బ్యాంకు నిఫ్టీ తీవ్ర హెచ్చుతగ్గులు
By Sakshi

ఎస్ఎస్ఈలో బ్యాంకింగ్ రంగ షేర్లకు ప్రాతినిథ్యం వహించే నిఫ్టీ ఇండెక్స్ గురువారం తీవ్ర ఒడిదుడుకులకు లోనవుతోంది. ఉదయం లాభాలతో ట్రేడింగ్‌ను ప్రారంభించిన ఇండెక్స్ మిడ్‌సెషన్ కల్లా నష్టాల్లోకి జారుకుంది. ఇండెక్స్ నేడు 28,981.05 వద్ద ప్రారంభమైంది. మార్కెట్ ప్రారంభం నుంచి నేడు ప్రైవేట్ రంగ బ్యాంకింగ్ షేర్లకు కొనుగోళ్లు నెలకొనడంతో ఇండెక్స్ ఓ దశలో 288 పాయింట్లు(1శాతం) పెరిగి 29240.80 వద్ద ఇంట్రాడే కనిష్టాన్ని నమోదు చేసింది. అనంతరం మార్కెట్లో అమ్మకాలు జరగడంతో సూచీలు ఉదయం ఆర్జించిన లాభాలు అన్ని ఆవిరయ్యాయి. మధ్యాహ్నం గం.12:20ని.లకు ఇండెక్స్ గతముగింపు(28,952.25)తో పోలిస్తే పావుశాతం లాభంతో 29,021.15 వద్ద ట్రేడ్ అవుతోంది. ఇండస్ఇండ్ బ్యాంక్ దాదాపు 3శాతం వరకు ర్యాలీ చేసింది. ఐడీఎఫ్సీ ఫస్ట్ బ్యాంకు 2.50శాతం పెరిగింది. హెచ్‌ఢీఎఫ్‌సీ బ్యాంకు, కోటక్ బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్ షేర్లు 1శాతం ర్యాలీ చేశాయి. అలాగే ఎస్బీఐ బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంకు షేర్లు అరశాతం పెరిగాయి. మరోవైపు యస్ బ్యాంక్ షేర్లు 3శాతం నష్టపోయింది. పీఎన్బీ బ్యాంకు 2.50శాతం, ఆర్బీఎల్ బ్యాంకు 2శాతం పెరిగాయి. అలాగే ఫెడరల్ బ్యాంక్ 1శాతం, బ్యాంక్ ఆఫ్ బరోడా షేరు అరశాతం క్షీణించింది. నేడు బ్యాంకు నిఫ్టీ ఇండెక్స్‌కు కీలక మద్దతు ధర 28890 వద్ద, అలాగే 29304 వద్ద నిరోధ స్థాయి ఉన్నట్లు మార్కెట్ విశ్లేషకులు అంచనావేస్తున్నారు.
You may be interested
5నెలల కనిష్టానికి టాటామోటర్స్
Thursday 25th July 2019దేశీయ వాణిజ్య వాహన దిగ్గజ సంస్థ టాటామోటర్స్ షేర్లు గురువారం 5నెలల కనిష్టానికి పతనమయ్యాయి. నేడు కంపెనీ ప్రకటించే ప్రస్తుత ఆర్థిక సంవత్సరపు తొలిత్రైమాసిక ఫలితాలు ఆశించిన స్థాయిలో నమోదు కాకపోవచ్చనే అంచనాలు ఇందుకు కారణమయ్యాయి. నేడు బీఎస్‌లో ఈ కంపెనీ షేర్లు రూ.151.70 వద్ద ట్రేడింగ్‌ను ప్రారంభించాయి. ఈ క్యూ1లో కంపెనీ రూ.1,938 కోట్ల నికరనష్టాన్ని నమోదు చేయవచ్చని విశ్లేషకలు అంచనా వేస్తున్నారు. అంతకు ముందు ఇదే క్వార్టర్లో
నిఫ్టీ మాత్రమే నెగిటివ్ రిటర్న్స్ ఇచ్చింది!
Thursday 25th July 2019ప్రపంచ టాప్15 మార్కెట్లలో భారత మార్కెట్లదే పేలవ ప్రదర్శన మేనెల తర్వాత ప్రపంచ టాప్ మార్కెట్ ప్రదర్శనను పరిశీలిస్తే కేవలం ఇండియా మార్కెట్ మాత్రమే ఇప్పటివరకు నెగిటివ్ రాబడులు ఇచ్చినట్లు తెలుస్తోంది. మేలో మోదీ ప్రభుత్వ విజయం అనంతరం భారీ లాభాల్లోకి దూసుకుపోయిన దేశీయ మార్కెట్లు కేవలం రెండు నెలల్లో దాదాపు ఆ లాభాలన్నింటినీ తుడిచిపెట్టాయి. దీంతో డాలర్ లెక్కల్లో వరల్డ్ టాప్ 15 ఈక్విటీ మార్కెట్లలో ఒకే ఒక్క నెగిటివ్