News


కేడిలా హెల్త్‌, డీమార్ట్‌ అధరహో..!

Thursday 6th February 2020
Markets_main1580966471.png-31556

5 శాతం జంప్‌చేసిన కేడిలా హెల్త్‌
చరిత్రాత్మక గరిష్టానికి చేరిన డీమార్ట్‌ 

ప్రపంచ స్టాక్‌ మార్కెట్ల ప్రోత్సాహంతో దేశీయంగానూ ఇన్వెస్టర్లు కొనుగోళ్లకు ఆసక్తి చూపుతున్నారు. దీంతో దేశీ స్టాక్‌ మార్కెట్లు వరుసగా నాలుగో రోజు లాభాలతో కదులుతున్నాయి. ఈ నేపథ్యంలో విభిన్న వార్తల కారణంగా ఓవైపు ఫార్మా రంగ కంపెనీ కేడిలా హెల్త్‌కేర్‌, మరోపక్క డిమార్ట్‌ బ్రాండ్‌ రిటైల్‌ స్టోర్ల నిర్వాహక సంస్థ ఎవెన్యూ సూపర్‌మార్ట్స్‌ కౌంటర్‌కు డిమాండ్‌ నెలకొంది. వెరసి రెండు కౌంటర్లూ భారీ లాభాలతో సందడి చేస్తున్నాయి. వివరాలు చూద్దాం..

కేడిలా హెల్త్‌కేర్‌
ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2019-20) మూడో త్రైమాసికంలో ప్రోత్సాహకర ఫలితాలు సాధించడంతో కేడిలా హెల్త్‌కేర్‌ షేరు జోరందుకుంది. ఉదయం 10.30 ప్రాంతంలో దాదాపు 6 శాతం జంప్‌చేసి రూ. 287 వద్ద ట్రేడవుతోంది. త్రైమాసిక ప్రాతిపదికన క్యూ3(అక్టోబర్‌-డిసెంబర్‌)లో కేడిలా హెల్త్‌ నికర లాభం రూ. 374 కోట్లకు చేరింది. క్యూ2(జులై-సెప్టెంబర్‌)తో పోలిస్తే ఇది 249 శాతం అధికంకాగా.. అనూహ్య లాభాన్ని మినహాయిస్తే.. 18 శాతం వృద్ధి నమోదైనట్లు కంపెనీ పేర్కొంది. అయితే గతేడాది(2018-19) క్యూ3లో కేడిలా రూ. 511 కోట్ల నికర లాభం ఆర్జించింది. కన్సాలిడేటెడ్‌ ఫలితాలివి. కాగా.. ఈ క్యూ3లో త్రైమాసిక ప్రాతిపదికన మొత్తం ఆదాయం 8 శాతం పెరిగి రూ. 3638 కోట్లను అధిగమించింది. వార్షిక ప్రాతిపదికన ఇది 2 శాతం అధికం. ఈ నేపథ్యంలో రీసెర్చ్‌ సంస్థ సీఎల్‌ఎస్‌ఏ కేడిలా షేరు కొనుగోలుకి సూచించింది. టార్గెట్‌ ధరను గతంలో ఇచ్చిన రూ. 310ను తాజాగా రూ. 330కు పెంచింది.

ఎవెన్యూ సూపర్‌మార్ట్స్‌
అర్హతగల సంస్థాగత ఇన్వెస్టర్లకు షేర్ల జారీ(క్విప్‌)ని ప్రారంభించిన నేపథ్యంలో డీమార్ట్‌ స్టోర్ల కంపెనీ ఎవెన్యూ సూపర్‌మార్ట్స్‌ కౌంటర్‌కు డిమాండ్‌ పెరిగింది. ప్రస్తుతం ఎన్‌ఎస్‌ఈలో ఎవెన్యూ సూపర్‌మార్ట్స్‌ షేరు 4 శాతం జంప్‌చేసి రూ. 2337 వద్ద ట్రేడవుతోంది. తొలుత ఒక దశలో రూ. 2360 వరకూ ఎగసింది. తద్వారా చరిత్రాత్మక గరిష్టాన్ని తాకింది. క్విప్‌లో భాగంగా కంపెనీ రూ. 1999 ధరలో 2 కోట్ల షేర్లను జారీ చేయనుంది. తద్వారా కనీసం రూ. 4,000 కోట్లను సమీకరించాలని భావిస్తోంది. కాగా.. కన్సాలిడేటెడ్‌ ప్రాతిపదికన డీమార్ట్‌ నికర లాభం ఈ ఏడాది క్యూ3(అక్టోబర్‌-డిసెంబర్‌)లో 55 శాతం జంప్‌చేసింది. రూ. 384 కోట్లను అధిగమించింది. నికర అమ్మకాలు సైతం 24 శాతం పెరిగి రూ. 6809 కోట్లకు చేరాయి.



You may be interested

నేటి వార్తల్లోని షేర్లు

Thursday 6th February 2020

  వివిధ వార్తలకు అనుగుణంగా గురువారం స్టాక్‌ మార్కెట్లో ప్రభావితమయ్యే షేర్లు ఎవెన్యూ సూపర్‌ మార్కెట్స్‌: ఈ కంపెనీ రూ.4000 కోట్ల నిధులు సమీకరించడానికి షేర్ల విక్రయాన్ని ప్రారంభించింది. ఐఓసీ: ఐఓసీలో ఉన్న ప్రభుత్వ షేర్లను తిరిగి కోనుగోలు చేయమని కంపెనీకి ప్రభుత్వం చెప్పింది. తద్వారా కంపెనీలో తన వాటాను 51 శాతానికి తగ్గించుకోవాలని ప్రభుత్వం యోచిస్తోంది. మ్యాక్స్‌ ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌: డిసెంబర్‌తో ముగిసిన ఈ కంపెనీ స్టాండెలోన్‌ నికర లాభం 56 శాతం తగ్గి

ఎఫ్‌పీఐలకే బడ్జెట్‌ బాగుందా?

Thursday 6th February 2020

తక్కువ అంచనాలున్నందున నిరాశపడని విదేశీ ఇన్వెస్టర్లు సాధారణంగా విదేశీ ఫండ్‌ మేనేజర్లతో పోలిస్తే దేశీయ ఫండ్‌ మేనేజర్లు స్థానిక ఎకనమిక్‌ పరిస్థితులపై ఎక్కువ అవగాహన కలిగిఉంటారు. కానీ బడ్జెట్‌ తర్వాత మార్కెట్‌ గమనం చూస్తే విదేశీ ఫండ్స్‌కే బడ్జెట్‌ బాగా అర్ధమైనట్లు కనిపిస్తోంది. అందుకు తగ్గట్లే విదేశీ మేనేజర్లు గత మూడునాలుగు సెషన్లుగా భారీ కొనుగోళ్లు జరుపుతున్నారు. బడ్జెట్‌ అంచనాలకు తగ్గట్లు లేకపోవడంతో శనివారం రోజు దేశీయ ఇన్వెస్టర్లు, ఫండ్‌ మేనేజర్లు

Most from this category