News


తగ్గినప్పుడల్లా కొనండి..

Friday 7th September 2018
Markets_main1536310053.png-20061

వినియోగ రంగ స్టాక్స్‌ను పడిపోయినప్పుడల్లా కొనొచ్చంటున్నారు ఏంజెల్‌ బ్రోకింగ్‌ ఫండ్‌ మేనేజర్‌ మయురేష్‌ జోషి. ఆయన ఒక ఆంగ్ల చానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ విషయాన్ని వెల్లడించారు. 
ఎఫ్‌ఎంసీజీ స్టాక్స్‌ ఒక సమయంలో కన్సాలిడేట్‌ అవుతాయని తెలిపారు. విక్రయాల వృద్ధి గతేడాది తక్కువ స్థాయిలో నమోదయ్యిందే విషయాన్ని గుర్తుచేశారు. అయితే ప్రస్తుతం కంపెనీల మేనేజ్‌మెంట్లు భవిష్యత్‌లో బలమైన విక్రయాల వృద్ధి ఉంటుందని అంచనా వేస్తున్నాయని పేర్కొన్నారు. కనీస మద్దతు ధర, కొత్త కొత్త ప్రొడక్టుల ఆవిష్కరణ వంటి వాటితో డిమాండ్‌లో క్రమానుగత వృద్ధి సాధించడం ద్వారా రానున్న త్రైమాసికాల్లో నిలకడైన విక్రయాలను నమోదుచేస్తే అప్పుడు స్టాక్స్‌ ధరలు ఆకర్షణీయంగా మారుతుందని పేర్కొన్నారు. ఎఫ్‌ఎంసీజీ కంపెనీలు ఎప్పుడూ కూడా ప్రీమియం వ్యాల్యుయేషన్స్‌తో ఉంటాయని గుర్తుచేశారు. అయినా కూడా ఇన్వెస్టర్లు ఎప్పుడు ఎఫ్‌ఎంసీజీ విభాగానికి అధిక ప్రాధాన్యమిస్తారని తెలిపారు. ప్రస్తుతం ఈ స్టాక్స్‌లో కన్సాలిడేషన్‌ ఉంటుందని పేర్కొన్నారు. ఇమామి, డాబర్‌, హెచ్‌యూఎల్‌, బ్రిటానియా స్టాక్స్‌ మంచి పనితీరు కనబర్చాయని తెలిపారు. ఈ స్టాక్స్‌ పడిపోయినప్పుడు మళ్లీ కొనుగోలు చేయవచ్చని పేర్కొన్నారు. 
రూపాయి క్షీణత వల్ల ఎగుమతి ఆధారిత, సర్వీస్‌ ఆధారిత కంపెనీలు ప్రయోజనం పొందుతాయని మయురేష్‌ జోషి తెలిపారు. ఐటీ, ఫార్మా రంగాలకు సానుకూల అంశమని పేర్కొన్నారు. అలాగే వాహన విడిభాగాల కంపెనీలు కూడా లబ్ది పొందుతాయని తెలిపారు. క్రూడ్‌ దిగుమతి చేసుకునే కంపెనీలు ప్రతికూల పరిస్థితులను ఎదుర్కొవలసి ఉంటుందని పేర్కొన్నారు. టైర్ల కంపెనీలు, ఏవియేషన్‌ సంస్థలు, పెయింట్‌ కంపెనీలపై ప్రభావం ఉంటుందని తెలిపారు. 
భారత్‌ ఎలక్ట్రానిక్స్‌పై మయురేష్‌ జోషి స్పందిస్తూ.. కొత్త ప్రైసింగ్‌ పాలసీ వల్ల 2019-20 నుంచి కంపెనీ ఎర్నింగ్స్‌పై ప్రభావం పడొచ్చని అంచనా వేశారు. మార్జిన్లు కూడా తగ్గొచ్చని తెలిపారు. స్టాక్‌ ఎక్కడి వరకు కన్సాలిడేట్‌ అవుతుందో వేచి చూడాలని, ధరలో ఎలాంటి మార్పులు చోటుచేసుకుంటాయో గమనించాల్సి ఉందని పేర్కొన్నారు.  You may be interested

షార్ట్‌టెర్మ్‌లో 11,800-12,000 స్థాయి కష్టమే..

Friday 7th September 2018

నిఫ్టీ సమీప కాలంలో 11,800-12,000 స్థాయిని చేరుకోలేకపోవచ్చని అజ్‌కాన్‌ గ్లోబల్‌ ఈక్విటీ రీసెర్చ్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ అకాశ్‌ జైన్‌ తెలిపారు. లార్జ్‌క్యాప్స్‌ వల్ల ఇండెక్స్‌లు బాగా పెరిగాయని పేర్కొన్నారు. ఎల్‌టీసీజీ అమలు తర్వాత బాగా కరెక‌్షన్‌కు గురైన మిడ్‌క్యాప్స్‌, స్మాల్‌క్యాప్స్‌ ఆమోదయోగ్యమైన వ్యాల్యుయేషన్స్‌లో అందుబాటులో ఉన్నాయని తెలిపారు. ఏఎస్‌ఎం అమలు, ఎఫ్‌పీఐలపై సెబీ సర్క్యులర్‌ వంటి అంశాలు ఇన్వెస్టర్ల సెంటిమెంట్‌ను ప్రభావితం చేశాయని పేర్కొన్నారు. ఆయన ఒక ఆంగ్ల చానల్‌కు

మురిపించిన మెటల్‌ షేర్లు

Friday 7th September 2018

మెటల్‌ షేర్లు శుక్రవారం ట్రేడింగ్‌లో మురిపించాయి. మిడ్‌సెషన్‌ సమయానికి మెటల్‌ షేర్లలో నెలకొన్న కొనుగోళ్లతో బీఎస్‌ఈలో మెటల్‌ ఇండెక్స్‌ 2శాతం వరకూ లాభపడింది. మధ్యాహ్నం గం.1:20ని.లకు ఇండెక్స్‌ గతముగింపు(13776)తో పోలిస్తే 2శాతం లాభంతో 14048 వద్ద ట్రేడ్‌ అవుతోంది. ఈ సూచీలో భాగమైన 10 షేర్లకు గానూ మొత్తం 9షేర్లు లాభాల్లో ట్రేడ్‌ అవుతుండగా హిందూస్థాన్‌ జింక్‌ మాత్రం అరశాతం నష్టంతో ట్రేడ్‌ అవుతోంది. ఎన్‌ఎండీసీ అత్యధికంగా 6శాతం లాభపడింది. హిందాల్కో

Most from this category