STOCKS

News


టెలికం షేర్లను కొనొచ్చా?

Tuesday 19th November 2019
Markets_main1574145052.png-29701

కదం తొక్కుతున్న ఎయిర్‌టెల్‌, వీఐఎల్‌ షేర్లు
మూడు సెషన్లుగా ఎయిర్‌టెల్‌, వొడాఫోన్‌ ఐడియా(వీఐఎల్‌) షేర్లు భారీ ర్యాలీ జరుపుతున్నాయి. క్యు2లో రికార్డు నష్టాలు ప్రకటించిన ఈ కంపెనీల షేర్లపై ఒక్కమారుగా ఇన్వెస్టర్లకు ఆసక్తి పెరిగింది. మంగళవారం ట్రేడింగ్‌లో వీఐఎల్‌ షేరు దాదాపు 30 శాతం, ఎయిర్‌టెల్‌ షేరు సుమారు 6 శాతం లాభపడ్డాయి. డిసెంబర్‌ 1 నుంచి టారిఫ్‌లు పెంచుతామని రెండు కంపెనీలు ప్రకటించాయి. దీంతో రెండు కౌంటర్లలో కొనుగోళ్ల జోరు పెరిగింది. ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతన్న టెలికం రంగానికి తాజాగా సుప్రీంకోర్టు ఇచ్చిన ఏజీఆర్‌ తీర్పు అశనిపాతంగా మారింది. దీంతో ఈ రంగంపై అనలిస్టులు, బ్రోకింగ్‌ సంస్థలు నెగిటివ్‌గా మారాయి. కానీ రెండు మూడు రోజులుగా రెండు కంపెనీల షేర్ల జోరు చూస్తుంటే టెలికం రంగంలో టర్నెరౌండ్‌ జరుగుతుందా? అని రిటైల్‌ మదుపరికి సందేహం కలుగుతోంది. ఈ విషయాన్ని కొందరు అనలిస్టులు సమర్ధిస్తున్నారు.

టెలికం టర్నెరౌండ్‌ థీమ్‌ అని ఎస్సెల్‌ మ్యూచువల్‌ ఫండ్‌ సీఐఓ శరవణ కుమార్‌ అభిప్రాయపడ్డారు. నాణ్యమైన టెలికం కంపెనీలకు ఇకపై మంచి భవితవ్యం ఉంటుందన్నారు. వ్యవస్థలో నాణ్యమైన మూడు నాలుగు కంపెనీలు ఉండాలని ప్రభుత్వం భావించడం శుభపరిణామమనానరు. ఎయిర్‌టెల్‌ షేరు అప్‌మూవ్‌ వెనుక కీలక కారణాలున్నాయని షేర్‌ఖాన్‌ వైస్‌ప్రెసిడెంట్‌ హెమాంగ్‌ జాని చెప్పారు. ప్రభుత్వం తప్పక రిలీఫ్‌ ఇస్తుందన్న నమ్మకం, ధరల పెరుగుదలతో రెవెన్యూ వృద్ధిపై అంచనాలు.. షేరును ముందుకు నడిపిస్తున్నాయన్నారు. వీఐఎల​ కన్నా ఎయిర్‌టెల్‌పై పాజిటివ్‌గా ఉన్నామన్నారు. ఇప్పటివరకు ఎయిర్‌టెల్‌ షేరుపై ఆసక్తి చూపని రిటైల్‌, సంస్థాగత ఇన్వెస్టర్లు ప్రస్తుతం కొనుగోళ్లకు పోటీ పడుతున్నారన్నారు. అందుకే షేరు ర్యాలీ జరుపుతోందని, ప్రస్తుతం తాము షేరుపై పాజిటివ్‌గా ఉన్నామని తెలిపారు. You may be interested

రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ రికార్డు

Tuesday 19th November 2019

దేశీయ ప్రైవేట్‌ దిగ్గజ కంపెనీ రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ షేరు మంగళవారం మరో కొత్త గరిష్టస్థాయిని నమోదు చేయడంతో పాటు రూ. 1,500 స్థాయిని అధిగమించింది. బీఎస్‌లో ఎక్చ్సేంజీలో నేడు ఈ కంపెనీ షేరు రూ.1467.50 వద్ద ట్రేడింగ్‌ను ప్రారంభించింది. డిసెంబర్‌ 01 నుంచి ఎయిర్‌ టెల్‌, వోడాఫోన్‌ ఐడియా కంపెనీలు కాల్‌ సర్వీసు ఛార్జీలు పెంచనున్న నేపథ్యంలో రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ అనుబంధ సైతం సంస్థ జియో సైతం ఛార్జీలను పెంచవచ్చనే

వచ్చే 3 వారాల కోసం 3 టాప్‌ స్టాకులు

Tuesday 19th November 2019

-హెచ్‌డీఎఫ్‌సీ సెక్యురిటీష్‌, సీనియర్‌ టెక్నికల్‌ అండ్‌ డెరివేటివ్‌ ఎనలిస్ట్‌, నందిష్‌ షా     నిఫ్టీ, నవంబర్‌ సిరిస్‌ ప్రారంభం నుంచి 200 పాయింట్ల తక్కువ పరిధిలో ట్రేడవుతూ వస్తోంది. అయినప్పటికి వారపు చార్టులలో ఎంఏసీడీ(మూవింగ్‌ యావరేజ్‌ కన్వర్జన్స్‌ డైవర్జన్స్‌), డీఎంఐ(డైరక‌్షనల్‌ మూవ్‌మెంట్‌ ఇండెక్స్‌) ఇండికేటర్లు బుల్లిష్‌గా ఉన్నాయి. నిఫ్టీ తన 50, 100, 200 డీఎంఏ(డైలీ మూవింగ్‌ యావరేజ్‌)కి పైన ముగిసింది.అంతేకాకుండా టెక్నికల్‌ చార్టులో నిఫ్టీ హయ్యర్‌ టాప్స్‌ హయ్యర్‌ బాటమ్స్‌

Most from this category