుంబ వ్యాపార సంస్థల వైపు చూస్తున్నాం. మార్కెట్‌ విలువ పడిపోయినందున ఈక్విటీ మరింత పలుచన కావచ్చు(పెరగొచ్చు). ఒక ఇన్వెస్టర్‌ నుంచి పెట్టుబడుల పరంగా పరిమితులు ఉండడంతో ఒకటికి మించిన ఇన్వెస్టర్ల ద్వారా నిధుల సమీకరణ ఉండొచ్చు. ఆయా ఇన్వెస్టర్ల పెట్టుబడి సామర్థ్యం మాత్రం ప్రశ్నించరానిది. వీరి ద్వారా వచ్చే పెట్టుబడులు తదుపరి వృద్ధి కోసమే కాకుండా, బ్యాంకు పరివర్తన దిశగా ఉపయోగపడుతుంది. స్టాక్‌ మంగళవారం 20 శాతం పడిపోయింది. కనుక ఈక్విటీ డైల్యూషన్‌ (నిధుల సమీకరణ కోసం జారీ చేసే షేర్ల ద్వారా ఈక్విటీ పెరగడం) 30 శాతం నుంచి 35 శాతంగా ఉండొచ్చు. కానీ, గుర్తుంచుకోవాల్సినది ఏమిటంటే... మాకు నిధులు వృద్ధి కోసమే కానీ, మనుగడ కోసం కాదు. ఆస్తుల నాణ్యత విషయంలో రాజీపడేది లేదు.You may be interested

ప్లాస్టిక్‌పై నిషేధం ఈ షేర్లకు కనక వర్షం!

Wednesday 2nd October 2019

ఒక్కసారి వాడి పడేసే ప్లాస్టిక్‌ను 2022 నాటికి దేశంలో పూర్తిగా నిషేధించాలన్నది ప్రధాని నరేంద్ర మోదీ స్వప్నం. మహాత్ముడి 150వ జయంతికి దీన్ని బహుమతిగా ఇవ్వాలన్నది ఆకాంక్ష. ప్లాస్టిక్‌పై మోదీ మోగించిన విప్లవ భేరి, దలాల్‌ స్ట్రీట్‌లో పేపర్‌ స్టాక్స్‌ను పరుగులు పెట్టించాయి. కేవలం నెల రోజుల్లోనే పేపర్‌ షేర్లు ఇన్వెస్టర్లకు లాభాలు కురిపించాయి.  ఒక్కసారి వినియోగించే ప్లాస్ట్‌క్‌లో ఎక్కువ భాగం పాలిథీన్‌ క్యారీ బ్యాగులే ఉంటున్నాయి. షాపులు, వ్యాపార కేంద్రాల్లో

రాబడుల్నిచ్చే టాప్‌ సిఫార్సులు ఇవే

Wednesday 2nd October 2019

దేశీయ ఈక్విటీ మార్కెట్లు ఈ వారం నెగిటివ్‌లోనే ప్రారంభమయ్యాయి. దేశ ఆర్థిక వ్యవస్థకు సంబంధించి స్థూల ఆర్థిక డేటా బలహీనంగా ఉండడంతో పాటు, ఇండియాబుల్స్‌ హౌసింగ్‌ ఫైనాన్స్‌-లక్ష్మీ విలాస్‌ బ్యాంక్‌ సంఘటన, పీఎంసీ(పంజాబ్‌, మహారాష్ట్ర కో ఆపరేటివ్‌) బ్యాంక్‌ మోసం వంటి అంశాలు మార్కెట్‌ సెంటిమెంట్‌ను బలహీనపరిచాయి. గత సెషన్‌లో షార్ట్‌కవరింగ్‌ జరగడంతో సెన్సెక్స్‌ 700 పాయింట్లు నష్టాన్ని పూడ్చుకోగలిగి 38,000 స్థాయి పైన ముగిసింది.      సెన్సెక్స్‌ సెప్టెంబర్‌లో

Most from this category