News


కేన్‌ఫిన్‌, ఇండస్‌ఇండ్‌ వీక్‌- మైండ్‌ట్రీ ప్లస్‌

Wednesday 15th January 2020
Markets_main1579063736.png-30943

వరుసగా సరికొత్త గరిష్టాలను అందుకుంటూ వస్తున్న దేశీ స్టాక్‌ మార్కెట్లకు బుధవారం అలుపొచ్చింది. ఇన్వెస్టర్లు అమ్మకాలకే ప్రాధాన్యమిస్తుండటంతో మార్కెట్లు డీలాపడ్డాయి. ఉదయం 10 ప్రాంతం‍లో సెన్సెక్స్‌ 190 పాయింట్లు క్షీణించి 41,762ను తాకగా.. నిఫ్టీ 63 పాయింట్ల వెనకడుగుతో 12,299 వద్ద ట్రేడవుతోంది. అమెరికా, చైనా మధ్య వాణిజ్య వివాద పరిష్కారానికి నేడు ప్రాథమిక డీల్‌ కుదరనున్న నేపథ్యంలో మంగళవారం అమెరికా స్టాక్‌ మార్కెట్లు మిశ్రమంగా ముగియగా..ప్రస్తుతం ఆసియా మార్కెట్లలోనూ అమ్మకాలదే పైచేయిగా కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో క్యూ3 ఫలితాల ఆధారంగా ప్రయివేట్‌ రంగ బ్యాంకింగ్‌ దిగ్గజం ఇండస్‌ఇండ్‌ అమ్మకాలతో మరోసారి నీరసించింది. అయితే ఐటీ సేవల మధ్యస్థాయి కంపెనీ మైండ్‌ట్రీ లిమిటెడ్‌ ఇన్వెస్టర్లను ఆకట్టుకుంటోంది. వీటితోపాటు.. పీఎస్‌యూ దిగ్గజం కెనరా బ్యాంక్‌ అనుబంధ సంస్థ కేన్‌ ఫిన్‌ హోమ్స్‌ కౌంటర్లోనూ అమ్మకాలు ఊపందుకున్నాయి. వివరాలు చూద్దాం...

కేన్‌ ఫిన్‌ హోమ్స్‌ లిమిటెడ్‌
అనుబంధ సంస్థ కేన్‌ ఫిన్‌ హోమ్స్‌ లిమిటెడ్‌లో పూర్తి వాటాను విక్రయించే యోచనను ప్రస్తుతానికి విరమించుకుంటున్నట్లు మాతృ సంస్థ కెనరా బ్యాంక్‌ తాజాగా పేర్కొంది. దీంతో ప్రస్తుతం ఎన్‌ఎస్‌ఈలో కేన్‌ ఫిన్‌ హోమ్స్‌ షేరు 4.5 శాతం పతనమై రూ. 369 వద్ద ట్రేడవుతోంది. గతేడాది సెప్టెంబర్‌ నుంచీ కేన్‌ ఫిన్‌ హోమ్స్‌లో వాటాను విక్రయించే ప్రణాళికల్లో కెనరా బ్యాంక్‌ ఉన్న విషయం విదితమే. నిజానికి సెప్టెంబర్‌లో ఈ హౌసింగ్‌ ఫైనాన్స్‌ కంపెనీలో ఉన్న 30 శాతం వాటా కొనుగోలుకి బిడ్స్‌ను ఆహ్వానించింది. అయితే ఆశించిన ధర లభించకపోవడంతో వెనకడుగు వేసింది. 

మైండ్‌ట్రీ లిమిటెడ్‌
ఎల్‌అండ్‌టీ గ్రూప్‌నకు చెందిన ఐటీ సేవల మధ్యస్థాయి కంపెనీ మైండ్‌ట్రీ లిమిటెడ్‌ ఈ ఆర్థిక సంవత్సరం(2019-20) మూడో త్రైమాసిక ఫలితాలు విడుదల చేసింది. క్యూ3(అక్టోబర్‌-డిసెంబర్‌)లో మైండ్‌ట్రీ రూ. 197 కోట్ల నికర లాభం ఆర్జించింది. వార్షిక ప్రాతిపదికన ఇది 3 శాతం అధికంకాగా.. మొత్తం ఆదాయం 10 శాతం పెరిగి రూ. 1,965 కోట్లను తాకింది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం ఎన్‌ఎస్‌ఈలో మైండ్‌ట్రీ షేరు దాదాపు 4  శాతం జంప్‌చేసి రూ. 896 వద్ద ట్రేడవుతోంది. తొలుత ఒక దశలో రూ. 902 వరకూ ఎగసింది.

ఇండస్‌ఇండ్‌ బ్యాంక్‌
ప్రయివేట్‌ రంగ దిగ్గజం ఇండస్‌ఇండ్‌ బ్యాంక్‌ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2019-20) మూడో త్రైమాసిక ఫలితాలు ప్రకటించింది. క్యూ3(అక్టోబర్‌-డిసెంబర్‌)లో ఇండస్‌ఇండ్‌ నికర లాభం 32 శాతం ఎగసి రూ. 1300 కోట్లను అధిగమించింది. ఇందుకు ప్రధానంగా వడ్డీ ఆదాయం పుంజుకోవడం, పన్ను వ్యయాలు తగ్గడం వంటి అంశాలు సహకరించాయి. వార్షిక ప్రాతిపదికన నికర వడ్డీ ఆదాయం(NII) సైతం 34 శాతం పెరిగి రూ. 3074 కోట్లను తాకింది. అయితే త్రైమాసిక ప్రాతిపదికన క్యూ3లో స్లిప్పేజెస్‌ రూ. 1945 కోట్లకు ఎగశాయి. ఈ ఏడాది క్యూ2లో ఇవి రూ. 1102 కోట్లు మాత్రమే. ఇక ప్రొవిజన్లు కూడా 41 శాతం పెరిగి రూ. 1043 కోట్లను తాకాయి. ఫలితంగా ప్రస్తుతం ఎన్‌ఎస్‌ఈలో ఇండస్‌ఇండ్‌ షేరు 4 శాతం పతనమై రూ. 1422 వద్ద ట్రేడవుతోంది. తొలుత రూ. 1416 వద్ద ఇంట్రాడే కనిష్టాన్ని తాకింది. క్యూ3 ఫలితాల నేపథ్యంలో మంగళవారం సైతం ఈ షేరు 5 శాతం తిరోగమించి రూ. 1482 వద్ద ముగిసిన సంగతి తెలిసిందే. You may be interested

బంగారానికి మళ్లీ కొనుగోళ్ల మద్దతు

Wednesday 15th January 2020

రెండురోజుల వరుస నష్టాల ముగింపు తర్వాత బంగారం ధరకు తిరిగి కొనుగోళ్ల మద్దతు లభిస్తోంది. ఎంసీఎక్స్‌లో బుధవారం ఉదయం ట్రేడింగ్‌లో 10గ్రాములు బంగారం ధర రూ.227.00ల లాభంతో రూ.39674.00 వద్ద ట్రేడ్‌ అవుతోంది. అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ధర వారం రోజుల కనిష్టస్థాయి నుంచి రికవరీ కావడం,  దేశీయ ఫారెక్స్‌ మార్కెట్లో డాలర్‌ మారక విలువ 14పైసల నష్టంతో ప్రారంభం కావడం లాంటి అంశాలు బంగారానికి డిమాండ్‌ పెంచాయి. అమెరికా

అమ్మకాలదే పైచేయి- నష్టాలతో షురూ

Wednesday 15th January 2020

సెన్సెక్స్‌ 190 పాయింట్లు డౌన్‌ అన్ని రంగాలూ వెనకడుగు ఎన్‌ఎస్‌ఈలో రియల్టీ ఎదురీత వరుసగా రెండు రోజులపాటు సరికొత్త గరిష్టాలను అందుకుంటూ సాగిన దేశీ స్టాక్‌ మార్కెట్లకు బుధవారం చుక్కెదురైంది. ఇన్వెస్టర్లు అమ్మకాలకు ఆసక్తి చూపడంతో ట్రేడింగ్‌ ప్రారంభంలోనే డీలాపడ్డాయి. సెన్సెక్స్‌ 190 పాయింట్లు క్షీణించి 41,762ను తాకగా.. నిఫ్టీ 63 పాయింట్ల వెనకడుగుతో 12,299 వద్ద ట్రేడవుతోంది. అమెరికా, చైనా మధ్య వాణిజ్య వివాద పరిష్కారానికి నేడు ప్రాథమిక డీల్‌ కుదరనున్న నేపథ్యంలో

Most from this category