News


ఈ షేర్లు కొనొచ్చు

Saturday 2nd November 2019
Markets_main1572683900.png-29307

పటిష్టమైన అప్‌ట్రెండ్‌లో వున్న ప్రస్తుత మార్కెట్లో మధ్య కాలానికి రాబడుల్ని ఇవ్వగలిగే షేర్లను వివిధ విశ్లేషకులు సూచించారు. అవి....

విశ్లేషకులు: ముస్తఫా నదీమ్, సీఈఓ, ఎపిక్ రీసెర్చ్
వోల్టాస్ లిమిటెడ్: కొనచ్చు: ప్రస్తుత ధర: రూ .713 | టార్గెట్‌ ధర: రూ 775-830 | స్టాప్‌ లాస్‌: రూ .650 | అప్‌ సైడ్‌: 16 శాతం పెరగొచ్చు
ఎయిర్ కండీషనర్(ఏసీ) మార్కెట్ గత కొన్నేళ్ల నుంచి బలమైన వృద్ధిని కనబరుస్తోంది. ఈ వృద్ధి మరింతగా పెరుగుతుందని అంచనావేస్తున్నాం. ఏసీ మార్కెట్‌లో వోల్టాస్ కీలకంగా ఉంది. అంతేకాకుండా నెగిటివ్‌ మార్కెట్‌లో సాంకేతికంగా స్టాక్ సరికొత్త బ్రేక్అవుట్‌ను ఏర్పరిచింది. పండుగ సీజన్‌లో డిమాండ్ పెరగడంతో, కంపెనీ పనితీరు మెరుగుపడుతుందని అంచనావేస్తున్నాం.

టైటాన్ కంపెనీ లిమిటెడ్: కొనచ్చు | ప్రస్తుత ధర: రూ .1,315 | టార్గెట్‌ ధర: 1,496 | స్టాప్‌లాస్‌: రూ .1,270 | అప్‌సైడ్‌: 13 శాతం
మేమెంచుకున్న స్టాకులలో ఈ స్టాక్‌ ముందుంటుంది. కంపెనీ ప్రాథమికంగా బలంగా ఉండడంతోపాటు గత కొన్నేళ్ల నుంచి కంపెనీ నిలకడగా వృద్ధి చెందుతోంది.  ఈ వ్యాపారం వివిధ జేవీ(జాయింట్‌ వెంచర్స్‌) లను ఏర్పరచడంతో, కంపెనీ విస్తరిస్తోంది. అంతేకాకుండా ఈ జేవీల వలన కంపెనీ బాటమ్‌ లైన్‌, టాప్‌ లైన్‌ మెరుగ్గావున్నాయి. ఈ స్టాక్‌ స్థిరమైన వృద్ధినిస్తుందని అంచనావేస్తున్నాం. 

డీసీబీ బ్యాంక్: కొనచ్చు| ప్రస్తుత ధర: రూ .176 | టార్గెట్‌ ధర: రూ .225 | స్టాప్‌ లాస్‌: రూ .150 | అప్‌సైడ్‌: 27 శాతం
స్మాల్‌క్యాప్ విభాగంలో డీసీబీ బ్యాంక్‌ మంచి ప్రదర్శనను చేస్తుంది. ఈ ప్రైవేట్‌ బ్యాంక్‌ గత కొన్నేళ్ల నుంచి స్థిరమైన వృద్ధిని సాధిస్తోంది. బ్యాంక్‌ నికర లాభం సెప్టెంబర్ త్రైమాసికంలో రూ. 91 కోట్లుగా ఉంది. అంతేకాకుండా బ్యాంక్‌ ఆపరేటింగ్ లాభం రెండంకెల వృద్ధిని నమోదు చేసింది. ఎన్‌ఐఎం(నికర వడ్డీ మార్జిన్‌) ఫ్లాట్‌గా ఉండడంతో తాజాగా ఈ బ్యాంక్‌ షేరు దిద్దుబాటుకు గురయ్యింది. కానీ ఈ స్టాక్‌ వచ్చే కొన్నేళ్లలో మంచి వృద్ధిని నమోదు చేస్తుందని అం‍చనావేస్తున్నాం. 

విశ్లేషకులు: సంతోష్ మీనా, సీనియర్ అనలిస్ట్, ట్రేడింగ్‌బెల్స్
ఐసీఐసీఐ లాంబార్డ్ జనరల్ ఇన్సూరెన్స్: కొనచ్చు | ప్రస్తుత ధర: రూ .1,370 | టార్గెట్‌ ధర: రూ 1,600 | అప్‌ సైడ్‌: 16 శాతం
ఐసీఐసీఐ లోంబార్డ్ జనరల్ ఇన్సూరెన్స్ బలమైన అప్‌ట్రెండ్‌లో ఉంది. గత ఆరు నెలల కన్సాలిడేషన్‌ తర్వాత ప్రస్తుతం ఈ స్టాక్‌ ‘కప్‌ అండ్‌ హ్యాండిల్‌’ నమూనాను ఏర్పరిచింది. ఇది బుల్లిష్‌ కొనసాగింపుకు సంకేతం. బుల్లిష్ మొమెంటం కొనసాగే అవకాశం ఉంది. వచ్చే ఆరు నెలల్లో ఈ షేరు రూ. 1,600 స్థాయిని తాకవచ్చు. 

హెచ్‌డీఎఫ్‌సీ లిమిటెడ్: కొనచ్చు | ప్రస్తుత ధర: రూ .2,106 | టార్గెట్‌ ధర: రూ .2,500 | అప్‌సైడ్‌: 18 శాతం
ఎన్‌బీఎఫ్‌సీ అనేక సమస్యలతో సతమతమతున్నప్పటికి ఈ కంపెనీ మాత్రం నిలకడగా వృద్ధి చెందుతోంది. సాంకేతిక పరంగా గమనిస్తే..ఈ స్టాక్‌ డబూల్‌ బాటమ్‌ నమూనాను ఏర్పరిచింది. మూమెంటం ఇండికేటర్స్‌ కూడా సానుకూలంగా ఉన్నాయి. రూ. 2,195 స్థాయి బ్రేక్‌ఔట్‌ పాయింట్‌గా పనిచేయగలదు. ఈ కంపెనీ షేరు అన్ని రకాల మూవింగ్‌ యావరేజిలను దాటింది. వచ్చే ఆరు నుంచి ఎనిమిది నెలల సమయంలో ఈ షేరు రూ. 2,500 స్థాయిని అందుకుంటుందని అంచనా వేస్తున్నాం.


పిడిలైట్ ఇండస్ట్రీస్: కొనచ్చు | ప్రస్తుత ధర: రూ .1,365 | టార్గెట్‌ ధర: రూ 1,600 | అప్‌సైడ్‌: 17 శాతం
పిడిలైట్ స్టాకు బుల్లిష్‌గా ఉంది. దాని 52 వారాల గరిష్ట స్థాయి నుండి మంచి దిద్దుబాటు తరువాత, ఇది మునుపటి బ్రేక్అవుట్ పాయింట్ 1,300 చుట్టూ ఒక బేస్‌ను ఏర్పాటు చేసుకుంటున్నది.అందువల్ల, ఇది ట్రేడర్లకు అనుకూలమైన రిస్క్-రివార్డ్ అవకాశాన్ని అందిస్తుంది, ఇక్కడ  రాబోయే రెండు నెలల్లో 1,600 రూపాయల లక్ష్యాన్ని ఆశించవచ్చు.
 



You may be interested

5వారాల గరిష్టానికి పసిడి

Saturday 2nd November 2019

ప్రపంచమార్కెట్లో పసిడి ఫ్యూచర్‌ శుక్రవారం 5వారాల గరిష్టం వద్ద స్థిరపడింది. అమెరికాలో నిన్నరాత్రి డిసెంబర్‌ కాంట్రాక్టు ఔన్స్‌ పసిడి ఫ్యూచర్‌ ధర 3.40డాలర్ల నష్టంతో 1,511.40 డాలర్ల వద్ద ముగిసింది. నిన్నరాత్రి అమెరికా అక్టోబర్‌ ఉపాధి కల్పన గణాంకాలు ఆశించిన స్థాయిలో నమోదుకావడంతో అక్కడి సూచీలు రికార్డు స్థాయిలని అందుకోవడంతో పసిడి స్వల్ప నష్టాలను చవిచూసింది. అయితే, మాన్యూఫాక్చరింగ్‌ యాక్టివిటీ, బాండ్‌ ఈల్డ్స్‌ తగ్గడం పసిడి పతనాన్ని అడ్డుకున్నాయి. ఫెడ్‌ రిజర్వ్‌

ఎస్‌జీఎక్స్‌ నిఫ్టీ 30 పాయింట్లు అప్‌

Saturday 2nd November 2019

విదేశాల్లో ట్రేడయ్యే ఎస్‌జీఎక్స్‌ నిఫ్టీ ఇండెక్స్‌ శుక్రవారం లాభంతో ముగిసింది.  నిఫ్టీ-50 ఫ్యూచర్స్‌ శుక్రవారం ముగింపు స్థాయి11928.25 తో పోలిస్తే 29పాయింట్ల లాభంతో 11,958 వద్ద స్థిరపడింది. పలు కంపెనీల క్యూ2 ఫలితాలు అంచనాలకు అనుగుణంగా ఉండటం, దేశీయ ఈక్విటీ మార్కెట్లలో విదేశీ ఇన్వెస్టర్ల పెట్టుబడులు కొనసాగుతుండటం, ఆర్థిక వ్యవస్థలో మందమన నివారణ చర్యల్లో భాగంగా కేంద్రం ఈక్విటీలపై పన్ను తగ్గింపు యోచనలో ఉన్నట్లు వార్తలు వెలువడటం, అంచనాలకు తగ్గట్టుగానే

Most from this category