News


నిఫ్టీలో కాల్‌ రేషియో స్ప్రెడ్‌ వ్యూహం!

Wednesday 5th February 2020
Markets_main1580879558.png-31521

ట్రేడర్లు కొంత రిస్కు తీసుకోగలిగితే నిఫ్టీలో బుల్‌కాల్‌ రేషియో స్ప్రెడ్‌ వ్యూహం అవలంబించడం ద్వారా ప్రస్తుత పరిస్థితుల్లో లాభాలు పొందవచ్చని నిపుణులు సూచిస్తున్నారు. నిఫ్టీ ఈ సీరిస్‌లో తన గత గరిష్టం 12430 పాయింట్ల వద్ద గట్టి నిరోధం ఎదుర్కోనుంది. నిఫ్టీ ఎక్స్‌పైరీ వరకు 12100- 12400 పాయింట్ల రేంజ్‌లో కదలాడవచ్చని, అందువల్ల ఈ వ్యూహం బెటరని నిపుణుల సలహా. ఈ వ్యూహానికి 12500 పాయింట్లు స్టాప్‌లాస్‌గా పెట్టుకోవాలి. 
వ్యూహ వివరణ
= ప్రస్తుత బుల్‌కాల్‌ రేషియో స్ప్రెడ్‌ వ్యూహంలో ఫిబ్రవరి నెల 27న ముగిసే 12100 పాయింట్ల కాల్‌ ఒక లాట్‌(లాట్‌కు 75 షేర్లుంటాయి) కొనుగోలు చేసి 12300 కాల్స్‌ రెండు లాట్లు విక్రయించాలి. 
= మంగళవారం ధరల ప్రకారం 12100 కాల్‌ లాట్‌ ఒక షేరు రూ. 91 ఉండగా, 12300 కాల్‌ లాట్‌ ఒక షేరు రూ. 35 ఉంది. రెండు లాట్ల విక్రయానికి రూ. 70 పర్‌ షేర్‌ అవుతుంది. దీంతో 12100 కాల్‌ కొనుగోలు నిజ ధర రూ. 21(91-70) అవుతుంది. 
= నిఫ్టీ 12121 పాయింట్లను దాటినప్పటి నుంచి లాభాలు మొదలవుతాయి. ఈ స్థాయి ఎల్‌బీఈపీ(లోయర్‌ బ్రేక్‌ఈవెన్‌ పాయింట్‌)గా ఉంటుంది. 
= 12300 పాయింట్ల వరకు లాభాలు పెరుగుతాయి. అక్కడ గరిష్టంగా ఒక్క షేరుకు రూ. 179 వస్తుంది. 
= అక్కడ నుంచి క్రమంగా లాభాలు తగ్గుతూ 12479 పాయింట్ల తర్వాత నుంచి నష్టాలు మొదలవుతాయి. ఈ స్థాయిని యూబీఈపీ(అప్పర్‌ బ్రేక్‌ఈవెన్‌ పాయింట్‌)గా పెట్టుకోవాలి. 
= నిఫ్టీకి 12430 పాయింట్ల వద్ద నిరోధం గట్టిగా ఉన్నందున వ్యూహంలో నష్టానికి చాలా తక్కువ అవకాశాలున్నాయని క్రాస్‌సీస్‌ క్యాపిటల్‌, యాక్సిస్‌ సెక్యూరిటీస్‌, ఐసీఐసీఐ డైరెక్ట్‌ అంచనా వేస్తున్నాయి. 
= మరింత జాగ్రత్త కోసం కావాలంటే ట్రేడర్లు 11900 పాయింట్ల వద్ద పుట్‌ ఒక లాట్‌ కూడా తీసుకోవచ్చు(హెడ్జింగ్‌) అని నిపుణులు సూచిస్తున్నారు. 
= నిఫ్టీ ఫిబ్రవరి సీరిస్‌లో 11500పాయింట్ల వద్ద పుట్స్‌, 12500 పాయింట్ల వద్ద కాల్స్‌ అధికంగా ఉన్నాయి. 



You may be interested

టాటా గ్లోబల్‌- భారత్‌ వైర్స్‌ హైజంప్‌

Wednesday 5th February 2020

సెన్సెక్స్‌ లాభాల డబుల్‌ సెంచరీ 12,000 పాయింట్లకు ఎగువన నిఫ్టీ  వరుసగా మూడో రోజు దేశీ స్టాక్‌ మార్కెట్లు హుషారుగా ప్రారంభమయ్యాయి. ఉదయం 10.15 ప్రాంతంలో సెన్సెక్స్‌ లాభాల డబుల్‌ సెంచరీ చేసింది. 204 పాయింట్లు పెరిగి 40,994 వద్ద ట్రేడవుతోంది. నిఫ్టీ సైతం 56 పాయింట్లు పుంజుకుని 12,035 వద్ద ట్రేడవుతోంది. వెరసి సెన్సెక్స్‌ 41,000 పాయింట్ల మా‍ర్క్‌కు చేరువకాగా.. నిఫ్టీ 12,000 పాయింట్ల మైలురాయికి ఎగువన కదులుతోంది. ఈ నేపథ్యంలో

భారీగా తగ్గిన పుత్తడి

Wednesday 5th February 2020

  గత కొన్ని రోజులుగా కరోనా వైరస్‌ ప్రభావంతో పెరుగుతూ వస్తున్న బంగారం ధరలు ,స్టాక్‌ మార్కెట్‌లు పుంజుకోవడంతో బుధవారం  ఒక్కసారిగా తగ్గాయి. దేశీయ ఎంసీఎక్స్‌లో ఉదయం 9.30 గంటల ప్రాంతంలో నిన్నటితో పోలిస్తే రూ.500 తగ్గి 10 గ్రాముల బంగారం ధర రూ. 40,145.00 వద్ద ట్రేడ్‌ అవుతోంది. అంతర్జాతీయ మార్కెట్లో  6 డాలర్లు తగ్గి ఔన్స్‌ బంగారం ధర 1,561 డాలర్ల వద్ద ట్రేడ్‌ అవుతోంది. (మంగళవారం బంగారం(స్పాట్‌) ముగింపు

Most from this category