News


పడినప్పుడు కొనుగోలు చేయడం: నర్నోలియా

Sunday 16th June 2019
Markets_main1560708003.png-26329

నిఫ్టీ గత వారం 12,000-11,800 శ్రేణిలో ట్రేడవడంతోపాటు బార్‌ టైప్‌ క్యాండిల్‌ స్టిక్‌ ప్యాటర్న్‌ నమోదు చేసిందని, దీని ప్రకారం నిఫ్టీ దిగువ వైపున 11,770 స్థాయిని బ్రేక్‌ చేయకపోవచ్చని నర్నోలియా ఫైనాన్షియల్‌ అడ్వైజర్స్‌ టెక్నికల్‌ అండ్‌ డెరివేటివ్‌ రీసెర్చ్‌ హెడ్‌ షబ్బీర్‌ ఖయ్యూమి తెలిపారు. 12,100పైన నిఫ్టీ క్లోజ్‌ అయితే తదుపరి 12,500 వరకు లక్ష్యంగా పేర్కొన్నారు. నిఫ్టీ 50డీఎంఏ 11,680 స్థాయిల పైన ట్రేడవుతోందని, మధ్యకాలానికి బలమైన అప్‌ట్రెండ్‌ను ఇది సూచిస్తోందన్నారు. ఐదు వారాల మూవింగ్‌ యావరేజ్‌ 11,780 వద్ద ఉందని, దీనికి దిగువన ముగిస్తేనే బలహీనత చోటు చేసుకుంటుందన్నారు. స్వల్ప కాలంలో రాబడులు ఇచ్చేందుకు అవకాశం ఉన్న పలు స్టాక్స్‌ను ఆయన సిఫారసు చేశారు. 

 

టాటా మోటార్స్‌
లక్ష్యం రూ.198. స్టాప్‌లాస్‌ రూ.148. రూ.435ను చేరిన తర్వాత టాటా మోటార్స్‌ రూ.130 కనిష్ట స్థాయిని నమోదు చేసింది. ఇది కీలక మద్దతు స్థాయి. అధిక అమ్మకాల జోన్‌ నుంచి ఆర్‌ఎస్‌ఐ ఎగువవైపు సూచిస్తోంది. రోజువారీ ఎంఏసీడీ బుల్లిష్‌ క్రాసోవర్‌ను ఇచ్చింది. ఆర్‌ఎస్‌ఐలో సానుకూలత కూడా రానున్న సెషన్లలో ఈ కౌంటర్‌లో అప్‌మూవ్‌ను సూచిస్తున్నాయి. కనుక టాటా మోటార్స్‌ను రూ.163 స్థాయిల్లో కొనుగోలు చేసుకోవచ్చు.  

 

ఆర్‌ఈసీ
లక్ష్యం రూ.170. స్టాప్‌లాస్‌ రూ.134. ఇటీవలే అప్‌సైడ్‌ అసెండింగ్‌ చానల్‌ బ్రేకవుట్‌ ఇచ్చింది. ఇది డైలీచార్ట్‌లో ట్రెండ్‌ రివర్స్‌కు సూచిక. గత కొన్ని రోజుల్లో ఇది అన్ని కీలకమైన డీఎంఏలకు పైనే ట్రేడ్‌ అవుతోంది. ఇది బలాన్ని సూచిస్తోంది. బిగ్‌బోయ్‌ బుల్లిష్‌ క్యాండిల్‌ స్టిక్‌ ప్యాటర్న్‌ను ఏర్పాటు చేసింది. ఇది స్టాక్‌ ఎగువవైపున మరింత ర్యాలీని సూచిస్తోంది. ఆర్‌ఈసీని రూ.148 స్థాయిల్లో కొనుగోలు చేసుకోవచ్చు. 

 

ఇండియన్‌ బ్యాంకు
లక్ష్యం రూ.295, స్టాప్‌లాస్‌ రూ.247. రూ.428 గరిష్ట స్థాయిని నమోదు చేసిన తర్వాత ఈ స్టాక్‌ రూ.202 కనిష్ట స్థాయికి పడిపోయింది. డైలీ చార్ట్‌లో 200డీఎంఏ పైన గ్రీన్‌క్యాండిల్‌ స్టాక్‌ను ఏర్పాటు చేస్తుండడం చూస్తుంటే ఎగువైపున అప్‌స్వింగ్‌కు అవకాశం ఉంది. ఆర్‌ఎస్‌ఐ 50పైన నిలదొక్కుకోవడం కూడా కొనుగోలుకు సూచన. రూ.265 స్థాయిల్లో కొనుగోలు చేసుకోవచ్చు. 

 

సీఈఎస్‌సీ
టార్గెట్‌ రూ.830. స్టాప్‌లాస్‌ రూ.719. రూ.648 కనిష్ట స్థాయిని నమోదు చేసిన అనంతరం ఎగువవైపునకు వేగంగా రీబౌండ్‌ అయింది. 50డీఎంఏ 720 దరిదాపుల్లో ఈ స్టాక్‌ బలమైన బేస్‌ను నమోదు చేసింది. ఆర్‌ఎస్‌ఐ, ఎంఏసీడీలు సైతం ఈ స్థాయిల్లో మద్దతులను సూచిస్తున్నాయి. రూ.760 స్థాయిల్లో కొనుగోలుకు వెళ్లొచ్చు. 

 

యునైటెడ్‌ బ్రూవరీస్‌
లక్ష్యం రూ.1,415. స్టాప్‌లాస్‌ రూ.1,290. రూ.911 వద్ద మద్దతు తీసుకున్న ఈ స్టాక్‌ వెంటనే వెనుదిరిగింది. గత కొన్ని వారాల్లో గరిష్టాల్లో గరిష్టాన్ని వీక్లీ చార్ట్‌లో నమోదు చేస్తోంది. 200డీఎంఏ పైన గ్రీన్‌క్యాండిల్‌ను ఏర్పాటు చేస్తుండడం కూడా ఎగువైపున అప్‌స్వింగ్‌ను సూచిస్తోంది.You may be interested

ఫ్లాట్‌గా ప్రారంభమైన మార్కెట్‌

Monday 17th June 2019

ఆసియా మార్కెట్ల నుంచి మిశ్రమ సంకేతాలను అందుకున్న దేశీయ మార్కెట్‌ సోమవారం ఫ్లాట్‌గా మొదలైంది. సెన్సెక్స్‌ 52 పాయింట్ల నష్టంతో 39,450 వద్ద, నిఫ్టీ 10 పాయింట్లను కోల్పోయి 11813 వద్ద ట్రేడింగ్‌ను ప్రారంభించాయి. రేపటి నుంచి ఫెడ్‌ రిజర్వ్‌ సమావేశాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో ఇన్వెస్టర్లు అప్రమత్తత వహిస్తుండంతోపాటు, పశ్చిమాసియాలో దేశాల్లో చెలరేగిన రాజకీయ ఉద్రిక్తతలు తగ్గుముఖంతో ఆసియాలో మార్కెట్లు మిశ్రమంగా ట్రేడ్‌ అవుతున్నాయి. క్రూడాయిల్‌ ధరలు చల్లారలేదు.

ఫండ్‌ స్టేట్‌మెంట్‌లో ఏం చూడాలి..?

Sunday 16th June 2019

మ్యూచువల్‌ ఫండ్స్‌లో ఇన్వెస్ట్‌ చేసే వారు తమకు ఫండ్‌ హౌస్‌ (ఏఎంసీ) నుంచి వచ్చే స్టేట్‌మెంట్‌ను తప్పకుండా పరిశీలించుకోవడం ఎంతైనా అవసరం. ఇది కూడా బ్యాంకు ఖాతా స్టేట్‌మెంట్‌ మాదిరే. మీ మ్యూచువల్‌ ఫండ్స్‌ పెట్టుబడులకు సంబంధించి పూర్తి సారాంశమే స్టేట్‌మెంట్‌. ఫండ్స్‌ సంస్థ ఏదైనప్పటికీ, అందులోని కీలక అంశాలు అన్నింటిలోనూ తప్పకుండా ఉండాల్సిందే.    ముఖ్యంగా ఫోలియో నంబర్‌ ఒకటి. ఇది మీ పెట్టుబడులకు రిఫరెన్స్‌ నంబర్‌. సంబంధిత అస్సెట్‌ మేనేజ్‌మెంట్‌

Most from this category