మరో 5 శాతం పతనమైతే ఆర్ఐఎల్ కొనొచ్చు!
By D Sayee Pramodh

షేర్‌ఖాన్ వైస్‌ప్రెసిడెంట్ హేమాంగ్ జాని సూచన
రెండు నెలలుగా రిలయన్స్ ఇండస్ట్రీస్ షేరు ప్రధాన సూచీల కన్నా మంచి ప్రదర్శన చూపిందని షేర్‌ఖాన్ వైస్‌ప్రెసిడెంట్ హేమాంగ్ జాని చెప్పారు. తాజాగా విడుదల చేసిన త్రైమాసిక ఫలితాలు అంచనాలకు అనుగుణంగానే ఉన్నాయన్నారు. కంపెనీ కొత్త వ్యాపారాలు అదరగొడుతున్నాయన్నారు. కంపెనీ కోర్ బిజినెస్ మాత్రం సవాళ్లను ఎదుర్కొంటోందని అభిప్రాయపడ్డారు. ఇందుకు మందగమనమే ప్రధాన కారణమన్నారు. పెట్‌కెమ్, రిఫైనింగ్ వ్యాపారాల్లో ఇప్పటికిప్పుడే వృద్ది రాకపోవచ్చన్నారు. ప్రస్తుతం షేరు వాల్యూషన్లు దిగివస్తున్నాయని చెప్పారు. అందువల్ల షేరు ఆకర్షణీయంగా ఉందని చెప్పారు. ఇప్పటి రేటు నుంచి మరో 3- 5 శాతం పతనమైతే షేరును కొనుగోలు చేయవచ్చని సిఫార్సు చేశారు.
ఎన్బీఎఫ్సీ సంక్షోభం
గత కొన్ని నెలలుగా ఎన్బీఎఫ్సీ రంగం తీవ్ర సంక్షోభంలో చిక్కుకుంది. అయితే ఈ సమయంలో కూడా బలమైన ఎన్బీఎఫ్సీలు మంచి ప్రదర్శననే చూపాయని జాని చెప్పారు. ఇప్పటికైతే ఇంకా ఈ రంగంలో సంక్షోభం సమసిపోలేదన్నారు. రాబోయే రోజుల్లో బలమైన బాలెన్స్ షీటు, మంచి కాసా వృద్ధి ఉన్న ఎన్బీఎఫ్సీలే మెరుగైన రాబడులు ఇస్తాయని చెప్పారు. బ్యాంకుల్లో హెచ్డీఎఫ్సీ బ్యాంకు, ఐసీఐసీఐ బ్యాంకు, కోటక్ బ్యాంకులపై పాజిటివ్‌గా ఉన్నామని తెలిపారు. బలహీనమైన ఎన్బీఎఫ్సీలు, పీఎస్‌బీల నుంచి ఇన్వెస్టర్లు వీటివైపు మరలుతున్నారన్నారు. ఎన్బీఎఫ్సీ రంగంలో స్థిరత్వం రావాలంటే మరో మూడు నుంచి ఆరు నెలల సమయం పడుతుందని అభిప్రాయపడ్డారు.
You may be interested
ఫెడ్ రేట్‌కట్ ఎందుకింత భయపెట్టింది?
Thursday 1st August 2019భారీగా పతనమైన యూఎస్ మార్కెట్లు అదేబాటలో ఆసియా మార్కెట్లు అంతా ఊహించినట్లే యూఎస్ ఫెడరల్ బ్యాంకు బుధవారం సమావేశంలో వడ్డీరేట్లను 25 బీపీఎస్ మేర తగ్గిస్తూ నిర్ణయం తీసుకుంది. కానీ ఈ సందర్భంగా ఫెడ్ చైర్మన్ జెరోమ్ పావెల్ చేసిన కామెంట్లు ఒక్కసారిగా ఇన్వెస్టర్ల సెంటిమెంట్‌ను దెబ్బతీశాయి. దీంతో యూఎస్ మార్కెట్ నిట్టనిలువునా పతనమైంది. సమీక్షా సమావేశం సందర్భంగా మాట్లాడుతూ సుదీర్ఘ రేట్ కట్ సైకిల్‌కు తాజా నిర్ణయం ఆరంభం కాదని పావెల్
అడాగ్ గ్రూప్ షేర్ల ర్యాలీ
Thursday 1st August 2019మార్కెట్ నష్టాల్లో ట్రేడ్ అవుతున్నప్పటికీ.., అనిల్ అంబానీకి గ్రూప్‌నకు (అడాగ్ గ్రూప్) చెందిన రిలయన్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, రిలయన్స్ పవర్ షేర్లు గురువారం లాభాల బాట పట్టాయి. రిలయన్స్ ఇన్ఫ్రాటెల్ 10.50శాతం పెరగ్గా, రిలయన్స్ పవర్ షేర్లు 5.50శాతం ర్యాలీ చేశాయి. రిలయన్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్:- నేడు ఎస్ఈలో ఈ కంపెనీ షేరు రూ.47.00ల వద్ద ట్రేడింగ్‌ను ప్రారంభించింది. నేడు మార్కెట్ ప్రారంభం నుంచి ఇన్వెస్టర్ల ఈ షేర్ల కొనుగోళ్లకు మద్దతివ్వడంతో ఒకదశలో దాదాపు 10.50శాతం