News


ఈ వారం రికమెండేషన్లు

Monday 4th November 2019
Markets_main1572837557.png-29314

ఎస్‌బీఐ    కొనచ్చు 
బ్రోకరేజ్‌ సంస్థ:- ఎడెల్‌వీజ్‌ ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌ 
ప్రస్తుత ధర:- రూ.313
టార్గెట్‌ ధర:- రూ.390

ఎందుకంటే:- దేశంలో అతి పెద్ద వాణిజ్య బ్యాంక్‌ ఇదే. ఈ బ్యాంక్‌ బ్యాలెన్స్‌ షీట్‌ సైజు రూ.36 లక్షల కోట్లుగా, మార్కెట్‌ క్యాపిటలైజేషన్‌ రూ.2.5 లక్షల కోట్లుగా ఉన్నాయి. దేశవ్యాప్తంగా దాదాపు 22 వేల బ్రాంచ్‌లతో 43 కోట్లకు పైగా ఖాతాదారులకు సేవలందిస్తోంది. యోనో యాప్‌తో డిజిటల్‌ స్పేస్‌లోనూ జోరు చూపిస్తోంది. గత రెండేళ్లుగా మార్జిన్లు అధికంగా ఉండే రిటైల్‌ రుణాలపై ఎక్కువగా దృష్టి కేంద్రీకరిస్తోంది. ఫలితంగా వృద్ధి జోరును కొనసాగిస్తోంది.  స్ప్రెడ్స్‌ మెరుగుపడ్డాయి. ఆర్థిక వ్యవస్థలో మందగమనం ఎస్‌బీఐ పనితీరుపై ప్రతికూల ప్రభావం చూపించవచ్చు. అయితే కేటాయింపులు అధికంగా ఉండటం, పోటీ పెద్దగా లేకపోవడం, అవకాశాలను అందిపుచ్చుకునే స్థాయిలో పటిష్టమైన నిర్వహణ, త్వరలో ఎస్‌బీఐ కార్డ్స్‌ ఐపీఓ(ఇనీషియల్‌ పబ్లిక్‌ ఆఫర్‌)కు రానుండటం, ....ఇవన్నీ సానుకూలాంశాలు. బ్యాంకేతర రంగాల్లో కార్యకలాపాలు నిర్వహిస్తున్న అనుబంధ సంస్థలు మంచి పనితీరు కనబరుస్తున్నాయి. ఈ బ్యాంక్‌ ఏర్పాటు చేసిన జాయింట్‌వెంచర్ల భాగస్వాములు కూడా పటిష్టమైనవే కావడం ఈ బ్యాంక్‌కు కలసివచ్చే అంశమే. రెండేళ్లలో కేటాయింపులకు ముందుడే నిర్వహణ లాభం (పీపీఓపీ-ప్రి ప్రొవిజన్‌ ఆపరేటింగ్‌ ప్రాఫిట్‌) 17 శాతం చొప్పున చక్రగతిన వృద్ధి చెందగలదని బ్యాంక్‌ అంచనా వేస్తోంది. ఆర్థిక పరిస్థితులు మరింత అస్తవ్యస్తమవుతే, భారీగా రిటైల్‌ రుణాలందిస్తున్న ఈ బ్యాంక్‌పై ప్రతికూల ప్రభావం పడొచ్చు. మారుమూల ప్రాంతాల్లోకి విస్తరిస్తున్న ప్రైవేట్‌ బ్యాంక్‌ల వల్ల పోటీ పెరిగి ఎస్‌బీఐ మార్కెట్‌ వాటా తగ్గే అవకాశం ఉంది. .... ఈ రెండు ప్రతికూలాంశాలు. 

ఐసీఐసీఐ బ్యాంక్‌     కొనచ్చు 
బ్రోకరేజ్‌ సంస్థ:- రిలయన్స్‌ సెక్యూరిటీస్‌
ప్రస్తుత ధర:- రూ.462
టార్గెట్‌ ధర:- రూ.570
ఎందుకంటే:-
ఈ ప్రైవేట్‌ రంగ బ్యాంక్‌ ఈ ఆర్థిక సంవత్సరం సెప్టెంబర్‌ క్వార్టర్లో నిర్వహణ పరంగా మంచి పనితీరు సాధించింది. నికర వడ్డీ ఆదాయం 26 శాతం, ప్రి ప్రొవిజనింగ్‌ నిర్వహణ లాభం(పీపీఓపీ) 31 శాతం చొప్పున వృద్ధి చెందాయి. కేటాయింపులు అంచనాలను మించడం, పన్ను వాయిదా కేటాయింపుల కారణంగా నికర లాభం తగ్గింది. ఫీజు ఆదాయం పెరగడం, ట్రెజరీ లాభాల కారణంగా ఇతర ఆదాయం పెరిగింది. రుణ నాణ్యత మెరుగుపడింది. సీక్వెన్షియల్‌గా చూస్తే, నికర మొండి బకాయిలు 12 బేసిస్‌ పాయింట్లు తగ్గి 6.4 శాతానికి చేరాయి. తాజా మొండి బకాయిలు వార్షికంగా 1.6 శాతం మేర తగ్గాయి. ప్రొవిజన్‌ కవరేజ్‌ రేషియో (పీసీఆర్‌) సీక్వెన్షియల్‌గా 1.6 శాతం మెరుగపడి 76 శాతానికి చేరింది. రిటైల్‌ రుణాల్లో మొండి బకాయిలు స్వల్పంగా పెరుగుతున్నా, ఆ పెరుగుదల నియంత్రణ స్థాయిలోనే ఉంది. నికర వడ్డీ మార్జిన్‌(ఎన్ఐఎమ్‌) సీక్వెన్షియల్‌గా చూస్తే, 3 బేసిస్‌ పాయింట్లు పెరిగి 3.64 శాతానికి ఎగసింది. రుణాలు 13 శాతం పెరిగాయి. కార్పొరేట్‌ రుణాలకు సంబంధించిన ఒత్తిడి తగ్గుతోంది. గత ఆర్థిక సంవత్సరంలో 4.8 శాతంగా ఉన్న నికర మొండి బకాయిలు వచ్చే ఆర్థిక సంవత్సరం కల్లా 1.6 శాతానికి తగ్గుతాయని అంచనా వేస్తున్నాం. అలాగే గత ఆర్థిక సంవత్సరంలో 6.6 శాతంగా ఉన్న రిటర్న్‌ ఆన్‌ ఈక్విటీ(ఆర్‌ఓఈ) వచ్చే ఆర్థిక సంవత్సరంలో 16.5 శాతానికి పెరుగుతుందని భావిస్తున్నాం. You may be interested

అప్పు చేసి ఫండ్స్‌లో ఇన్వెస్ట్‌ చేయొచ్చా ?

Monday 4th November 2019

(ధీరేంద్ర కుమార్‌, వాల్యూ రీసెర్చ్‌ సీఈవో) ప్ర: నా వయస్సు 36 సంవత్సరాలు. తాతల నాటి ఆస్తి కేసు ఒక కొలిక్కి వచ్చి నా వాటాగా రూ.36 లక్షలు వచ్చాయి. ఈ డబ్బులను గృహ రుణం తీర్చడానికి వినియోగించాలా ?లేక రిటైర్మెంట్‌ అవసరాల కోసం ఈక్విటీ ఫండ్స్‌ల్లో ఇన్వెస్ట్‌ చేయాలా ? తగిన సలహా ఇవ్వండి. - వంశీ, హైదరాబాద్‌ జ: ఈ డబ్బులను ఈక్విటీ ఫండ్స్‌లో ఇన్వెస్ట్‌ చేస్తేనే మంచిది. ఎవరైనా సరే

సెన్సెక్స్‌ తక్షణ మద్దతుశ్రేణి 39,920–39,800

Monday 4th November 2019

అమెరికా కేంద్ర బ్యాంక్‌ ఫెడరల్‌ రిజర్వ్‌ మరోదఫా వడ్డీ రేట్లను తగ్గించడం, అమెరికా–చైనాల మధ్య ట్రేడ్‌డీల్‌ కుదిరే అవకాశాలు మెరుగుపడటంతో అమెరికా, బ్రెజిల్‌ సూచీలు కొత్త రికార్డుల్ని అందుకోగా, పలు యూరప్, ఆసియా సూచీలు నెలల గరిష్టస్థాయికి పెరిగాయి. ఈ ట్రెండ్‌తో పాటు  అటు విదేశీ ఇన్వెస్టర్లు, ఇటు దేశీయ ఫండ్స్‌ కలిసికట్టుగా  కొనుగోళ్లు జరుపుతున్న కారణంగా బీఎస్‌ఈ సెన్సెక్స్‌ ఇప్పటికే కొత్త రికార్డు స్థాయిని చేరగా, ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ

Most from this category