News


అనిశ్చితి మార్కెట్లో సిప్‌ పెట్టుబడులు మేలు!

Monday 2nd March 2020
Markets_main1583133851.png-32214

మార్చి సిరీస్‌పై గ్లోబల్‌  మార్కెట్ల ప్రభావం
10,800పైన నిలదొక్కుకుంటే నిఫ్టీలో రికవరీ
-ఉమేష్‌ మెహతా, శామ్‌కో సెక్యూరిటీస్‌ రీసెర్చ్‌ హెడ్‌

కరోనా వైరస్‌ సృష్టిస్తున్న విలయంతో ప్రపంచవ్యాప్తంగా ఇన్వెస్టర్లు ఆందోళనకు లోనవుతున్నారు. దీంతో దేశీయంగానూ గత వారం ఎన్‌ఎస్‌ఈ ప్రధాన ఇండెక్స్‌ నిఫ్టీ 7 శాతం పతనమైంది. అయితే 10,850-10800 పాయింట్ల స్థాయిలో నిఫ్టీ నిలదొక్కుకుంటే రికవరీకి వీలుందంటున్నారు ఉమేష్‌ మెహతా. శామ్‌కో సెక్యూరిటీస్‌ రీసెర్చ్‌ హెడ్‌.. మెహతా ఒక ఇంటర్వ్యూలో ఇంకా పలు అంశాలపై అభిప్రాయాలను వ్యక్తం చేశారు. వివరాలు చూద్దాం..

సానుకూల వ్యూ
ఇటీవల మార్కెట్లు భారీగా పతనమైనప్పటికీ సాంకేతికంగా కీలకమైన 10,850-10,800 స్థాయిలో నిఫ్టీ నిలదొక్కుకోగలిగితే.. రికవరీకి వీలుంటుంది. తద్వారా తిరిగి 11,800 పాయింట్లవైపు ప్రయాణిం‍వచ్చు. అయితే ప్రపంచవ్యాప్తంగా బలహీనపడ్డ సెంటిమెంటు కారణంగా రికవరీ ఆలస్యమయ్యే అవకాశముంది. ఈ సమయం‍లో మార్కెట్లు ఆటుపోట్లను చవిచూడక తప్పకపోవచ్చు, కొంతకాలంపాటు కన్సాలిడేషన్‌ జరగనుంది. గత వారం 11,300 కీలక మద్దతు స్థాయికంటే దిగువకు నిఫ్టీ చేరుకుంది. అయితే సాంకేతికంగా చెప్పాలంటే అప్‌వార్డ్‌ స్లోపింగ్‌ రైజింగ్‌ చానల్‌లో కదులుతున్నంతకాలం నిఫ్టీ పుంజుకునేందుకు వీలుంటుంది. మార్కెట్లలో నెలకొన్న ప్రస్తుత పరిస్థితులలో ఎంపిక చేసుకున్న స్టాక్స్‌ను విడతలవారీగా కొనుగోలు చేయవచ్చు, హెచ్చుతగ్గుల ఈ మార్కెట్లో సిస్టమాటిక్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ పథకం(సిప్‌)లో భాగంగా పెట్టుబడులు చేపట్టడం మేలు.  

మార్చి సిరీస్‌
గత గురువారం ముగిసిన ఫిబ్రవరి సిరీస్‌లో నిఫ్టీ 3 శాతానికిపైగా క్షీణించింది. ప్రస్తుత(మార్చి) సిరీస్‌లోనూ నిఫ్టీ ఆటుపోట్లను చవిచూడనుంది. ప్రస్తుతానికి కన్సాలిడేషన్‌ బాటలో సాగే సంకేతాలున్నాయి. సమీప భవిష్యత్‌లో ప్రపంచ స్టాక్‌ మార్కెట్లలో నెలకొనే పరిస్థితులు దేశీయంగానూ ప్రభావం చూపే వీలుంది. కాగా.. ఆరు నెలల కన్సాలిడేషన్‌ తదుపరి రూపాయి బ్రేకవుట్‌ అయ్యింది. హెచ్చుతగ్గులు, ప్రతికూల పరిస్థితుల మధ్య రూపాయి మరింత నీరసించే అవకాశముంది. కరోనా కారణంగా విదేశీ పెట్టుబడులు రక్షణాత్మక సాధనాలలోకి మళ్లే వీలుంది. ఇది రూపాయిని దెబ్బతీయవచ్చు.

ఐదు స్టాక్స్‌
ఈ వారానికి సంబంధించి శ్రీరామ్‌ ట్రాన్స్‌పోర్ట్‌ ఫైనాన్స్‌, బాలకృష్ణ ఇండస్ట్రీస్‌, అజంతా ఫార్మా కౌంటర్లను ప్రస్తావించవచ్చు. రెండు, మూడేళ్ల అండర్‌ పెర్ఫార్మెన్స్‌ తదుపరి ఈ కౌంటర్లు బ్రేకవుట్‌ సాధించాయి. దీంతో ఇకపై ఈ మూడు కౌంటర్లు మరింత బలపడే సూచనలు కనిపిస్తున్నాయి. ఇక మరోపక్క రెండేళ్ల కన్సాలిడేషన్‌ తదుపరి బ్రేకవుట్‌ సాధించిన ఏఐఏ ఇంజినీరింగ్‌ ప్రధాన అప్‌ట్రెండ్‌లో కొనసాగుతోంది. ఇదే విధంగా ఎస్కార్ట్స్‌ లిమిటెడ్‌ కౌంటర్‌ ఇటీవల ఇం‍టర్మీడియట్‌ ట్రెండ్‌ రివర్స్‌ను సాధించింది. వెరసి ప్రధాన అప్‌ట్రెండ్‌ బాట పట్టనున్నట్లు సంకేతాలు అందుతున్నాయి.



You may be interested

చైనా ఎలక్ట్రానిక్స్‌ అమ్మకాలు... ఇండియాలో పడిపోయాయ్‌!

Monday 2nd March 2020

చైనా దేశంలో తయారయ్యే అనేక రకాల ఎలక్ట్రానిక్‌ ఉత్పత్తుల అమ్మకాలు ఇండియాలో గణనీయంగా పడిపోయాయి. చైనా నుంచి ఇండియాకు దిగుమతి అవ్వాల్సిన ఐ ఫోన్స్‌, ఇతర బ్రాండ్లకు చెందిన స్మార్ట్‌ఫోన్ల సరఫరా.. చైనాలో కోవిడ్‌-19 వ్యాప్తితో నిలిచిపోవడంతో అమ్మకాలు తగ్గాయి. భారత రిటైల్‌ మార్కెట్‌లో షావోమీ, టీసీఎల్‌, రియల్‌మీ వంటి ఫోన్ల కొరత ఏర్పడింది. గత కొద్ది వారాల్లో కేవలం 10-20 శాతం మాత్రమే ఫోన్లు స్టోర్లకు సరఫరా అయ్యాయి.

లాభాల బాటలో అటో షేర్లు

Monday 2nd March 2020

కరోనా వైరస్‌ ప్రభావంతో ఫిబ్రవరిలో అటో అమ్మకాలు క్షీణించినప్పటికీ..., ఈ రంగానికి చెందిన షేర్లు మాత్రం సోమవారం ఉదయం ట్రేడింగ్‌ సెషన్‌లో లాభాల బాటపట్టాయి. మార్కెట్లో నెలకొన్న షార్ట్‌ కవరింగ్‌లో భాగంగా అటోరంగ షేర్లకు కొనుగోళ్ల మద్దతు లభిస్తుంది. ప్రముఖ బ్రోకరేజ్‌ సంస్థ మోతీలాల్‌ ఓస్వాల్‌ సైతం వాహనరంగ షేర్లకు కొనుగోలు రేటింగ్‌ను సిఫార్సు చేయడం సెంటిమెంట్‌ను బలపరిచింది. ఫలితంగా ఎన్‌ఎస్‌ఈలో అటోరంగ షేర్లకు ప్రాతినిథ్యం వహించే నిఫ్టీ అటో

Most from this category