దీపావళికి ముందే మరో బుల్‌రన్?!
By D Sayee Pramodh

పండుగ నాటికి పన్నెండు వేలకు నిఫ్టీ
నిపుణుల అంచనా
దేశీయ మార్కెట్లో క్రమంగా సంస్థాగత ఇన్వెస్టర్ల పెట్టుబడులు ఊపందుకుంటున్నాయి. పాజిటివ్ సెంటిమెంట్ పెరుగుతోంది. వరుసగా రెండో వారం కూడా వీఐఎక్స్ తరుగుదల నమోదు చేసింది. మరోవైపు ఎఫ్‌పీఐలు షార్ట్ పొజిషన్లు కవర్ చేసి, స్పాట్లో కొనుగోళ్లకు ప్రాధాన్యమిస్తున్నారు. ఇవన్నీ మార్కెట్‌పై బుల్స్ పట్టు మరింత పెరుగుతుందనేందుకు సంకేతాలని నిపుణులు అంచనా వేస్తున్నారు. అనుకున్నదానికన్నా ముందే అంచనాలను అందుకోగలదని భావిస్తున్నారు. మార్కెట్లో రిస్కులు తీసుకునేందుకు ఇన్వెస్టర్లు రెడీగానే ఉన్నారని తాజాగా లిస్టయిన ఐఆర్సీటీసీ నిరూపించింది. ఈ ఆఫర్ బంపర్ క్లిక్ కావడంతో ప్రభుత్వం పెట్టుబడుల ఉపసంహరణ మరింత ఉత్సాహంగా, దూకుడుగా చేసే అవకాశం ఉందని నిపుణులు భావిస్తున్నారు. మరోవైపు ఎన్నికల అనంతరం వ్యక్తిగత ఆదాయ పన్ను పరిమితి పెంచేందుకు ప్రభుత్వం రెడీగా ఉందని ఊహాగానాలున్నాయి. ఇదే నిజమైతే ఎకానమీలో వినిమయం మరింత జోరందుకుంటుంది. ఇటీవల కాలంలో ఐఎంఎఫ్, ప్రపంచబ్యాంకు లాంటివి భారత జీడీపీ వృద్ధి అంచనాలను తగ్గించాయి. ఇలా జరిగినప్పుడు గతంలో మార్కెట్ బాటమ్ జరిగింది. ఈసారి కూడా ఇదే తరహాలో బాటమ్ అవుట్ ఉంటుందని అంచనా. ప్రభుత్వం కార్పొరేట్ టాక్స్ తగ్గింపు, పీఎస్‌యూ బ్యాంకులకు ఆర్థిక సాయం తదితర సంస్కరణలు ప్రకటించడంతో ఇకపై ఎకానమీలో జోరు ఉంటుంది. ఇవన్నీ జరిగితే దీపావళికి ముందే మరో బుల్‌రన్ ఉంటుందని ఎక్కువమంది నిపుణుల అంచనా.
టెక్నికల్స్
నిఫ్టీ గరిష్ఠాల వద్ద నిరోధం ఎదుర్కొంటూనే ఉంది. స్వల్పకాలానికి 11690- 11750 పాయింట్లు, మధ్యకాలానికి 11950 పాయింట్లు నిరోధంగా ఉంటాయి. దిగువన 11200- 11300 పాయింట్ల మధ్యన మద్దతు దొరుకుతోంది. బ్యాంకు నిఫ్టీలో బలహీనత నిఫ్టీ ముందడుగులను నిరోధిస్తోంది. నిరోధ స్థాయిల వద్ద లాంగ్స్ తీసుకోవడం చేయవద్దని నిపుణులు సూచిస్తున్నారు. మార్కెట్లో నెలకొన్న ఉత్సాహం క్రమంగా అన్ని రంగాలకు వ్యాపిస్తే అప్పుడు ఆయా రంగాల్లో ఇప్పటివరకు ప్రదర్శన చూపని స్టాకులు కూడా ఊపందుకుంటాయి. అప్పుడు చిన్నస్టాకుల్లో కొనుగోళ్లు పెరుగుతాయి. క్యు2 ఫలితాలు ప్రస్తుతానికి మార్కెట్ గతిని నిర్ధారిస్తాయి.
You may be interested
తనఖా షేర్ల పరిష్కారమే ‘జీ’ రికవరీకి కీలకం
Saturday 19th October 2019ప్రమోటర్లు తనఖా పెట్టిన షేర్ల అంశానికి సంబంధించి సరైన పరిష్కారం దొరకడమే జీ ఎంటర్టైన్మెంట్ షేర్లలో రికవరీకి కీలకమని నిపుణులు అంచనా వేస్తున్నారు. క్యు2లో కంపెనీ ఆశించిన ఫలితాలు ఇవ్వకపోడంతో పలు బ్రోకరేజ్‌లు షేరు రేటింగ్, టార్గెట్ ధరలను తగ్గించారు. కంపెనీకి రావాల్సిన మొత్తాలు పేరుకుపోతుండడం, ఇది క్రమంగా ఆపరేటింగ్ నగదు ప్రవాహంపై నెగిటివ్ ప్రభావం చూపడం.. మరింత ఆందోళనపరిచే అంశమని నిపుణులు విశ్లేషిస్తున్నారు. కంపెనీ రుణ సమస్య పూర్తిగా
9నెలల్లో 25శాతం పెరిగిన పసిడి
Saturday 19th October 2019దేశీయ పసిడి ధరకు రానున్న రోజుల్లో రూపాయి కదలికలు, అమెరికా-చైనాల వాణిజ్య చర్చలు కీలకం కానున్నట్లు జియోజిత్ ఫైనాన్షియల్ కమోడిటీ అధిపతి హరీష్ వీ అభిప్రాయపడ్డారు. దేశీయ ఈక్విటీ మార్కెట్ల పతనం, వాణిజ్య ఉద్రిక్తతలు, రూపాయి ట్రేడింగ్‌లో అస్థిరత వంటి కారణాలతో పసిడి ధర 9నెలల్లో 25శాతం ర్యాలీ జరిపింది. రెండో త్రైమాసికపు చివర్లో 10గ్రాముల పసిడి ధర రూ.39,699 వద్ద జీవితకాల గరిష్టాన్ని అందుకుంది. సెప్టెంబర్-డిసెంబర్ మధ్య వివాహాలు,