News


2 వారాలకు రెండు సిఫార్సులు

Saturday 15th February 2020
Markets_main1581764093.png-31829

 ఈ వారంలో ఫిబ్రవరి 10న నిఫ్టీ ఇండెక్స్‌ డౌన్‌సైడ్‌ ట్రెండ్‌లో 12వేల స్థాయిని పరీక్షించింది. బుధవారం సెషన్‌లో మరింత అమ్మకాల ఒత్తిడిని చూసింది. ఐనప్పటికీ.., నిఫ్టీ ఇండెక్స్‌ ఈ వారంలో 0.63శాతం పెరగ్గా, బ్యాంక్‌ నిఫ్టీ ఇండెక్స్‌ మాత్రం 0.09శాతం నష్టాన్ని చవిచూసింది. . ఈ నేపథ్యంలో 
ఇండియానివేశ్‌ సెక్యూరీటీస్ సీనియర్‌ టెక్నికల్‌ విశ్లేషకుడు మోహుల్‌ కొఠారి సిఫార్సు రాబోయే 2-3 వారాలకు కింది సిఫార్సులను సూచిస్తున్నారు. 

షేరు పేరు: ఓఎన్‌జీసీ
రేటింగ్‌: కొనవచ్చు
టార్గెట్‌: రూ.116 
స్టాప్‌లాస్‌: రూ.98
అప్‌సైడ్‌: 10శాతం
విశ్లేషణ: ఓఎన్‌జీసీ షేరు గతేడాది మే న ఉంచి కరెక‌్షన్‌ మోడ్‌లో ఉంది. షేరు ఇటీవల గరిష్టస్థాయి రూ.172 నుంచి ఏకంగా 42శాతం నష్టాన్ని చూవిచూసింది. ఇటీవల షేరు రూ.100 వద్ద కీలక మద్దతు స్థాయిని ఏర్పాటు చేసుకుంది.  ఇది రూ .198 గరిష్ట స్థాయి నుండి రూ .121 పతనానికి 100 శాతం పొడిగింపుగా ఉంది. దీనిని బుల్లిష్ హార్మోనిక్ AB = CD నమూనా అని కూడా పిలుస్తారు. ఇది బౌన్స్ అవకాశాన్ని సూచిస్తుంది. ఈ షేరు తగ్గుదలలో కొనుగోలు చేయవచ్చని మోహుల్‌ కొఠారి సూచిస్తున్నారు. 


బ్యాంక్‌ నిఫ్టీ ఫ్యూచర్‌
రేటింగ్‌: అమ్మవచ్చు
టార్గెట్‌ ధర: రూ.30,300
స్టాప్‌ లాస్‌: రూ.31,800
డౌన్‌సైడ్‌ ట్రెండ్‌: 3శాతం

విశ్లేషణ: ఇటీవల పతనం ఇండెక్స్‌ను రూ.29,600 వైపు లాగింది. ఈ స్థాయి హెచ్‌అండ్‌ షోల్డర్‌ బ్రేక్‌ డౌన్‌ టార్గెట్‌ రూ.29500 అతి దగ్గరగా వుంది. ఇప్పుడు ఇండెక్స్‌ మరోసారి 31వేల స్థాయికి పైకి చేరుకుంది. గత రెండు నెలల నుంచి నిఫ్టీ బ్యాంక్‌ ఇండెక్స్‌ తీవ్ర అమ్మకాల ఒత్తిడిని ఎదుర్కోంటుంది. ఇది ఇండెక్స్‌లో బలహీనతను సూచిస్తుంది. మొత్తంగా నెలవారీ, వారపు స్ట్రక్చర్‌ మీడియం-టర్మ్ కోసం బలహీనంగా మారింది. డైలీ ఛార్ట్‌లో బేరీష్‌ క్యాండిల్‌ స్టిక్‌ ప్యాట్రన్‌ నెలకొంది. ఇది భవిష్యత్తులో అమ్మకాలను సూచిస్తుంది. ఈ నేపథ్యంలో ట్రేడర్లు రిస్క్‌ తీసుకోదల్చిన బ్యాంక్‌ నిఫ్టీని విక్రయించవచ్చు. 

 



You may be interested

కొద్ది రోజుల్లో కొంత చెల్లిస్తాం: వొడాఫోన్‌ ఐడియా

Sunday 16th February 2020

వ్యాపార మనుగడపై ఇంకా అనిశ్చితి కొద్ది నెలలుగా టెలికాం రంగాన్ని కుదిపేస్తున్న ఏజీఆర్‌ బకాయిల్లో ప్రస్తుతానికి ఎంతమేరకు చెల్లించగలమో లెక్కవేస్తున్నామని వొడాఫోన్‌ ఐడియా ప్రకటించింది. అయితే కంపెనీ మనుగడసాగించడంపై మాత్రం ఆందోళన వ్యక్తంచేసింది. ఏజీఆర్‌ బకాయిల చెల్లింపుల గడువు పెంపును కోరుతూ సుప్రీంకోర్టులో వేసిన పిటీషన్‌పై వచ్చే తీర్పు ఆధారంగా తమ వ్యాపార మనుగడ ఆధారపడివుంటుందని వొడాఫోన్‌ ఐడియా శనివారం స్టాక్‌ ఎక్స్ఛేంజీలకు ఇచ్చిన సమాచారంలో వివరించింది. కంపెనీ రూ. 52,000

ఏటీఎం ఛార్జీలు పెరుగుతాయా..?

Saturday 15th February 2020

దానికింత దీనికింత అంటూ ఏదోఒక పేరుమీద ఛార్జీలు వసూలుచేస్తూ.. బ్యాంకులు ఖాతాదారుల జేబులు ఖాళీచేస్తున్నాయి. త్వరలో ఏటీఎంలు కూడా ఇదే బాటలో నడవనున్నాయి. నిర్ణీత ఉచిత లావాదేవీల తర్వాత ఏటీఎంలలో డబ్బులు డ్రా చేయాలంటే ఇప్పుడు చెల్లిస్తున్నదానికంటే మరికొంత అదనంగా చెల్లించాల్సిందే. ఎందుకంటే ఇంటర్‌ఛేంజ్‌ ఫీజు పెంచాలని కోరుతూ ఏటీఎం ఆపరేటర్ల అసోసియేషన్‌ రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియాకు లేఖ రాసింది. ఇందుకు ఆర్బీఐ సానుకూలంగా స్పందిస్తే ఏటీఎం ఛార్జిలు

Most from this category