News


ఐటీసీ ఈ సీరిస్‌లో రూ. 220 దాటేనా?

Tuesday 11th February 2020
Markets_main1581417776.png-31698

సిగరెట్ల ధరలు పెంచుతుందన్న వార్తలతో ఐటీసీ షేరు మంగళవారం ఆరంభంలో  దాదాపు 3 శాతం మేర దూసుకుపోయి రూ. 216.95 వరకు ర్యాలీ జరిపింది. అయితే ఈ లాభాలను చివరకంటా నిలబెట్టుకోలేక ట్రేడింగ్‌ ఆఖరుకు కేవలం 0.97 శాతం లాభంతో రూ. 212. 60 వద్ద క్లోజయింది. బడ్జెట్లో ప్రకటించిన పన్ను భారాన్ని తట్టుకునేందుకు సిగరెట్ల రేట్లను కంపెనీ పెంచింది. ఈ నిర్ణయం కంపెనీకి పాజిటివ్‌ అయినా ఇన్వెస్టర్లు పెద్దగా షేరుపై ఆసక్తి చూపలేదు. మంగళవారం ఆదిలో చూపిన జోరు చివరవరకు కొనసాగలేకపోవడం షేరు కౌంటర్‌పై ఇన్వెస్టర్ల అనాసక్తిని చూపుతుందని నిపుణులు భావిస్తున్నారు. దీనికితోడు ఫిబ్రవరి సీరిస్‌ షేరు ఆప్షన్‌ డేటా చూస్తే 220 రూపాయల స్ట్రైక్‌ప్రైస్‌ వద్ద భారీగా కాల్స్‌ పోగయ్యాయి. ఇక్కడ దాదాపు 71లక్షల పైచిలుకు కాల్స్‌ ఉన్నాయి. మంగళవారం సైతం ఇక్కడ దాదాపు 10 లక్షల పైచిలుకు కాల్‌రైటింగ్‌ జరిగింది. దీంతో ఈ సీరిస్‌కు 220 రూపాయలను షేరు దాటడం చాలా కష్టంగా డెరివేటివ్స్‌ నిపుణులు అంచనా వేస్తున్నారు. ఈ స్థాయి దగ్గరకు వస్తుంటే కాల్‌ రైటర్లు షేరును నిరోధిస్తారని అందువల్ల రేట్ల పెంపు వంటి పాజిటివ్‌ వార్త కూడా షేరును కదిలించలేకపోయిందని విశ్లేషిస్తున్నారు. 

రూ.220 తర్వాత స్ట్రైక్‌ప్రైస్‌ల వద్ద కూడా భారీగానే కాల్స్‌ ఉన్నాయి. అందువల్ల షేరు పైకి రావడం కష్టంగా కనిపిస్తోంది. ఇటీవలే షేరు కీలక మద్దతులు కోల్పోవడం, బహుళ సంవత్సరాల కనిష్ఠాలకు చేరడంతో షేరు మరికొన్ని వారాలు దిగువ స్థాయిల్లోనే ఉండొచ్చన్నది అంచనా. ఫిబ్రవరి సీరిస్‌లో రూ.210, 200 వద్ద పుట్స్‌ ఎక్కువగా ఉన్నాయి. మొత్తం నెల ఆప్షన్స్‌ చూస్తే కాల్స్‌ 4.1 కోటి ఉండగా, పుట్స్‌ 1.9 కోట్లు మాత్రమే ఉన్నాయి. అందువల్ల ఈ సీరిస్‌ వరకు షేరులో భారీ అప్‌మూవ్‌ ఉండకపోవచ్చని ఎక్కువమంది అనలిస్టుల భావన.


ITC

You may be interested

జనవరిలో కొనసాగిన ‘‘ సిప్‌’’ల హవా..!

Tuesday 11th February 2020

ఈక్విటీ మార్కెట్లు భారీగా ఒడిదుడుకులకు లోనైనప్పటికీ, సిస్టమ్యాటిక్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ ప్లాన్‌ (సిప్‌)లో పెట్టుబడుల విషయంలో ఇన్వెస్టర్ల ఏమాత్రం వెనక్కి తగ్గడటం లేదు. జనవరిలో మ్యూచువల్‌ ఫండ్స్‌ పథకాల్లో సిస్టమ్యాటిక్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ ప్లాన్‌ (సిప్‌) రూపంలో రూ.8,231 కోట్ల పెట్టుబడులు తరలివచ్చాయి. డిసెంబర్‌లో సిప్‌ మార్గంలో వచ్చిన పెట్టుబడులు రూ.8,519 కోట్లతో పోలిస్తే జనవరిలో రూ.14 కోట్లు పెరిగాయి. సిప్స్‌ బలంగా కొనసాగడం ఆరోగ్యకర పరిణామమని మార్నింగ్‌స్టార్‌ ఫండ్‌ రీసెర్చ్‌ డైరెక్టర్‌

సెన్సెక్స్‌ బౌన్స్‌బ్యాక్‌

Tuesday 11th February 2020

లాభాల డబుల్‌ సెంచరీ 41,000 ఎగువన ముగింపు ఇంట్రాడేలో క్వాడ్రపుల్‌ విదేశీ సానుకూల సంకేతాలతో హుషారుగా ప్రారంభమైన దేశీ స్టాక్‌ మార్కెట్లు చివరికి లాభాలతో ముగిశాయి. సెన్సెక్స్‌ 237 పాయింట్లు ఎగసి 41,216 వద్ద నిలిచింది. నిఫ్టీ సైతం 76 పాయింట్లు పుంజుకుని 12,108 వద్ద స్థిరపడింది. వెరసి రెండు రోజుల వరుస నష్టాలకు చెక్‌ పడింది. కరోనా భయాలను వీడిన అమెరికా మార్కెట్లు సోమవారం సరికొత్త గరిష్టాలను సాధించడంతో దేశీయంగానూ మార్కెట్లు జోరందుకున్నాయి. ట్రేడింగ్‌

Most from this category