News


కొనడానికి తొందరొద్దు!

Tuesday 27th August 2019
Markets_main1566898187.png-28051

ప్రస్తుత ర్యాలీ స్వల్పకాలికమే

ముందుంది మరింత పతనం

దీర్ఘకాలిక పెట్టుబడులను ఎంచుకోండి

దీపక్‌ షెనాయ్‌

 

‘ఆర్థిక మంత్రి ప్రకటించిన ఆర్థిక చర్యలలో పెద్ద ఆర్థిక ఉద్దీపనలు లేవు. కానీ ఇలాంటి చర్యలు, ప్రభుత్వం మనల్ని పట్టించుకుంటోంది అనే పాజిటివ్‌ సెంటిమెంట్‌ పెరగడానికి ఉపయోగపడతాయి’ అని క్యాపిటల్‌ మైండ్ వ్యవస్థాపకుడు దీపక్ షెనాయ్ ఓ ఆంగ్ల చానెల్‌కు ఇచ్చిన ఇంటర్యూలో అన్నారు. ఇంటర్యూలోని ముఖ్యంశాలు ఆయన మాటల్లోనే...

ఉద్దీపనలు లేవు...
గత వారం ఆర్థిక మంత్రి ప్రకటించిన ఆర్థిక చర్యలు..ఆర్థిక ఉద్దీపనలుగా పనిచేస్తాయని అనుకోవడం లేదు. మా దగ్గర నిజంగానే పాత వాహానాలుంటే, మేము కొత్తవి కొంటామని ప్రభుత్వం చెబుతోంది. ఇది ఆటో మందగమనం తగ్గించడానికి పెద్దగా ఉపయోగపడకపోవచ్చు. దీనితోపాటు బడ్జెట్‌లో బ్యాంకుల రీక్యాపిటలైజేషన్‌ కోసం ప్రకటించిన రూ. 70,000 కోట్లను గురించే శుక్రవారం చెప్పారు. కానీ ఇది చాలా వరకు ప్రభుత్వ బ్యాంకుల ఎన్‌పీఏ(నిరార్థక ఆస్తులు)లను కవర్‌చేయడానికి ఉపయోగపడుతుంది. ఇంకోవైపు ఎఫ్‌పీఐలపై అదనపు సర్‌చార్జీని రద్దు చేశారు. నిజానికి ఎఫ్‌పీఐలు దేశియ ఈక్విటీ మార్కెట్‌ నుంచి వెళ్లిపోడానికి ఈ సర్‌చార్జీ పెద్ద కారణం కాదు. విదేశి నిధుల ఔట్‌ ఫ్లోకి ప్రధాన కారణం దేశ ఆర్థిక వ్యవస్థ మందగమనంలో ఉండడమేనని నా అంచనా.   ఆర్థిక మంత్రి ప్రకటించిన చర్యలలో పెద్ద ఆర్థిక ఉద్దీపనలు లేవు. కానీ ఇలాంటి చర్యలు, ప్రభుత్వం మనల్ని పట్టించుకుంటోంది అనే పాజిటివ్‌ సెంటిమెంట్‌ పెరగడానికి ఉపయోగపడతాయి. ఎంజెల్‌ ట్యాక్స్‌ను రద్దు చేసి ఎఫ్‌పీఐలపై ఒక స్పష్టతనిచ్చారు. ఇది మంచి చర్యనే కానీ ఇది ఆర్థిక ఉద్దీపనం మాత్రం కాదు. ఇది ద్రవ్యలోటుపై ఎటువంటి ప్రభావం చూపదనే విషయాన్ని గమనించాలి. దీర్ఘకాలంలో ప్రభుత్వం నుంచి మరిన్ని చర్యలుంటాయని నమ్ముతున్నాను.

హడావుడి కొనుగోళ్లు వద్దు
గత రెండు సెషన్‌లో మార్కెట్‌ చాలా ముందుకు వెళ్లింది. ఇందుకు ప్రభుత్వం ఇటీవలే ప్రకటించిన కొన్ని చర్యలే కారణం. కేవలం వీటిని చూసి తొందరపడి హడావుడిగా కొత్త కొనుగోళ్లు చేయవద్దని నా సలహా.దీర్ఘకాలంలో మార్కెట్లు ఇంకా పడిపోయే అవకాశం ఉంది.  ప్రస్తుతం ఉన్న స్థాయిలే మార్కెట్ల బాటమ్‌ అని అనుకోకండి. వడ్డీ రేట్లు ఇప్పుడిప్పుడే తగ్గుతున్నాయి. బ్యాంకులు రెపోకి లింక్‌ చేసి రుణాలు ఇవ్వాలని ప్రభుత్వం బ్యాంకులపై ఒత్తిడి తీసుకురావడం మంచి చర్య. ఇప్పుడు ఖచ్చితంగా ఎంసీఎల్‌ఆర్‌(మార్జినల్‌ కాస్ట్‌ ఆఫ్‌ ఫండ్స్‌ బేసిడ్‌ లెండింగ్‌ రేట్‌) తగ్గింపు ఉం‍టుంది. అయితే ఎంసీఎల్‌ఆర్‌ ఆధారిత రుణాల్లో ఒక లక్షణం ఉంటుంది. ఎంసీఎల్‌ఆర్‌ను రీసెట్‌ తేది తర్వాతే సెట్‌చేయడం జరుగుతుంటుంది. అంటే ఒకసారి రుణం తీసుకున్న తర్వాత వడ్డీరేట్లు​ తగ్గినా వెంటనే కస్టమర్‌కు ఆ తగ్గింపు అందదు. అతని లోన్‌ రీసెట్‌ తేదీ తర్వాతనే కొత్త తగ్గింపు రేటు వర్తిస్తుంది.
  రేట్ల తగ్గింపు తక్షణమే రుణాలపై ప్రభావం చూపదు. దీనికి కొం‍త సమయం పడుతుంది. ఈ సమయంలో మార్కెట్లు నష్టపోయే అవకాశం కూడా ఉంది. అంతేకాకుండా మందగమనం నుంచి వ్యవస్థ వెంటనే బయటకు రాలేదు.  ప్రజలలో నమ్మకాన్ని తీసుకొని రావడం రాత్రికిరాత్రే జరిగిపోదు. దీనికి ఓ ఆరు నెలల నుంచి ఏడాది సమయం పట్టే అవకాశం ఉంది. నా అంచనా ప్రకారం ఆర్థిక వ్యవస్థ మొదట పుంజుకుంటుంది. ఆ తర్వాత మార్కెట్‌ కొలుకునే అవకాశం ఉంది.

ఆటో, ఎన్‌బీఎఫ్‌సీ బెటర్‌!
చాలా మంది విదేశి ఇన్వెస్టర్లు లేదా సంస్థాగత ఇన్వెస్టర్లు అనేక స్టాక్స్‌ నుంచి తొందరగా బయటకు వెళ్లిపోయారు. వీరు ధరను గురించి కూడా పట్టించుకోలేదు. ఫలితంగా చాలా వరకు మంచి స్టాక్స్‌  15-20 శాతం పడిపోయాయి. కొన్ని స్టాకులపై అతిగా అంచనా వేయడం వలన అవి చాలా వరకు దిద్దుబాటుకు గురయ్యాయి.   
ప్రసుతం ఆటో సెక్టార్‌లో రుణాలు తక్కువగా ఉండి, నగదు లభ్యత అధికంగా ఉన్న స్టాకులు  ఆదాయానికి 10 రెట్లు వద్ద ట్రేడవుతున్నాయి. అంతేకాకుండా ఈ కంపెనీల ఆదాయాలు కూడా ఒక ఏడాదిలోపు తిరిగి మాములు స్థాయికి చేరుకునే అవకాశం ఉంది. అంతేకాకుండా ఇప్పటికి కూడా ఆటో సెక్టార్‌ షేర్ల కొనుగోలును ప్రజలు పూర్తిగా మానుకోలేదు. నిజానికి మన దేశంలో నెలకు 3 లక్షల కార్లను తయారుచేస్తుంటే, చైనాలో మన ఉత్పత్తి కంటే 15 లేదా 20 రెట్లు అధికంగా ఉత్పత్తి జరుగుతోంది. సుమారుగా ఇరు​ దేశాలు సమానంగా జనాభా కలిగి ఉండడంతో, మన ఉత్పత్తిని రెట్టింపు చేస్తే చైనా, కార్ల తయారి వలన పొందే లాభంలో 10 శాతాన్ని మనం సులుభంగా పొందుతాం. మన జనాభాలో 10 శాతం మంది కార్లను కొనుగోలు చేసేలాగా చర్యలు తీసుకుంటే, మన కార్ల అమ్మకాలు ఇప్పటి స్థాయి నుంచి రెట్టింపవుతాయి. ముందుకు వెళ్లే కొద్ది ఆటో రంగంలో చాలా మంచి అవకాశాలున్నాయి. ఇప్పుడు చూస్తున్న ఈ పరిస్థితి కేవలం తాత్కాలికమే. ఎప్పుడైన ఆటో సెక్టార్‌, ఆటో సహాయరంగాల స్టాకులు పడిపోతే  వాటిని కొనుగోలు చేయడమే ఉత్తమం. ఇక్కడ కూడా భయంతో కొనుగోలు చేయడం మానుకోవాలి. ఇప్పటికిప్పుడు తొందరపడి కొనుగోలు చేయవలసిన అవసరం లేదు. ఇప్పుడున్న పరిస్థితే వచ్చే ఆరు నెలల వరకు ఉండే అవకాశం ఉంది. అందువలన కొనుగోళ్ల కోసం వచ్చే ఆరు నెలల్లో ప్రణాళికలు వేసుకోండి. ఎన్‌బీఎఫ్‌సీ(నాన్‌ బ్యాంకింగ్‌ ఫైనాన్సియల్‌ కంపెనీ)ల విషయంలో రుణ మార్కెట్‌ను జాగ్రత్తగా గమనించడం ముఖ్యం. స్వల్పకాలానికైనా, దీర్ఘకాలానికైనా బాండ్‌ మార్కెట్‌, సీపీ మార్కెట్‌(కమర్షియల్‌ పేపర్స్‌)లలో నగదును పెంచే సామర్ధ్యం ఎన్‌బీఎఫ్‌సీలకు ఉంది. సరసమైన రేట్ల వద్ద ఫండ్స్‌ను పెంచే ఎన్‌బీఎఫ్‌సీలు ఉన్నాయి. రేట్ల కోత వీటికి బదిలీ అవుతుండడంతో వీటి ఎన్‌ఐఎం(నెట్‌ ఇంట్రస్ట్‌ మార్జిన్‌) మెరుగుపడే అవకాశం ఉంది. ఎన్‌బీఎఫ్‌సీ సెక్టార్‌లో కొన్ని షేర్లు భారీగా పడిపోయాయి.  ఇవన్నీ కాకపోయినా, వీటిలో నాణ్యమైనవి కొనుగోలు చేయవచ్చు.  మిగిలిన సెక్టార్‌లలో నిర్థిష్ట స్టాకులను  ఎంచుకోవడం మంచిది.
  

 You may be interested

షేర్‌ఛాట్‌ పది కోట్ల డాలర్ల సమీకరణ!

Tuesday 27th August 2019

భారత్‌లో అతిపెద్ద ప్రాంతీయ సోషల్‌ మీడియా ప్లాట్‌ఫామ్‌ షేర్‌ఛాట్‌ తాజాగా పది కోట్ల డాలర్లను సమీకరించింది. సీరిస్‌ డీ ఫండ్‌ రైజింగ్‌లో భాగంగా ఈ సమీకరణ జరిపినట్లు కంపెనీ తెలిపింది. ఇంతవరకు వివిధ రూపాల్లో 22.4 కోట్ల డాలర్లను షేర్‌ఛాట్‌ సేకరించింది. తాజా సమీకరణలో ఇప్పటికే కంపెనీ భాగస్వాములైన షున్‌వై క్యాపిటల్‌, లైట్‌స్పీడ్‌ వెంచర్‌ పార్టనర్స్‌, సైఫ్‌ క్యాపిటల్‌, ఇండియా కోయిషెంట్‌, మార్నింగ్‌సైడ్‌ వెంచర్‌ క్యాపిటల్‌ పాల్గొన్నాయి. ఈ ఫండింగ్‌లో

టాప్‌గేర్లో ఆటో రంగ షేర్ల ర్యాలీ

Tuesday 27th August 2019

నెమ్మదించిన వాహనరంగాన్ని పరుగులు పెట్టేందుకు కేంద్రం ఉపశమన చర్యలు ప్రకటించడంతో రెండోరోజూ ఆటో షేర్లు ర్యాలీ చేస్తున్నాయి.  వన్‌టైమ్‌ రిజిస్ట్రేషన్‌ ఫీజు వాయిదా వేయడం, ప్రభుత్వ విభాగాలు పెట్రోలు, డిజిల్‌ వాహనాలు కొనుగోలు చేయకుండా ఉన్న నిషేధాన్ని ఎత్తివేయడం, వచ్చే ఏడాది మార్చి 31 వరకు కొనుగోలు చేసే బీఎస్‌-4 వాహనాల రిజిస్ట్రేషన్‌ గడువు మొత్తం వరకు కొనసాగించడం లాంటి పలు ఉద్దీపన చర్యలు ప్రకటించారు. ఈ నేపథ్యంలో నిన్నటి

Most from this category