News


6 శాతం వృద్ధి అంచనాలను అందుకోగలమా?!

Monday 10th February 2020
Markets_main1581328258.png-31661

వచ్చే ఏడాది ఆర్థిక వృద్ధి లక్ష్యం కష్టమే
తదుపరి సమీక్షలలో వడ్డీ రేట్ల కోతలకు చాన్స్‌ తక్కువే
- దీప్తి మేరీ మాథ్యూ, జియోజిత్‌ ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌

ఆర్థిక సర్వే అంచనా వేసినట్లు వచ్చే ఏడాది(2021)లో దేశ ఆర్థిక వ్యవస్థ 6-6.5 శాతం వృద్ధి అంచనాలను అందుకోవడం కష్టమేనంటున్నారు.. జియోజిత్‌ ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌ ఆర్థికవేత్త దీప్తి మేరీ మాథ్యూ. రిజర్వ్‌ బ్యాంక్‌ పాలసీ నిర్ణయాలు, ద్రవ్యోల్బణం తదుపరి అంశాలపై ఒక ఇంటర్వ్యూలో దీప్తి వ్యక్తం చేసిన అభిప్రాయాల వివరాలు చూద్దాం..

చెప్పలేం
ఇటీవల ఆర్థిక వ్యవస్థ పురోగమిస్తున్న సంకేతాలు కొంత కనిపిస్తున్నప్పటికీ వృద్ధి బాట పట్టినట్లు అప్పుడే చెప్పలేము. తాజాగా వెలువడిన ఆర్థిక సర్వే వేసిన వేసిన 6-6.5 శాతం అంచనాలను వచ్చే ఏడాదిలో దేశ జీడీపీ అందుకునే అవకాశాలు తక్కువే. ద్రవ్యోల్బణం 6 శాతాన్ని మించడంతో రిజర్వ్‌ బ్యాంక్‌ తాజా లిక్విడిటీ చర్యలు తీసుకుంది. అయితే రానున్న రెండు సమీక్షలలో రేట్ల తగ్గింపు నిర్ణయాలు ఉండకపోవచ్చు. తిరిగి ద్రవ్యోల్బణం నీరసిస్తే.. ఇందుకు అవకాశాలు మెరుగుపడతాయి. ప్రస్తుత పరిస్థితులరీత్యా రానున్న రెండు సమావేశాల్లో రేట్ల కోత ప్రకటనలు ఉండబోవని భావిస్తున్నాం. ఆర్‌బీఐ సైతం వచ్చే ఏడాది జీడీపీ 6 శాతం వృద్ధి సాధించవచ్చని అంచనా వేసింది.

ఆర్‌బీఐ భేష్‌
హౌసింగ్‌, రియల్టీ, ఆటో, ఎంఎస్‌ఎంఈ రంగాలలో ఆర్థిక మందగమన రీత్యా పలు ప్రాజెక్టులు నిలిచిపోయాయి. ఈ దిశలో ఇటీవల ఆర్‌బీఐ తగిన చర్యలు తీసుకుంది. అయితే ఎన్‌పీఏలు, రుణ నాణ్యత సమీక్ష తదితరాల నేపథ్యంలో బ్యాంకులు రిస్కులకు విముఖత చూపుతున్నాయి. దీంతో ఆర్‌బీఐ నిర్ణయాల ద్వారా తాజాగా రుణాలకు డిమాండ్‌ పెరిగేదీ లేనిదీ చూడవలసి ఉంది. ఆర్థిక వ్యవస్థలో సెంటిమెంటు మెరుగుపడే చర్యలు తీసుకోవలసిన అవసరం ఉంది. నిజానికి బడ్జెట్‌ కంటే ఆర్‌బీఐ చర్యలే మార్కెట్లకు హుషారునిచ్చాయని చెప్పవచ్చు. 

ద్రవ్యోల్బణం 
ఆహార ధరలు పెరగడంతో ఇటీవల ద్రవ్యోల్బణం పెరిగింది. ఇకపై తగ్గుముఖం పడుతుందని భావిం‍చవచ్చు. రబీ సీజన్‌ సానుకూలంగానే కనిపిస్తోంది. అయితే సరఫరాలవైపు కారణాలతో ధరలు పెరిగే వీలుంది. రుతుపవనాలు లేదా రాజకీయ, సామాజిక ఆందోళనలు వంటి అంశాలు పరిస్థితులను దెబ్బతీయవచ్చు. అలాంటప్పుడు ఆర్‌బీఐకు అవకాశాలు తగ్గవచ్చు. 



You may be interested

రెండో రోజూ మార్కెట్లు డీలా

Monday 10th February 2020

సెన్సెక్స్‌ 162 పాయింట్లు డౌన్‌ 67 పాయింట్లు క్షీణించిన నిఫ్టీ ఎన్‌ఎస్‌ఈలో అన్ని రంగాలూ నేలచూపే నీరసంగా కదులుతున్న యూరప్‌ మార్కెట్లు అంతకంతకూ కరోనా వైరస్‌ విస్తరిస్తుండటంతో మరోసారి ప్రపంచ స్టాక్‌ మార్కెట్లు డీలాపడ్డాయి. దీంతో దేశీయంగానూ వరుసగా రెండో రోజు ఇన్వెస్టర్లు అమ్మకాలకే ఆసక్తి చూపారు. వెరసి సెన్సెక్స్‌ 162 పాయింట్లు క్షీణించి 40,980 వద్ద నిలవగా.. నిఫ్టీ 67 పాయింట్ల వెనకడుగుతో 12,031 వద్ద ముగిసింది. వారాంతాన అమెరికా స్టాక్‌ మార్కెట్లు నష్టపోగా..

విదేశీ ఆన్‌లైన్‌ ఉత్పత్తులు మరింత ప్రియం..?

Monday 10th February 2020

  ముంబై: విదేశీ ఆన్‌లైన్‌ సైట్లలో ఉత్పత్తులు మరింత ప్రియం కానున్నాయి. భారత దేశంలో ఆన్‌లైన్‌లో కొనుగోలు, విక్రయాలు నిర్వహిస్తున్న విదేశీ సైట్లపై  ప్రభుత్వం ముందస్తు పన్నుతో పాటు కస్టమ్స్‌ మోడ్‌ల్‌ను ప్రవేశపెట్టనుంది. దీనివల్ల చైనాతో పాటు ఇతర విదేశీ ఈ -కామర్స్‌ సైట్ల ద్వారా ఉత్పత్తులను విక్రయించే కంపెనీలు ఆయా వస్తువుల షిప్పింగ్‌ కంటే ముందే పన్ను, కస్టమ్స్‌ డ్యూటీ చెల్లిస్తేనే ఆయా ఉత్పత్తులు కొనుగోలు దారులకు చేరతాయి. ఈ

Most from this category