News


తుఫాను ముందు నిశ్శబ్దం?

Saturday 29th June 2019
Markets_main1561810309.png-26691

సూచీల్లో పెరుగుతున్న డౌన్‌సైడ్‌ ఒత్తిడి
నిఫ్టీ తన సరాసరి ట్రెండ్‌లైన్‌కు అటుఇటుగా ట్రేడవుతూ వస్తోంది. నిఫ్టీలోని వివిధ రంగాల్లో కొన్ని డౌన్‌ట్రెండ్‌లో, కొన్ని అప్‌ట్రెండ్‌లో ఉన్నాయి. అందువల్ల సూచీలు స్పష్టంగా ఒక ట్రెండ్‌ ఏర్పరుచుకోలేకపోతున్నాయి. అయితే అంతర్లీనంగా సూచీలో డౌన్‌సైడ్‌ ఒత్తిడి పెరిగిపోతోందని, నిఫ్టీ 11600 పాయింట్లను కోల్పోతే డౌన్‌ట్రెండ్‌ బయటపడుతుందని నిపుణులు సూచిస్తున్నారు. బడ్జెట్‌ వరకు కొత్తగా పొజిషన్లు తీసుకోకపోవడం మంచిదని సలహా ఇస్తున్నారు. ఎన్నికల ఫలితాల తర్వాత బడ్జెట్టే మార్కె్‌ట్‌కు ప్రధాన చోదకం కానుంది. బడ్జెట్‌కు ముందు సూచీలు చూపుతున్న ధోరణి తుఫాను ముందరి నిశ్శబ్ధం లాగా కనిపిస్తోందని నిపుణుల అభిప్రాయం. ప్రస్తుతానికైతే డౌన్‌సైడ్‌ ఒత్తిడి కొంత ఎక్కువగా కనిపిస్తోంతది. ముఖ్యంగా బడ్జెట్లో ఆటో రంగ పునరుజ్జీవానికి ప్రభుత్వం ఎలాంటి చర్యలు ప్రకటిస్తుందన్న దాన్ని బట్టి ఈ రంగంలో రికవరీ ఉండడం లేదా మరింత పతనం కావడం జరగవచ్చు. దీంతో పాటు హౌసింగ్‌, ఇన్‌ఫ్రా, సాగు రంగాలు బడ్జెట్‌ సమయంలో చురుగ్గా ప్రభావితం అవుతాయి. నిఫ్టీ గతవారం చివర్లో బేరిష్‌గా కనిపించింది. స్పిన్నింగ్‌ టాప్‌ ప్యాట్రన్‌ చార్టుల్లో కనిపిస్తోంది. దీన్నిబట్టి ఇటీవలి బ్రేకవుట్‌ను బుల్స్‌ కొనసాగించలేకపోయినట్లు తెలుస్తోంది. ప్రస్తుతానికి నిఫ్టీ తదుపరి ట్రెండ్‌ తెలియాలంటే 11690-11911 పాయింట్లను ఎటోఒకవైపు ఛేదించాల్సిఉంటుంది. నిఫ్టీ గతంలో రెండు మార్లు తన 50 రోజుల డీఎంఏ వద్ద మద్దతు పొందింది. ఈ సారి మరలా అదే స్థాయికి వస్తే మద్దతు లభిస్తుందా? లేదా? వేచిచూడాల్సిఉంది. ఎగువన ఇటీవలి బ్రేకవుట్‌లో తాకిన 11911 పాయింట్లను బలంగా దాటితేనే మరింత​ అప్‌మూవ్‌ ఉంటుంది. You may be interested

నిఫ్టీ ఆప్షన్స్‌ ఏం సూచిస్తున్నాయి?

Saturday 29th June 2019

దేశీయ మార్కెట్‌ గతవారం ఒత్తిడిలో ముగిసింది. నిఫ్టీ డైలీ చార్టుల్లో బేరిష్‌ క్యాండిల్‌ ఏర్పరిచింది, వీక్లీచార్టుల్లో బుల్లిష్‌ హరామీ ఏర్పాటు చేసింది. ఇకపై నిఫ్టీలో అప్‌మూవ్‌ ఉండాలంటే 10822 పాయింట్ల పైన బలంగా కొనసాగాల్సిఉంటుంది. ఒకవేళ ఫెయిలైతే తిరిగి 11650 స్థాయిలను చూడవచ్చు. ఆప్షన్‌ డేటా పరిశీలిస్తే 11500, 11000 పాయింట్ల వద్ద పుట్స్‌ అధికంగా ఉండగా, 12000, 12500 పాయింట్ల వద్ద కాల్స్‌ ఎక్కువగా ఉన్నాయి. కొత్త పుట్‌రైటింగ్‌

క్రూడ్‌ ధరలో పతనమా? పరుగులా?

Saturday 29th June 2019

రెండు సమావేశాలు నిర్ధారిస్తాయి గత రెండు వారాలుగా క్రూడాయిల్‌ ధరలు స్వల్పరేంజ్‌లో తిరుగుతున్నాయి.  చైనాతో వాణిజ్య చర్చలు పునరుద్ధరిస్తున్నట్లు అమెరికా జీ 20 సదస్సులో ప్రకటించింది. ఈ ప్రకటన సక్రమ కార్యరూపం దాల్చకపోతే మిడ్‌టర్మ్‌లో ముడిచమురు ధరలు భారీగా పతనమైతాయని జేపీ మోర్గాన్‌ అంచనా వేసింది. జపాన్‌ మీటింగ్‌లో ట్రంప్‌, గ్సిపింగ్‌ మధ్య అర్ధవంతమైన చర్చలు జరగాలని, వాణిజ్య యుద్ధం నిలిపివేసే దిశగా కచ్చితమైన చర్యలు ప్రకటించాలని ఇన్వెస్టర్లు కోరుకుంఉటన్నారు. కేవలం

Most from this category