News


స్వల్పకాలానికి టాప్‌ సిఫార్సులు

Friday 24th January 2020
Markets_main1579845067.png-31160

వచ్చే మూడు నాలుగు వారాల్లో మంచి రాబడినిచ్చే ఆరు స్టాకులను ప్రముఖ అనలిస్టులు రికమండ్‌ చేస్తున్నారు.
1. రామ్‌కో సిమెంట్స్‌: కొనొచ్చు. టార్గెట్‌ రూ. 890. స్టాప్‌లాస్‌ రూ. 797. సుదీర్ఘ కన్సాలిడేషన్‌ తర్వాత కప్‌ అండ్‌ హ్యాండిల్‌ ప్యాట్రన్‌ నుంచి బ్రేకవుట్‌ సాధించింది. అనంతరం స్వల్పకాలిక స్థిరీకరణ చూపింది. ఆర్‌ఎస్‌ఐలో బలమైన రివర్సల్‌ కనిపిస్తోంది. పైగా పాజిటివ్‌ క్రాసోవర్‌ ఏర్పరిచింది. త్వరలో మరింత అప్‌మూవ్‌ ఉంటుందని అంచనా.
2. క్రెడిట్‌ యాక్సిస్‌ గ్రామీణ్‌: కొనొచ్చు. టార్గెట్‌ రూ. 890. స్టాప్‌లాస్‌ రూ. 736. వీక్లీ చార్టుల్లో హయ్యర్‌హై, హయ్యర్‌లో ఏర్పరుస్తూ వస్తోంది. చార్టుల్లో పతాకాకృతి ప్యాట్రన్‌ నుంచి బ్రేకవుట్‌ సాధించింది. ప్రస్తుతం కీలక మూవింగ్‌ యావరేజ్‌లకు పైన ట్రేడవుతూ పాజిటివ్‌గా కనిపిస్తోంది.
3. బజాజ్‌ ఫిన్‌సర్వ్‌: అమ్మొచ్చు. టార్గెట్‌ రూ. 9100.స్టాప్‌లాస్‌ రూ. 9800. డైలీ చార్టుల్లో బేరిష్‌ ఏబీ=సీడీ ప్యాట్రన్‌ ఏర్పరిచింది. ఆర్‌ఎస్‌ఐ లోయర్‌హై ఏర్పరిచి అధోముఖంగా పయనిస్తోంది. పైగా నెగిటివ్‌ క్రాసోవర్‌ కూడా ఏర్పరిచింది. కీలక రూ. 9700 వద్ద ఉన్న ట్రెండ్‌లైన్‌కు దిగువన ట్రేడవడం బలహీనతకు సంకేతం. 
4. ఇండియన్‌బ్యాంక్‌: కొనొచ్చు. టార్గెట్‌ రూ. 116. స్టాప్‌లాస్‌ రూ. 98. గతేడాది జూన్‌ నుంచి కరెక‌్షన్‌ మూడ్‌లో కొనసాగుతూ వచ్చింది. దీంతో భారీ ఓవర్‌సోల్డ్‌ జోన్‌లోకి జారినట్లయింది. రూ. 95 వద్ద బలమైన ట్రెండ్‌లైన్‌ మద్దతు పొందుతోంది. ఆర్‌ఎస్‌ఐ తదితర ఇండికేటర్లు పాజిటివ్‌గా మారుతున్నాయి.
5. గెయిల్‌: కొనొచ్చు. టార్గెట్‌ రూ. 138. స్టాప్‌లాస్‌ రూ. 125. డైలీ చార్టుల్లో రూ. 129 ఎగువన ట్రెండ్‌లైన్‌ బ్రేకవుట్‌ చూపింది. డైలీ వాల్యూంలు కూడా అప్‌మూవ్‌కు మద్దతుగా ఉన్నాయి. హ్యామర్‌ ప్యాట్రన్‌ గరిష్ఠం వద్ద ట్రేడవుతూ చురుగ్గా కనిపిస్తోంది.
6. హెచ్‌డీఎఫ్‌సీ: అమ్మొచ్చు. టార్గెట్‌ రూ. 2350. స్టాప్‌లాస్‌ రూ. 2500. గతేడాది అక్టోబర్‌ నుంచి అప్‌మూవ్‌ చూపుతూ దాదాపు 20 శాతం ర్యాలీ జరిపింది. అప్పటినుంచి ఒక సరైన కరెక‌్షన్‌ కూడా చూడలేదు. తాజాగా అప్‌ట్రెండ్‌ లైన్‌ రూ. 2500 వద్ద నుంచి వెనుదిరిగింది. ఏడీఎక్స్‌ ఇండికేటర్‌ నెగిటివ్‌ క్రాసోవర్‌ ఏర్పరిచి బలహీనతను చూపుతోంది. 



You may be interested

ఇకపైనా పెద్ద బ్యాంకులదే హవా?

Friday 24th January 2020

శ్రీ కార్తిక్‌ వెలమకన్ని, మార్కెట్‌ నిపుణులు, ఇన్వెస్టెక్‌  భారీ బ్యాలన్స్‌షీట్స్‌, రిస్క్‌లను తట్టుకునే సామర్థ్యం తదితర అంశాల నేపథ్యంలో పెద్ద బ్యాంకులకే ఆర్థిక వ్యవస్థ మద్దతిస్తున్న సంకేతాలున్నట్లు మార్కెట్‌ నిపుణులు(ఇన్వెస్టెక్‌) శ్రీ కార్తిక్‌ వెలమకన్ని పేర్కొంటున్నారు. బ్యాంకింగ్‌ రంగంలో కన్సాలిడేషన్‌ కొనసాగుతుందని, దీంతో పెద్ద బ్యాంకులు.. మరింత పెద్ద బ్యాంకులుగా అవతరిస్తాయని అంచనా వేస్తున్నారు. దేశీ బ్యాంకింగ్‌ వ్యవస్థపై ఒక ఆంగ్ల చానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో పలు అభిప్రాయాలు వ్యక్తం చేశారు.

నేటి వార్తల్లోని షేర్లు

Friday 24th January 2020

వివిధ వార్తలకు అనుగుణంగా శుక్రవారం ప్రభావితమయ్యే షేర్లు ఇండియా బుల్స్‌ వెంచర్స్‌: ఇండియా బుల్స్‌ వెంచర్స్‌ క్యూ3 కన్సాలిడేటెడ్‌ నికర లాభం 14 శాతం తగ్గి రూ.120.4 కోట్ల నుంచి రూ104 కోట్లకు చేరింది. వార్షికప్రాతిపదికన ఆదాయం 53 శాతం పెరిగి రూ.566 కోట్ల నుంచి రూ.867 కోట్లకు చేరింది. జెన్సర్‌ టెక్‌: ఈ కంపెనీ క్యూ3 నికర లాభం 50.6 శాతం తగ్గి రూ.80 కోట్ల నుంచి రూ.40 కోట్లకు చేరింది.

Most from this category