News


ఇప్పుడు కొంటే బడ్జెట్‌ తర్వాత లాభాలే!

Tuesday 28th January 2020
Markets_main1580207954.png-31275

గత గణాంకాల విశ్లేషణతో నిపుణుల సూచన
సాధారణంగా ప్రతి బడ్జెట్‌ సమయంలో మార్కెట్‌ వర్గాల్లో ఆశలు, అంచనాలు అధికంగా ఉంటాయి. ఈ దఫా కూడా బడ్జెట్‌పై బోలెడు అంచనాలు, ఆశలు ఉన్నాయి, కానీ గతంతో పోలిస్తే తక్కువనే నిపుణులు చెబుతున్నారు. బడ్జెట్‌ ముందు వారం మార్కెట్లు స్తబ్దుగా ఉండడం ఎక్కువసార్లు జరిగినట్లు గత గణాంకాలు చెబుతున్నాయి. కానీ ఈ దఫా మార్కెట్లు ప్రీబడ్జెట్‌ వారంలో నెగిటివ్‌గా మారాయి. ఈ నేపథ్యంలో బడ్జెట్‌ అనంతరం మార్కెట్‌ సెంటిమెంట్‌ పాజిటివ్‌గా మారవచ్చని, గతంలో ఇలాగే ఎక్కువమార్లు జరిగిందని నిపుణులు విశ్లేషిస్తున్నారు. అందువల్ల కాస్త ధైర్యం చేయగలిగే ఇన్వెస్టర్లు తాజా పతనంలో మంచి షేర్లు కొని పెట్టుకుంటే బడ్జెట్‌ అనంతరం మంచి లాభాలు చూడవచ్చని సలహా ఇస్తున్నారు. 
పదేళ్లలో బడ్జెట్‌ ముందు, తర్వాత వారాల్లో మరియు బడ్జెట్‌ రోజున సూచీల ప్రదర్శనలు ఇలా ఉన్నాయి...

పదేళ్ల చరిత్ర చూస్తే బడ్జెట్‌ ముందు వారంలో సూచీలు పతనం కావడం ఆరు మార్లు జరిగింది. మూడు మార్లు పాజిటివ్‌గా, ఒక్కసారి ఫ్లాట్‌గా ప్రీబడ్జెట్‌ వారాన్ని సూచీలు ముగించాయి. బడ్జెట్‌ రోజున మార్కెట్లు ఒక్క శాతం కన్నా ఎక్కువ పతనం కావడం గత పదేళ్లలో మూడు మార్లు జరగగా, ఐదు సార్లు రేంజ్‌ బౌండ్‌లో ఉంది, రెండు మార్లు లాభాల్లోకి మారింది. ఇక బడ్జెట్‌ అనంతర వారాన్ని పరిశీలిస్తే పదేళ్లలో ఆరుసార్లు సూచీలు లాభాలను నమోదు చేశాయి, నాలుగుసార్లు నష్టాలను చవిచూశాయి. 2018, 2019లో బడ్జెట్లో తీసుకువచ్చిన లిస్టెడ్‌ కంపెనీల పబ్లిక్‌ షేర్‌హోల్డింగ్‌ ప్రతిపాదన, ఎల్‌టీసీజీ విధింపు.. మార్కెట్‌ సెంటిమెంట్‌ను దెబ్బతీశాయి. కానీ ఈ దఫా నిర్మలా సీతారామన్‌ అందరిని రంజిపజేసే బడ్జెట్‌ ప్రవేశపెట్టవచ్చని అంచనాలున్నాయి. ఆర్ధిక వృద్ధి బాగా తక్కువగా ఉన్నందున ఉద్దీపనలు, ఉత్ప్రేరకాలు బడ్జెట్లో ఉండవచ్చని నిపుణులు భావిస్తున్నారు. ఐటీ తగ్గింపు సహా 2020 బడ్జెట్లో అనేక పాజిటివ్‌ ప్రతిపాదనలుండొచ్చని బోఫాఎంఎల్‌ అభిప్రాయపడింది. దోలత్‌ క్యాపిటల్‌ కూడా ఇదే ఆలోచనలో ఉన్నట్లు తెలిపింది. 



You may be interested

మార్కెట్లోకి బజాజ్‌ బీఎస్‌-6 వాహనాలు

Tuesday 28th January 2020

100, 110 సీసీల్లో సీటీ, ప్లాటినా మోడళ్లు న్యూఢిల్లీ: ప్రముఖ ఆటోమొబైల్‌ కంపెనీ బజాజ్‌ మంగళవారం జీఎస్‌-6 వాహనాలను మార్కెట్‌లోకి విడుదల చేసింది. పర్యావరణ పరిరక్షణలో భాగంగా కేంద్ర సూచించిన బీఎస్‌-6 నిబంధనలకు అనుగుణంగా బజాజ్‌ సీటీ, ప్లాటినా మోడల్‌ బైక్‌లను అందుబాటులోకి తెచ్చింది. ఎలక్ట్రిక్‌ ఇంజెక్షన్‌(ఈఐ) వ్యవస్థను ఆమర్చిన ఈ బైక్‌ల  ప్రారంభ ధరను రూ.40,794గా నిర్ణయించారు. ఈఐ వ్యవస్థ వల్ల ఇంజిన్‌ స్మూత్‌గా నడవడమేగాక , మైలేజీని బాగా

41,000 దిగువకు సెన్సెక్స్‌

Tuesday 28th January 2020

సెన్సెక్స్‌ 188 పాయింట్లు మైనస్‌ 63 పాయింట్లు క్షీణించిన నిఫ్టీ మెటల్‌ ఇండెక్స్‌ మెల్టింగ్‌ ప్రపంచ మార్కెట్లలో నెలకొన్న ఆందోళనలు వరుసగా రెండో రోజు దేశీ స్టాక్‌ మార్కెట్లను దెబ్బతీశాయి. దీంతో తొలుత లాభాలతో ప్రారంభమైనప్పటికీ చివరి రెండు గంటల్లో పెరిగిన అమ్మకాలు మార్కెట్లకు షాకిచ్చాయి. వెరసి సెన్సెక్స్‌ 41,000 పాయింట్ల మార్క్‌ దిగువకు చేరింది. ట్రేడింగ్‌ ముగిసేసరికి సెన్సెక్స్‌ 188 పాయింట్లు క్షీణించి 40,967 వద్ద నిలిచింది. ఇక నిఫ్టీ 63 పాయింట్ల

Most from this category