News


ఎంఏసీడీలో 36 స్టాకుల బేరిష్‌ సంకేతాలు

Wednesday 18th September 2019
Markets_main1568793546.png-28406

చమురు ఉత్పత్తిని ఈ నెల చివరి నాటికి పూర్తి స్థాయిలో పునరుద్ధరిస్తామని సౌదీ ప్రభుత్వం ప్రకటించడంతో పాటు యుఎస్‌ ఫెడ్‌ వడ్డీ రేట్లను తగ్గిస్తుందనే అంచనాలే నేపథ్యంలో దేశీయ స్టాకులు తిరిగి కోలుకుంటున్నాయి. కానీ విస్తృత మార్కెట్‌లో మాత్రం పాజిటివ్‌ మూమెంటం లేదని సాంకేతిక విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఎంఏసీడీ (మూవింగ్‌ యావరేజ్‌ కన్వర్జన్స్‌, డైవర్జన్స్‌)సూచీ ఆధారంగా ఎన్‌ఎస్‌ఈలో కేవలం నాలుగు స్టాకులు మాత్రమే టెక్నికల్‌ చార్టులో బలంగా ఉన్నాయని, 36 స్టాకులలో అమ్మకాల ఒత్తిడి(స్వల్పకాలంలో) నెలకొనే సంకేతాలు కన్పిస్తున్నాయన్నారు.
    ఎంఏసీడీ సూచీ ప్రకారం 36 స్టాకులు బేరిష్‌ సంకేతాలనిస్తున్నాయి. ఈక్విటాస్ హోల్డింగ్స్, యునైటెడ్ స్పిరిట్స్, స్ట్రైడ్స్ ఫార్మా, ఇంటర్ గ్లోబ్ ఏవియేషన్, పిరమల్ ఎంటర్ప్రైజెస్, వోల్టాస్ వంటి స్టాకులు ఎంఏసీడీ బేరిష్‌ క్రాస్‌ ఓవర్‌ను ఏర్పరిచిన స్టాకులలో ఉన్నాయి. వీటితో పాటు  జేఎస్‌డబ్యూ ఎనర్జీ, బాటా ఇండియా, కెపీఐటీ టెక్నాలజీస్, ప్రెస్టీజ్ ఎస్టేట్స్, ప్రభుత్వ రంగ సంస్థలయిన ఆర్‌ఈసీ(రూరల్‌ ఎలక్ట్రిఫికేషన్‌ కార్పోరేషన్‌), రైల్ వికాస్ నిగం, ఇండియన్ బ్యాంక్ షేర్లు కూడా బేరిష్ ట్రెండ్‌ను ప్రదర్శిస్తున్నాయి.
  కానీ ముథూట్ క్యాపిటల్, ఎల్ అండ్ టీ టెక్నాలజీ సర్వీసెస్, కాలిఫోర్నియా సాఫ్ట్‌వేర్, లింక్ పెన్  ఈ నాలుగు స్టాకులు ఎంఏసీడీ సూచీలో బుల్లీస్‌ క్రాస్‌ఓవర్‌ను ఏర్పరిచాయి.

ఎంఏసీడీ బేరిష్‌ క్రాస్‌ ఓవర్‌ అంటే?
    ఎవైనా స్టాకులు లేదా సూచీల ట్రెండ్‌ రివర్సల్‌ను తెలుసుకోవడంలో ఎంఏసీడీ సహాయపడుతుంది. 26 రోజులు, 12 రోజుల ఎక్సోపోనెన్సియల్‌ మూవింగ్‌ యావరేజ్‌ల భేదాన్ని ఎంఏసీడీ లైన్‌గా భావిస్తారు. అదే 9 రోజుల ఎక్సోపోనెన్సియల్‌ మూవింగ్‌ యావరేజిని సిగ్నల్‌ లైన్‌గా పిలుస్తారు. ఒకవేళ ఎంఏసీడీ లైన్‌, సిగ్నల్‌ లైన్‌ దాటి పైకి​వెళితే, అది బుల్లిష్‌ సంకేతమని, అదేవిధంగా ఎంఏసీడీ లైన్‌, సిగ్నల్‌ లైన్‌ దాటి దిగువకు వస్తే బేరిస్‌ సంకేతమని సాంకేతిక విశ్లేషకులు అంచనా వేస్తారు. కేవలం ఎంఏసీడీ సూచీ మాత్రమే ట్రేడింగ్‌ కాల్‌ను తీసుకోడానికి సరిపోదని విశ్లేషకులు తెలిపారు. ఇన్వెస్ట్‌ చేయాలనుకుంటే ఒకే సూచీపై ఎప్పుడూ ఆధారపడవద్దని విశ్లేషకులు సలహాయిస్తున్నారు. 
   తాజా అంతర్జాతీయ పరిస్థితుల వలన దేశీయ మార్కెట్‌లు సానుకూల దృక్పథం, మూమెంటంను కొల్పోయాయని ఏంజిల్‌ బ్రోకింగ్‌, సమీత్‌ ఛవన్‌ అన్నారు. ‘కీలక మద్ధతు స్థాయఅయిన 10,900ను నిఫ్టీ కోల్పోయింది. ప్రస్తుతం ఈ స్థాయి, తక్షణ నిరోధక స్థాయిలా పనిచేస్తుంది. బుల్స్‌ తిరిగి పుం‍జుకొని సోమవారం ప్రారంభ గరిష్ఠమయిన 11,000 స్థాయిని తప్పకుండా దాటాలి’ అని ఆయన అన్నారు. నిఫ్టీకి 10,970-11,000 జోన్‌ నిరోధకంగా పనిచేస్తుందని సాంకేతిక విశ్లేషకుడు అమిత్‌ షా అన్నారు.

‘ఈక్వటాస్‌’ ఎంఏసీడీ సూచీ:


ఈక్విటాస్‌ హోల్డింగ్స్‌ టెక్నికల్‌ చార్టు ఎంఏసీడీలో బేరిష్‌ క్రాస్‌ఓవర్‌ నమూనాను ఏర్పరిచింది. పై చార్టును గమనిస్తే ఎంఏసీడీ లైన్‌, సిగ్నల్‌ లైన్‌ దాటి దిగువకు పడిపోయిన ప్రతి సారీ ఈ స్టాకు నష్టపోయింది. ఈ స్టాకు మంగళవారం ఎన్‌ఎస్‌ఈ ట్రేడింగ్‌లో 2.01 శాతం నష్టపోయి రూ. 100 వద్ద ముగిసింది.

బేరిష్‌ క్రాస్‌ ఓవర్‌ ఏర్పరిచిన స్టాకులు: 
ఈక్విటాస్ హోల్డింగ్స్, యునైటెడ్ స్పిరిట్స్, స్ట్రైడ్స్ ఫార్మా, ఇంటర్ గ్లోబ్ ఏవియేషన్, పిరమల్ ఎంటర్ప్రైజెస్, వోల్టాస్, జేఎస్‌డబ్యూ ఎనర్జీ, బాటా ఇండియా, కెపీఐటీ టెక్నాలజీస్, ప్రెస్టీజ్ ఎస్టేట్స్, ఆర్‌ఈసీ(రూరల్‌ ఎలక్ట్రిఫికేషన్‌ కార్పోరేషన్‌), రైల్ వికాస్ నిగం, ఇండియన్ బ్యాంక్,  ఓరియంట్‌ ఎలక్ట్రిక్‌, రెడ్డింగ్‌టన్‌, జేకే లక్ష్మీ సిమెంట్‌, కేఈఐ ఇండస్ట్రీస్‌, జేకే సిమెంట్‌, అల్లైడ్‌ డిజిటల్‌ సర్వీసెస్‌, నవిన్‌ ఫ్లోరిన్‌, సుందరం ఫైనాన్స్‌, పీఎస్‌పీ ప్రాజెక్ట్స్‌, నారాయణ హృదయాలయా, అంబర్‌ ఎంటర్‌ప్రైజెస్‌.



You may be interested

ఒడిదుడుకులమయంగా బ్యాంక్‌ నిఫ్టీ ట్రేడింగ్‌

Wednesday 18th September 2019

బ్యాంక్‌ నిఫ్టీ ఇండెక్స్‌ బుధవారం ఉదయం ట్రేడింగ్‌లో తీవ్ర ఒడిదుడుకులకు లోనైంది. నేడు ఇండెక్స్‌ క్రితం ముగింపు(27,131.75)తో పోలిస్తే 174 పాయింట్ల లాభంతో 27,304.70 వద్ద ట్రేడింగ్‌ను ప్రారంభించింది. మార్కెట్‌ ఆరంభంలో బ్యాంకింగ్‌ రంగ షేర్లు అమ్మకాల ఒత్తిడికి లోనవడంతో ఇండెక్స్‌ ప్రారంభస్థాయి(27,304.70) నుంచి 216  పాయింట్లను నష్టపోయి 27,088.80 వద్ద ఇంట్రాడే కనిష్టానికి పతనమైంది. అనంతరం బ్యాంకింగ్‌ రంగ షేర్లకు మళ్లీ కొనుగోళ్ల మద్దతు లభించడంతో ఇండెక్స్‌ కనిష్టస్థాయి(

చమురు మంటతో భారత్‌కు అనర్థమే..!

Wednesday 18th September 2019

నోమురా హెచ్చరిక ‘మాంద్యం’ తరహా పరిస్థితికి దారితీస్తుందని విశ్లేషణ న్యూఢిల్లీ: అంతర్జాతీయంగా చమురు ధరల తీవ్రత భారత్‌ వంటి అభివృద్ధి చెందుతున్న దేశాల ఆర్థిక వ్యసస్థలపై తీవ్ర ప్రతికూల ప్రభావం చూపడం ఖాయమని జపాన్‌ ఫైనాన్షియల్‌ సేవల దిగ్గజ సంస్థ నోమురా విశ్లేషించింది. బలహీన వినియోగ డిమాండ్‌, అధిక చమురు ధరలు భారత్‌ వంటి ఆర్థిక వ్యవస్థలో మాంద్యం తరహా పరిస్థితి (స్టాగ్‌ఫ్లేషన్‌)కి దారితీస్తాయని పేర్కొంది. తన మొత్తంచమురు అవసరాల్లో 70 శాతానికిపైగా దిగుమతులపై

Most from this category