News


కెనరా బ్యాంక్‌ లాభం రూ.329 కోట్లు

Thursday 25th July 2019
Markets_main1564037777.png-27309

  • 17 శాతం వృద్ధి
  • రూ.14,062 కోట్లకు మొత్తం ఆదాయం 

న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ కెనరా బ్యాంక్‌ ఈ ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసిక కాలంలో రూ.329 కోట్ల నికర లాభం సాధించింది.  గత క్యూ1లో రూ.281 కోట్లుగా ఉన్న నికర లాభం ఈ క్యూ1లో రూ.329 కోట్లకు పెరిగిందని, 17 శాతం వృద్ధి సాధించామని  కెనరా బ్యాంక్‌ తెలిపింది. మొత్తం ఆదాయం రూ.13,192 కోట్ల నుంచి రూ.14,062 కోట్లకు పెరిగిందని పేర్కొంది.  వడ్డీ ఆదాయం రూ.11,360 కోట్ల నుంచి రూ.12,201 కోట్లకు చేరిందని తెలిపింది. రూ.2,440 కోట్ల ఇతర ఆదాయం ఆర్జించామని పేర్కొంది. 

బ్యాంక్‌ రుణ నాణ్యత మెరుగుపడింది. గత క్యూ1లో 11.05గా ఉన్న స్థూల మొండి బకాయిలు ఈ క్యూ1లో 8.77 శాతానికి తగ్గాయని కెనరా బ్యాంక్‌ తెలిపింది. అలాగే నికర మొండి బకాయిలు 6.91 శాతం నుంచి 5.35 శాతానికి తగ్గాయని పేర్కొంది. విలువ పరంగా చూస్తే, స్థూల మొండి బకాయిలు రూ.44,660 కోట్ల నుంచి రూ.39,399 కోట్లకు, నికర మొండి బకాయిలు 26,694 కోట్ల నుంచి 23,150 కోట్లకు తగ్గాయని వివరించింది. మొండి బకాయిలు తగ్గిన ఫలితంగా మొండి బకాయిలకు కేటాయింపులు 2,466 కోట్ల నుంచి రూ.2,283 కోట్లకు తగ్గాయని పేర్కొంది. మొత్తం మీద కేటాయింపులు రూ.2,582 కోట్ల నుంచి రూ.1,889 కోట్లకు చేరాయని తెలిపింది. ప్రొవిజన్‌ కవరేజ్‌ రేషియో 60.69 శాతం నుంచి 68.62 శాతానికి పెరిగిందని పేర్కొంది. 

ఈ ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికం చివరినాటికి రుణాలు 11 శాతం వృద్ధితో రూ.4.49 లక్షల కోట్లకు, డిపాజిట్లు 15 శాతం వృద్ధితో రూ.6.10 లక్షల కోట్లకు పెరిగాయని కెనరా బ్యాంక్‌ తెలిపింది. ఇక మొత్తం వ్యాపారం 13 శాతం వృద్ధితో రూ.10.59 లక్షల కోట్లకు పెరిగిందని పేర్కొంది. 
 



You may be interested

నిఫ్టీ మాత్రమే నెగిటివ్‌ రిటర్న్స్‌ ఇచ్చింది!

Thursday 25th July 2019

ప్రపంచ టాప్‌15 మార్కెట్లలో భారత మార్కెట్లదే పేలవ ప్రదర్శన మేనెల తర్వాత ప్రపంచ టాప్‌ మార్కెట్‌ ప్రదర్శనను పరిశీలిస్తే కేవలం ఇండియా మార్కెట్‌ మాత్రమే ఇప్పటివరకు నెగిటివ్‌ రాబడులు ఇచ్చినట్లు తెలుస్తోంది. మేలో మోదీ ప్రభుత్వ విజయం అనంతరం భారీ లాభాల్లోకి దూసుకుపోయిన దేశీయ మార్కెట్లు కేవలం రెండు నెలల్లో దాదాపు ఆ లాభాలన్నింటినీ తుడిచిపెట్టాయి. దీంతో డాలర్‌ లెక్కల్లో వరల్డ్‌ టాప్‌ 15 ఈక్విటీ మార్కెట్లలో ఒకే ఒక్క నెగిటివ్‌

రూ.199కే నెట్‌ఫ్లిక్స్ మొబైల్‌ ప్లాన్‌

Thursday 25th July 2019

న్యూఢిల్లీ: అమెరికాకు చెందిన ప్రీమియం వీడియో స్ట్రీమింగ్ కంపెనీ నెట్‌ఫ్లిక్స్.. భారత మొబైల్‌ వినియోగదారుల కోసం అత్యంత చౌక ప్లాన్‌ను బుధవారం అందుబాటులోకి తెచ్చింది. కేవలం రూ.199కే నెలవారీ మొబైల్‌ ప్లాన్‌ను ప్రవేశపెట్టింది. ఈ నూతన ప్లాన్‌లో భాగంగా ఎటువంటి ప్రకటనలు లేనటువంటి స్టాండర్డ్‌ డిఫినిషన్‌ (ఎస్‌డీ) వీడియోలను ప్రేక్షకులు వీక్షించవచ్చని వివరించింది. స్మార్ట్‌ఫోన్, ట్యాబ్లెట్లకు మాత్రమే వర్తించే ఈ చౌక ప్లాన్‌ కేవలం భారత కస్టమర్లకు మాత్రమే అందుబాటులో

Most from this category