News


కనిష్టాన్ని ఊహించే ప్రయత్నం చేయవద్దు: రామ్‌దేవ్‌ అగర్వాల్‌

Saturday 14th March 2020
Markets_main1584124977.png-32468

మార్కెట్‌ కనిష్టాన్ని ఊహించే ప్రయత్నం చేయవద్దన్నారు మోతీలాల్‌ ఓస్వాల్‌ ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌ జాయింట్‌ ఎండీ రామ్‌దేవ్‌ అగర్వాల్‌. బదులుగా నాణ్యమైన కంపెనీల్లో ఇన్వెస్ట్‌ చేయాలని ఇన్వెస్టర్లకు సూచించారు. ఈ మేరకు ఓ వార్తా సంస్థకు ఆయన ఇంటర్వ్యూ ఇచ్చారు. 

 

‘‘మార్కెట్ల బోటమ్‌ ఎక్కడ అన్నది ఎవరికీ తెలియదు. ఆరు నెలలు లేదా ఏడాది తర్వాత పరిస్థితులు తిరిగి సాధారణ స్థితికి చేరుకుంటాయి. ప్రపంచానికి ఇదే అంతం కాదు. ఒక త్రైమాసికం కోసం మార్కెట్లో నేను ఇన్వెస్ట్‌ చేయడం లేదు. దీర్ఘకాలం కోసమే మనం ఇక్కడ ఉన్నాం’’ అని అగర్వాల్‌ వివరించారు. హోటల్‌ స్టాక్స్‌ గురించి వివరిస్తూ.. రూ1,000 కోట్ల విలువైనవి ఇప్పుడు రూ.600-700 కోట్లకే లభిస్తున్నాయని, చాలా ఆకర్షణీయమైన వ్యాల్యూషన్లలో ఉన్నాయని తెలిపారు. ఇప్పుడే పోర్ట్‌ఫోలియోను ఏర్పాటు చేసుకోవడం వల్ల రికవరీలో లాభాలను సొంతం చేసుకోవచ్చన్నారు. పోర్ట్‌ఫోలియో పునర్‌వర్గీకరణకు ఇది మంచి సమయంగా పేర్కొన్నారు. 

 

‘‘నేడు ఎవరూ చైనా వైపు చూడడం లేదు. అక్కడ వైరస్‌ను అదుపులోకి తీసుకొచ్చారు. అమెరికా మూసివేతకు గురైంది. యరోప్‌లో పరిస్థితీ ఇదే. బేర్స్‌కు ఇదే కీలకం. మంచి మ్యూచువల్‌ ఫండ్స్‌ను కొనుగోలు చేయాలనుకుంటే ఫిబ్రవరి డేటాను చూడాలి. ఫిబ్రవరిలో ఈక్విటీల్లోకి రూ.10,000 కోట్ల పెట్టుబడులు వచ్చాయి. దీనికితోడు సిప్‌ ద్వారా ప్రతీ నెలా వచ్చే పెట్టుబడులు రూ.8,000-8,500 కోట్ల మధ్యనున్నాయి’’ అని అగర్వాల్‌ తెలిపారు. రుణాల వల్లే పతనం ఇంత భారీగా ఉందన్నారు. ‘‘ఉన్నట్టుండి స్టాక్‌ 30-40 శాతం పడిపోతే మార్జిన్‌ పూర్తిగా తుడిచిపెట్టుకుపోతుంది. దీంతో కొనుగోలుదారు మరింత డబ్బులు మార్జిన్‌ కోసం చెల్లించాలి. లేదంటే బ్రోకర్‌ ఆ పొజిషన్లను స్క్వేర్‌ ఆఫ్‌ చేయడం జరుగుతుంది. దీంతో ఆ షేర్లు వేగంగా పడిపోవడం జరుగుతుంది’’ అని అగర్వాల్‌ వివరించారు.

 

తాను పూర్తిగా ఇన్వెస్ట్‌ చేసి ఉన్నట్టు అగర్వాల్‌ తెలిపారు. అయితే, ఇన్వెస్టర్లు మాత్రం క్రమక్రమంగా పెట్టుబడులు పెట్టుకోవాలని సూచించారు. ‘‘నేడు స్టాక్స్‌ అమ్మకాలు జరుగుతున్నాయి. ఇది ముగిస్తే ఈ స్టాక్‌ను ఇదే ధరలో రేపు కొనుగోలు చేయడం సాధ్యం కాదు. మార్కెట్ల బోటమ్‌ గురించి ఆలోచిస్తే అది మూర్ఖత్వమే అవుతుంది. చాలా మిడ్‌, స్మాల్‌క్యాప్‌ స్టాక్స్‌ 12-15-17 పీఈలోనే లభిస్తున్నాయి’’ అని అగర్వాల్‌ వివరించారు. మార్కెట్ల పతనంలో కంపెనీల నుంచి పెద్ద ఎత్తున బైబ్యాక్‌ నిర్ణయాలు వెలువడతాయని, కంపెనీలకు చెందిన వారే కొనుగోళ్లకు దిగొచ్చని పేర్కొన్నారు. You may be interested

ఇది ఇన్వెస్టింగ్‌ టైమ్‌

Saturday 14th March 2020

ఈక్విటీ మార్కెట్లు శుక్రవారం ఇన్వెస్టర్లను కలవరపరిచాయి. ఆరంభంలో లోయర్‌ సర్క్యూట్‌ 10 శాతం వరకు పడిపోయిన సూచీలు, ట్రేడింగ్‌ విరామం అనంతరం గణనీయంగా రికవరీ అయి లాభాల్లోకి అడుగుపెట్టాయి. ట్రేడింగ్‌ చివరి వరకు అదే ధోరణి కొనసాగింది. యూరోప్‌ మార్కెట్లు లాభాల్లో ట్రేడింగ్‌ కావడం, డౌజోన్స్‌ ఫ్యూచర్స్‌ 719 పాయింట్లు పెరగడం మన మార్కెట్లలో ఉత్సాహనాన్ని పెంచింది. అయితే, గత మూడు వారాల్లో కరోనా వైరస్‌ కారణంగా ఈక్విటీలు భారీగా

పతనం- రికవరీ.. రెండూ రికార్డులే

Friday 13th March 2020

తొలుత 3091 పాయింట్లు పడిన సెన్సెక్స్‌ 29,389 వద్ద ఇంట్రాడే కనిష్టం నమోదు తదుపరి 34,769ను దాటేసిన సెన్సెక్స్‌ కనిష్టం నుంచి 5380 పాయింట్ల హైజంప్‌ చివరికి 1325 పాయింట్లు ప్లస్‌లో ముగింపు ఇవన్నీ సరికొత్త రికార్డులే కావడం విశేషం వారాంతాన దేశీ స్టాక్‌ మార్కెట్లు చరిత్రలోనే సరికొత్త ఫీట్‌ను సాధించాయి. తొలుత మార్కెట్‌ చరిత్రలోనే అత్యధికంగా సెన్సెక్స్‌ 3091 పాయింట్లు పడిపోయింది. ఇది 10 శాతం పతనంకావడంతో 45 నిముషాలపాటు ఎక్స్ఛేంజీలలో ట్రేడింగ్‌ నిలిచిపోయింది. ఆపై తిరిగి

Most from this category