STOCKS

News


మిడ్‌క్యాప్‌లో రాబడులకు కోటక్‌ పోర్ట్‌ఫోలియో

Thursday 8th August 2019
Markets_main1565288793.png-27646

ఆర్‌బీఐ తాజాగా 35 బేసిస్‌ పాయింట్ల మేర రేట్ల కోత నిర్ణయం తీసుకోవడం మార్కెట్లకు రుచించలేదు కానీ, ఎఫ్‌పీఐలపై సర్‌చార్జీ మినహాయింపు, దీర్ఘకాలిక మూలధన లాభాలపై పన్ను మినహాయింపు ప్రతిపాదనలను కేంద్ర ప్రభుత్వం పరిశీలిస్తుందున్న వార్తలు గురువారం స్టాక్‌ సూచీలను పరుగులు తీయించాయి. అయితే, మార్కెట్లు ఇప్పటికప్పుడు తిరిగి గాడిన పడి ర్యాలీ చేస్తాయన్న అభిప్రాయం ఏ ఒక్క విశ్లేషకుని మాటల్లోనూ కనిపించడం లేదు. కాకపోతే దీర్ఘకాలం పాటు ఓపిక పట్టే ఇన్వెస్టర్లకు పెట్టుబడులు పెట్టేందుకు మంచి అనుకూల సమయంగా పేర్కొంటున్నారు. ఈ విధంగా చూసినప్పుడు మిడ్‌క్యాప్‌లో కోటక్‌  ఇనిస్టిట్యూషనల్‌ ఈక్విటీస్‌ కొన్ని స్టాక్స్‌ను సూచించింది.  

 

‘‘మేము ఇప్పటికీ అప్రమత్త ధోరణితోనే ఉన్నాం. ఆర్థిక మందగమనం కారణంగా ఎర్నింగ్స్‌ సీజన్‌ ఇప్పటికీ స్తబ్దుగానే ఉంది. కనుక దేశీయంగా సెంటిమెంట్‌ బలహీనంగానే ఉంటుందని అంచనా వేస్తున్నాం. అంతర్జాతీయంగా అమెరికా, చైనా మధ్య ఇటీవల పెరిగిన వాణిజ్య ఉద్రిక్తతలు మార్కెట్‌ భాగస్వాములను దూరంగా ఉంచుతున్నాయి. చమురు ధరలు, కరెన్సీల్లో అస్థిరతలకు దారితీస్తు‍న్నాయి’’అని రెలిగేర్‌ బ్రోకింగ్‌ రీసెర్చ్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ అజిత్‌ మిశ్రా పేర్కొన్నారు. కంపెనీల ఆదాయ, లాభాల్లో మొత్తం మీద మందగమనం కనిపిస్తోందని ఎంకే వెల్త్‌ మేనేజ్‌మెంట్‌ రీసెర్చ్‌ హెడ్‌ జోసెఫ్‌ థామస్‌ పేర్కొన్నారు. ఇటీవలి కరెక్షన్‌ స్టాక్స్‌ విలువలను ఆకర్షణీయ స్థాయి సమీపానికి చేర్చాయన్నారు. అయితే, ఎర్నింగ్స్‌ తగ్గిపోవడం, ఆర్థిక మందగమనం నేపథ్యంలో మార్కెట్లు ఇప్పటికీ కొంచెం అధిక వ్యాల్యూషన్‌లోనే ఉన్నట్టు చెప్పారు. బడ్జెట్‌లో రూ.2 కోట్లు దాటిన అధిక ఆదాయ వర్గాలపై ఆదాయపన్ను సర్‌చార్జీని భారీగా పెంచుతూ ఆర్థిక మంత్రి ప్రతిపాదించడం, ఆ తర్వాత నుంచి ఎఫ్‌పీఐలు భారీగా విక్రయాలు జరుపుతున్న విషయం తెలిసిందే. జూలై నుంచి ఇప్పటి వరకు రూ.25,000 కోట్లకు పైగానే వారు విక్రయాలు చేశారు. 

 

నిపుణులు మాత్రం ఇప్పుడున్న పరిస్థితుల్లో జాగ్రత్తగా మసలుకోవాలని, నాణ్యమైన స్టాక్స్‌ను ఒకేసారి కాకుండా క్రమంగా కొంటూ వెళ్లాలని సూచిస్తున్నారు. ఈ ఏడాది చివరికి లేదా వచ్చే ఏడాదికి గానీ మార్కెట్లు రికవరీ కావని, నాణ్యమైన స్టాక్స్‌లో పెట్టుబడులు ఏడాది నుంచి మూడేళ్ల కాలంలో మంచి రాబడులను ఇవ్వగలవని సూచిస్తున్నారు. కోటక్‌ ఇనిస్టిట్యూషన్‌ ఈక్విటీస్‌ నివేదిక ప్రకారం... సీఈఎస్‌సీ, ఎస్కార్ట్స్‌, ఈక్విటాస్‌ హోల్డింగ్స్‌, ఫెడరల్‌ బ్యాంకు, జుబిలంట్‌ ఫుడ్‌వర్క్స్‌, కల్పతరు పవర్‌ ట్రాన్స్‌మిషన్‌, మహీంద్రా అండ్‌ మహీంద్రా ఫైనాన్షియల్‌, మ్యాక్స్‌ ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌, నారాయణ హృదయాలయ, పెట్రోనెట్‌ ఎల్‌ఎన్‌జీ, ప్రెస్టీజ్‌ ఎస్టేట్‌ ప్రాజెక్ట్స్‌, శ్రీరామ్‌ సిటీ యూనియన్‌ ఫైనాన్స్‌, శ్రీరామ్‌ ట్రాన్స్‌పోర్ట్‌, టాటాపవర్‌, థర్మాక్స్‌లో మూడింటికి యాడ్‌ రేటింగ్‌, మిగిలిన వాటికి బై రేటింగ్‌ ఇచ్చింది. 11 శాతం నుంచి 98 శాతం వరకు అప్‌సైడ్‌కు అవకాశం ఉన్నట్టు తెలిపింది. You may be interested

నా పెట్టుబడుల విలువ కూడా పడిపోయింది...: విజయ్‌ కేడియా

Friday 9th August 2019

తన పెట్టుబడుల విలువ కూడా ప్రస్తుత మార్కెట్‌ పతనంలో పడిపోయిందని, నిజం చెప్పాలంటే తాను ఏమాత్రం ఆందోళన చెందడం లేదని ప్రముఖ బడా ఇన్వెస్టర్‌ విజయ్‌ కేడియా తెలిపారు. అవి టర్న్‌ అరౌండ్‌ అవుతాయన్న నమ్మకం తనకు ఉందన్నారు. తాను ఇన్వెస్ట్‌ చేసిన కంపెనీలు అన్నీ చక్కటి నిర్వహణతో కూడినవని, రుణాల విషయంలోనూ సౌకర్యంగానే ఉన్నాయని, మార్కెట్‌ ధోరణలు, టెక్నాలజీలను తట్టుకుని నిలదొక్కుకోగలవని విజయ్‌ కేడియా పేర్కొన్నారు. కేడియా సెక్యూరిటీస్‌

11000 పైన ముగిసిన నిఫ్టీ

Thursday 8th August 2019

మిడ్‌సెషన్‌ నుంచి మొదలైన కొనుగోళ్లతో గురువారం మార్కెట్‌ లాభంతో ముగిసింది. సెన్సెక్స్‌ 636 పాయింట్లు లాభపడి 37,327.36 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 177 పాయింట్లు పెరిగి 11,032.45 ముగిసింది. ఇటీవల అంతర్జాతీయ మార్కెట్లో నెలకొన్న బలహీన సంకేతాలు కాస్త మెరుగుపడటంతో పాటు కనిష్టస్థాయిల వద్ద సూచీలకు కొనుగోళ్ల మద్దతు లభించడం మార్కెట్‌ సెంటిమెంట్‌ను బలపరించింది. అలాగే బడ్జెట్‌లో ప్రతిపాదించిన సంపన్న వర్గాలపై పన్ను విధింపును ఎత్తివేసే యోచనలో ప్రభుత్వం ఉన్నట్లు

Most from this category