News


‘ఫార్మా, బ్యాంకులు, మెటల్స్‌లో మంచి పనితీరు’

Wednesday 18th December 2019
Markets_main1576607993.png-30276

మార్కెట్లు కీలక మద్దతు స్థాయిలైన 12,000-11,900 వరకు తగ్గినప్పుడల్లా కొనుగోలు విధానాన్ని అనుసరించొచ్చని, రానున్న వారాల్లో మెటల్‌, ఫార్మా, బ్యాంకింగ్‌, రియల్‌ ఎస్టేట్‌, హౌసింగ్‌ ఫైనాన్స్‌ స్టాక్స్‌ మంచి పనితీరు చూపించొచ్చని యాక్సిస్‌ సెక్యూరిటీస్‌ టెక్నికల్‌ అండ్‌ డెరివేటివ్స్‌ రీసెర్చ్‌ హెడ్‌ రాజేష్‌పాల్వియా చెప్పారు. ఓ ప్రముఖ వార్తా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూ సందర్భంగా ఆయన పలు అంశాలపై తన అభిప్రాయాలు వెల్లడించారు. 

 

మార్కెట్లపై స్థూల ఆర్థిక గణాంకాల ప్రభావం..?
విదేశీ పోర్ట్‌ఫోలియో పెట్టుబడులు మార్కెట్లకు ఇకముందూ ముఖ్యమైన అంశంగా ఉంటాయి. విదేశీ ఇనిస్టిట్యూషనల్‌ ఇన్వెస్టర్లు మార్కెట్లో నికర కొనుగోలుదారులుగా ఉన్నారు. ఈ త్రైమాసికంలో రూ.17,700 కోట్ల మేర ఇన్వెస్ట్‌ చేశారు. డిసెంబర్‌లో ఇంత వరకు రూ.3,843 కోట్ల పెట్టుబడులను వారు వెనక్కి తీసుకున్నారు. వీక్లీ చార్ట్‌లో నిఫ్టీ బుల్లిష్‌ క్యాండిల్‌ ఏర్పాటు చేసింది. మార్కెట్‌పై బుల్స్‌ బలమైన పట్టుతో ఉన్నట్టు ఇది తెలియజేస్తోంది. అయితే, కొన్ని ఇండెక్స్‌ స్టాక్స్‌ అమ్మకాల ఒత్తిడి ఎదుర్కొంటున్నాయి. నిఫ్టీ వచ్చే వారం కూడా 11,950పైన నిలదొక్కుకుంటే 12,150-12,250 దిశగా ర్యాలీ విస్తరిస్తుంది. అమెరికా-చైనా మధ్య వాణిజ్య చర్చలు మార్కెట్‌పై ప్రభావం చూపిస్తాయి. ఈ చర్చల ప్రగతిపై ఇన్వెస్టర్లు దృష్టి సారించాలి. గత గురువారం విడుదలైన పారిశ్రామికోత్పత్తి గణాంకాలు, ద్రవ్యోల్బణ గణాంకాలు నిరాశపరిచాయి. కానీ, అమెరికా-చైనా వాణిజ్య ఒప్పందంపై అంచనాలతో మార్కెట్లు వీటి ప్రభావాన్ని అధిగమించాయి. రూపాయి బలపడడం కూడా బుల్లిష్‌ సెంటిమెంట్‌కు కారణం. 

 

శాంతాక్లాజ్‌ ర్యాలీకి అవకాశం ఉందా?
గడిచిన మూడు నెలల్లో అద్భుతమైన ర్యాలీ జరిగింది. మార్కెట్లు ఆల్‌టైమ్‌ గరిష్టానికి చేరాయి. మార్కెట్‌ వ్యాప్తంగా కొనుగోళ్ల మద్దతు లభించింది. లాభ, నష్టపోయిన షేర్ల నిష్పత్తి కూడా గత రెండు నెలల్లో ఎంతో మెరుగుపడింది. అంటే మార్కెట్ల పట్ల విశ్వాసం తిరిగి నెలకొంటుందని తెలియజేస్తోంది. నిఫ్టీ-50 హయ్యర్‌ టాప్‌, హయ్యర్‌ బోటమ్‌ను నెలవారీ, వీక్లీ చార్ట్‌ల్లో ఏర్పాటు చేసింది. స్వల్పకాల స్ర్టెంత్‌ ఇండికేటర్లు కూడా సానుకూల పరిధిలోనే, రిఫరెన్స్‌ లైన్‌కు ఎగువనే ఉన్నాయి. అంటే మున్ముందు మరింత ర్యాలీ ఉందని సంకేతం. 2019 ముగింపున వచ్చే వారం కూడా నిఫ్టీలో బుల్లిష్‌నెస్‌ కొనసాగుతుందని అంచనా. ఒక్కసారి నిఫ్టీ 12,150పైన స్థిరపడితే తదుపరి 12,250-12,400 దిశగా రానున్న నెలల్లో చేరుకుంటుంది. మార్కెట్‌ 11,900 వరకు క్షీణించినప్పుడు కొనుగోలు విధానాన్ని అనుసరించొచ్చు. మెటల్‌, ఫార్మా, రియల్‌ ఎస్టేట్‌, హౌసింగ్‌ ఫైనాన్స్‌ షేర్లు రానున్న వారాల్లో మంచి ప్రదర్శన చేయగలవు. హిందాల్కో, హెచ్‌డీఎఫ్‌సీ, మైండ్‌ట్రీ షేర్లు సాంకేతికంగా స్వల్ప కాలంలో రాబడి ఇచ్చేందుకు అవకాశం ఉంది. అయితే, అంతర్జాతీయంగా అమెరికా-చైనా మధ్య వాణిజ్య ఒప్పందాన్ని మార్కెట్లు అంచనా వేశాయి. ఒకవేళ ఏదైనా ప్రతికూల ఫలితం వస్తే అది మార్కెట్లపై ప్రభావం చూపిస్తుంది. You may be interested

ఈ షేర్లపై మ్యూచువల్‌ ఫండ్స్‌ మక్కువ

Wednesday 18th December 2019

ప్రస్తుత ఏడాది నవంబర్‌ నాటికి మ్యూచువల్‌ ఫండ్స్‌ నిర్వహణలోని ఆస్తులు రూ.27 లక్షల కోట్లకు వృద్ధి చెందాయి. క్రితం ఏడాది ఇదే కాలానికి ఇవి రూ.23.59 లక్షల కోట్లుగానే ఉన్నాయి. అంటే ఏడాదిలో 17 శాతం మేర ఫండ్స్‌ ఆస్తులు వృద్ధి చెందినట్టు తెలుస్తోంది. మ్యూచువల్‌ ఫండ్స్‌ మేనేజర్లు (దేశంలో 42 సంస్థలు ఉ‍న్నాయి) నవంబర్‌లో కొనుగోలు చేసిన టాప్‌ స్టాక్స్‌, అలాగే, అధికంగా విక్రయించిన షేర్ల వివరాలను ఐసీఐసీఐ

కొత్త శిఖరాలపై ముగిసిన సూచీలు

Tuesday 17th December 2019

ఇంట్రాడే, ముగింపులోనూ రికార్డులే... కలిసొచ్చిన జాతీయ, అంతర్జాతీయ అంశాలు  మెటల్‌, ఐటీ, బ్యాంకింగ్‌ షేర్లకు కొనుగోళ్ల మద్దతు  జాతీయ, అంతర్జాతీయ సానుకూల సంకేతాలను అందిపుచ్చుకున్న దేశీయ మార్కెట్‌ మంగళవారం భారీ లాభాలను కూడగట్టుకుంది. మార్కెట్‌ ప్రారంభం నుంచి  మెటల్‌, ఐటీ, బ్యాంకింగ్‌, అటో రంగ షేర్లలో కొనుగోళ్లు వెల్లువెత్తడంతో సూచీలు పరుగులు పెట్టాయి. ఫలితంగా ప్రధాన సూచీలైన సెన్సెక్స్‌, నిఫ్టీలతో పాటు బ్యాంక్‌ సైతం సరికొత్త రికార్డులను నెలకొల్పాయి. సెన్సెక్స్‌ ఇంట్రాడేలో 463 పాయింట్లు పెరిగి

Most from this category