News


ప్రైవేట్‌ బ్యాంక్‌లు, మెటల్స్‌కే మా ప్రాధాన్యం!

Monday 11th November 2019
Markets_main1573447998.png-29499

‘దేశీయ బెంచ్‌మార్క్‌ సూచీ నిఫ్టీ, గత వారంలో మరోసారి 12000 స్థాయి వద్ద పరీక్షను ఎదుర్కొంది. నిఫ్టీ ర్యాలీకి వివిధ రంగాలు తోడ్పాటునందినప్పటికి, బ్యాంకింగ్‌, ఫైనాన్సియల్‌ షేర్లు వీటి ప్రదర్శనను మరుగునపరిచాయి’ అని రెలిగేర్‌ బ్రోకింగ్‌, వీపీ రీసెర్చ్‌, అజిత్‌ మిశ్రా అన్నారు. అయినప్పటికి ఇప్పటికి కూడా విస్తృత సూచీలు ఒత్తిడిలోనే ఉన్నాయని అన్నారు. ‘మధ్యస్థ కన్సాలిడేషన్‌ జరగడంతో గత ఐదు వారాలలో నిఫ్టీ, 11,100 స్థాయి నుంచి 12,000 స్థాయి వరకు గణనీయంగా పెరిగింది. ఈ పెరుగుదల తర్వాత స్వల్పంగా లాభాల స్వీకరణ చోటు చేసుకోవడంతో సూచీలు కన్సాలిడేట్‌ అవుతూ కదిలాయి. వచ్చే వారం నిఫ్టీ 11,700-12,100 పరిధిలో నిఫ్టీ కదులుతుందని అంచనా వేస్తున్నాం’ అని తెలిపారు. అంతేకాకుండా రంగాల వారిగా చూసుకుంటే బ్యాంకులు, ఫైనాన్సియల్స్‌, మెటల్‌ షేర్లు మంచి ప్రదర్శన చేయనున్నాయని అభిప్రాయపడ్డారు. ‘ఇతర రంగాల నుంచి నిర్ధిష్టమైన స్టాకులు రాణిస్తాయి. అయినప్పటికి విస్తృత మార్కెట్‌ ఒత్తిడిలో కొనసాగుతుందని అంచనావేస్తున్నాం. బెంచ్‌మార్క్‌ ఇండెక్స్‌ దిద్దుబాటుకు గురయిన దశలో, స్టాకులు ప్రతిస్పందించడం చూస్తుంటం. కొం‍త లాభాలను బుక్‌ చేసుకోమని సలహాయిస్తున్నాం. అంతేకాకుండా స్టాకుల ఎంపికపై అధికంగా దృష్ఠి పెట్టాలని సలహాయిస్తున్నాం. వీటితోపాటు అంతర్జాతీయ పరిణామాలు, కార్పోరేట్‌ ఫలితాలపై కూడా దృష్ఠి పెట్టాలి. బెంచ్‌మార్క్‌ ఇండెక్స్‌తో పోల్చుకుంటే విస్తృత సూచిలు నిరాశజనకంగా ట్రేడవుతుండడంతో, ఇండెక్స్‌లో ప్రధాన వాటిపై దృష్ఠి పెట్టాలని సలహాయిస్తున్నాం’ అని వివరించారు.  



You may be interested

నిఫ్టీలో ఐరన్‌ బటర్‌ఫ్లై వ్యూహం బెటర్‌!

Monday 11th November 2019

నిపుణుల సూచన నిఫ్టీ పరిమిత శ్రేణిలో కదలాడే అవకాశాలున్న ఈ సమయంలో ఐరన్‌బటర్‌ఫ్లై వ్యూహం అవలంబించడం మంచిదని ఆప్షన్‌ నిపుణులు సలహా ఇస్తున్నారు. నిఫ్టీ ప్రస్తుత స్థాయిల నుంచి 400 పాయింట్ల రేంజ్‌లో కదలాడితే ఈ వ్యూహం సత్ఫలితాలనిస్తుంది. మార్కెట్లు ర్యాలీ జరిపి అలసినందున గరిష్ఠాల వద్ద ప్రాఫిట్‌బుకింగ్‌ ఉండొచ్చని యాక్సిస్‌ సెక్యూరిటీస్‌ తెలిపింది. ఇలాంటప్పుడు ఈ బటర్‌ఫ్లై వ్యూహం మంచిదని సూచించింది. ఈ వ్యూహంలో 11900 పాయింట్ల కాల్‌ మరియు

బ్యాంక్‌ ఆఫ్‌ బరోడాకు ఫలితాల బూస్ట్‌...5 శాతం అప్‌

Monday 11th November 2019

5శాతం లాభపడి షేరు మెరుగైన రెండో త్రైమాసిక ఫలితాలు ప్రకటించడంతో ప్రభుత్వ రంగ బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా షేరు మార్కెట్‌ ట్రేడింగ్‌ ప్రారంభంలోనే 5.50శాతం లాభపడింది. నేడు బీఎస్‌ఈలో ఈ షేరు రూ.94.00 వద్ద ట్రేడింగ్‌ను ప్రారంభించింది.లాభదాయకమైన క్యూ2 ఫలితాలను ప్రకటించడం‍తో ఇన్వెస్టర్లు ట్రేడింగ్‌ ప్రారంభంలోనే ఈ షేరు కొనుగోలుకు మొగ్గుచూపారు. ఫలితంగా ఒక దశలో 5.50శాతం లాభపడి రూ.98.90 వద్ద గరిష్టస్థాయిని తాకింది. ఉదయం గం.10.00లకు షేరు గత ముగింపు

Most from this category