ఎన్డీఏ వస్తే ఈ రంగాల్లో జోష్
By D Sayee Pramodh

బ్రోకరేజ్ సంస్థల అంచనాలు
బీజేపీ సారధ్యంలో ఎన్డీఏ సుస్థిర ప్రభుత్వం ఏర్పాటు చేస్తే క్యాపిటల్ గూడ్స్, ఇన్ఫ్రా, ఫైనాన్స్ రంగాల కంపెనీలు జోరు చూపుతాయని నిపుణులు అంచనా వేస్తున్నారు. సోమవారం ఎగ్జిట్ పోల్స్ సందర్భంగా జరిగిన మార్కెట్ ర్యాలీలో ఈ రంగాల కంపెనీల షేర్లు ఎక్కువగా ర్యాలీ జరిపాయి. ఎగ్జిట్ పోల్స్ నిజమైతే ఈ షేర్లు మునుముందు మరింత జోష్ కనబరుస్తాయని నిపుణుల భావన. ఇన్ఫ్రాపై మరింత ఫోకస్ చూపుతామని బీజేపీ తన మ్యానిఫెస్టోలో పేర్కొందని, అందువల్ల బీజేపీ ప్రభుత్వం వస్తే నిర్మాణం, ఇన్ఫ్రా, బిల్డింగ్ మెటీరియల్స్ రంగాలకు మంచి లబ్ది చేకూరుతుందని షేర్‌ఖాన్ పేర్కొంది. దీంతో పాటు బ్యాంకులు, స్పెషాలిటీ కెమికల్స్, క్యాపిటల్గూడ్స్ వంటి రంగాలు సైతం మంచి పురోగతి సాధిస్తాయని తెలిపింది. ముఖ్యంగా క్యాపెక్స్ ఆధారిత రంగాలైన క్యాపిటల్గూడ్స్, ఎన్బీఎఫ్సీ, కార్పొరేట్ బ్యాంకుల్లాంటివి వృద్ధి నమోదు చేస్తాయని ఎలారా క్యాపిటల్ పేర్కొంది.
ఫలితాల తర్వాత పోర్టుఫోలియో రివ్యూ
ఎన్నికల ఫలితాల ఆధారంగా తమ పోర్టుఫోలియోలను రివ్యూ చేస్తామని, స్థిర ప్రదర్శన చూపే రంగాలను ఎంచుకుంటామని పలువురు బ్రోకింగ్ నిపుణులు చెబుతున్నారు. ఎగుమతుల ఆధారిత రంగాలపైన ఫార్మా వంటి రంగాలపై అప్రమత్తంగా ఉండాలని వీరు సూచిస్తున్నారు. ఐటీపై న్యూట్రల్‌గా ఉన్నామని అనలిస్టులు చెబుతున్నారు. ఎన్బీఎఫ్సీలు, ఇండస్ట్రియల్స్ చౌక వాల్యూషన్ల వద్ద ట్రేడవుతున్నాయి. అందువల్ల ప్రైవేట్ ఫైనాన్షియల్స్, ఇండస్ట్రియల్స్పై ఓవర్‌వెయిట్‌గా, ఐటీపై న్యూట్రల్‌గా ఉన్నామని జేఎం ఫైనాన్షియల్స్ తెలిపింది. ప్రస్తుత ఫలితాలే నిజ ఫలితాల్లో ప్రతిబింబిస్తే రూపాయి బలపడుతుందని, అందువల్ల ఐటీ షేర్ల జోలికి పోకపోవడం మంచిదని సూచించింది. సూచీల్లో వస్తున్న, రాబోయే ర్యాలీలను అనవసర కంపెనీల షేర్లను వదిలించుకునేందుకు వినియోగించుకోవాలని ఐసీఐసీఐ డైరెక్ట్ సూచించింది. బ్యాంకులు, ఇన్ఫ్రా, క్యాపిటల్గూడ్స్పై పాజిటివ్‌గా ఉన్నామని తెలిపింది. రిలయన్స్ సెక్యూరిటీస్ కూడా ఇదే అభిప్రాయం వెలిబుచ్చింది. సూచీల్లో మరికొంత ర్యాలీ ఉండొచ్చని, కానీ ఈ పరుగు ఎక్కువకాలం కొనసాగకపోవచ్చని, పలు సవాళ్లు మార్కెట్ ముందున్నాయని తెలిపింది.
You may be interested
వాహన బీమా మరింత భారం..
Tuesday 21st May 2019థర్డ్ పార్టీ ప్రీమియం రేట్ల పెంపునకు ఐఆర్డీఏఐ ప్రతిపాదనలు కార్లు, బైకులు, స్కూల్ బస్సులు, ట్యాక్సీలు అన్నింటిపైనా వడ్డింపు లగ్జరీ కార్లు, సూపర్ బైక్‌లకు యథాతథంగా ప్రస్తుత రేటు న్యూఢిల్లీ: వాహనదారులపై బీమా భారం మరింత పెరిగేలా బీమా రంగ నియంత్రణ, అభివృద్ధి సంస్థ ఐఆర్డీఏఐ ప్రతిపాదనలు చేసింది. కార్లు, ద్విచక్ర వాహనాలు, రవాణా వాహనాల థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ ప్రీమియంలను ప్రస్తుత ఆర్థిక సంవత్సరం గణనీయంగా పెంచే అంశాలు ఇందులో ఉన్నాయి. ఈ
టాటా మోటార్స్ లాభం 49 శాతం డౌన్
Tuesday 21st May 2019రూ.1,109 కోట్ల ప్రకటన న్యూఢిల్లీ: టాటా మోటార్స్ కన్సాలిడేటెడ్ లాభం మార్చి త్రైమాసికంలో 49 శాతం తగ్గి రూ.1,109 కోట్లకు పరిమితం అయింది. అంతక్రితం ఏడాది ఇదే కాలంలో లాభం రూ.2,175 కోట్లుగా ఉంది. మొత్తం ఆదాయం క్రితం ఏడాది ఇదే కాలంలో పోలిస్తే రూ.91,643 కోట్ల నుంచి రూ.87,285 కోట్లకు తగ్గింది. 2018-19 పూర్తి ఆర్థిక సంవత్సరానికి కన్సాలిడేటెడ్‌గా రూ.28,724 కోట్ల నష్టాన్ని కంపెనీ ప్రకటించింది. ఆదాయం రూ.3,04,903 కోట్లుగా