News


బుల్లిష్‌ అష్టపది!

Friday 6th December 2019
Markets_main1575624751.png-30094

ఎనిమిది స్టాక్‌ రికమండేషన్లు
ఏడాది కాలంలో మంచి రాబడిని అందించే ఎనిమిది స్టాకులను నార్నోలియా ఫైనాన్షియల్‌ అడ్వైజర్స్‌, జియోజిత్‌ ఫిన్‌సర్వ్‌, రెలిగేట్‌ బ్రోకింగ్‌కు చెందిన అనలిస్టులు రికమండ్‌ చేస్తున్నారు. 
1. కోటక్‌మహీంద్రా బ్యాంక్‌: టార్గెట్‌ రూ. 1946. ఆరోగ్యవంతమైన లోన్‌గ్రోత్‌ కొనసాగిస్తోంది. పరిశ్రమలో మందగమనం ఉన్నా, బ్యాంకు మాత్రం మంచి పనితీరు చూపుతోంది. ఎన్‌ఐఐ, ఎన్‌ఐఎంలు బలంగా ఉండడంతో రెండంకెల లోన్‌గ్రోత్‌ కొనసాగవచ్చు. బ్యాంకు అనుబంధ విభాగాలు బలమైన వృద్ధి నమోదు చేస్తున్నాయి. 
2. కెన్‌ఫిన్‌ హోమ్స్‌: టార్గెట్‌ రూ. 495. మధ్యతరగతి గృహరుణాల విభాగంలో బలంగా ఉంది. వడ్డీరేట్ల తరుగుదల మార్జిన్ల విస్తృతికి దోహదం చేయవచ్చు. మందగమనం కారణంగా పరిశ్రమ ఆస్తుల నాణ్యతపై ఒత్తిళ్లు ఉన్నా, కంపెనీ ఆస్తుల నాణ్యత మాత్రం చాలా బాఉగుంది. రియల్టీ విభాగంలో మందగమనం కారనంగా కంపెనీపై పెద్ద నెగిటివ్‌ ప్రభావం కనిపించడం లేదు. కంపెనీ ఎక్కువగా రిటైల్‌ విభాగంపై ఫోకస్‌ చేయడం కలిసివచ్చే అంశం.
3. ఎల్‌ఐసీ హౌసింగ్‌ ఫైనాన్స్‌: టార్గెట్‌ రూ. 495. కంపెనీ ఎన్‌ఐఐ 15.8 శాతం, లోన్స్‌ 14.5 శాతం పెరుగుదల నమోదు చేశాయి(ఏడాదితో పోలిస్తే). ఎన్‌ఐఎం 2.42 శాతానికి మెరుగైంది. ఆర్థిక సంవత్సరం మొత్తానికి లోన్‌గ్రోత్‌ను 14-15 శాతం రేంజ్‌లో కొనసాగించాలని కంపెనీ భావిస్తోంది. ఆస్తుల నాణ్యత ఇటీవల కొంత దెబ్బతిన్నా తిరిగి కోలుకునేందుకే ఛాన్సులున్నాయి. 
4. ఎస్‌బీఐ లైఫ్‌: టార్గెట్‌ రూ. 1060. క్యు2లో స్థూల రిటెన్‌ ప్రీమియం 33.3 శాతం పెరిగింది. ప్రథమార్ధంలో కంపెనీ మార్కెట్‌ వాటా 200 బీపీఎస్‌ మేర పెరిగింది. ఏయూఎంలో 22.7 శాతం వృద్ది కనిపిస్తోంది. పలు బ్రోకరేజ్‌లు టార్గెట్‌ ధరను పెంచాయి. 
5. కేఈసీ ఇంటర్నేషనల్‌: టార్గెట్‌ రూ. 330. క్యు2లో రెవెన్యూ 17 శాతం పెరిగి రూ. 2809 కోట్లను చేరింది. టీఅండ్‌డీ రెవెన్యూ, ఎస్‌ఏఈ టవర్‌వ్యాపారం, రైల్వే వ్యాపారం బాగా పురోగతి చూపాయి. ఇదే ధోరణి ఇకపై కూడా కొనసాగవచ్చు. 
6. మారికో: టార్గెట్‌ రూ. 451. కొత్త ఉత్పత్తులు, డిమాండ్‌లో మెరుగుదల, అంతర్జాతీయ మార్కెట్లలో విస్తరణ, కీలక బ్రాండ్స్‌ లీడింగ్‌ స్థానంలో ఉండడం, కోర్‌ విభాగాల్లో మార్కెట్‌వాటా పెరగడం.. తదితరాలు కంపెనీ వచ్చే రెండుమూడేళ్ల పాటు రెండంకెల రెవెన్యూ వృద్ధి సాధించేందుకు దోహదం చేస్తాయి. 
7. సబార్న్స్‌: టార్గెట్‌ రూ. 321. పాసింజర్‌ వాహన పరిశ్రమ క్రమంగా కోలుకోనుంది. ఇందువల్ల మారుతీ, డెన్సో తదితరాలతో బలమైన సంబంధం ఉన్న ఈ కంపెనీకి మేలు చేకూరుతుంది. 
8. హోవెల్స్‌ ఇండియా: టార్గెట్‌ రూ. 795. ఎప్పటికప్పుడు ఉత్పత్తి పోర్టుఫోలియో విస్తరించుకుంటూ నాయకత్వ స్థానం కాపాడుకుంటోంది. ఎఫ్‌ఎంసీజీలో అవకాశాలు వినియోగించుకునేందుకు రెడీగా ఉంది. చాలా మార్కెట్లలో బలమైన వాటా ఉంది. విస్తృతమైన నెట్‌వర్క్‌ కలిసివచ్చే అంశం. కంపెనీ బాలెన్స్‌షీటు కూడా చాలా బలంగా ఉంది. You may be interested

రిలయన్స్‌ టార్గెట్‌ రూ.2,010: సీఎల్‌ఎస్‌ఏ

Friday 6th December 2019

అంతర్జాతీయ బ్రోకరేజ్‌ సంస్థ రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ షేరు టార్గెట్‌ ధరను అప్‌గ్రేడ్‌ చేసింది. ఇటీవల కాల్‌, డేటా సేవలపై సుంకాలను 35శాతం పెంచడంతో నిర్వహణ లాభం 1.1 బిలియన్ డాలర్ల నుండి 1.3 బిలియన్ డాలర్లకు పెరిగే అవకాశం ఉందని బ్రోకరేజ్‌ సంస్థ అంచనా వేసింది. ఈ నేపథ్యంలో షేరుకు గతంలో కేటాయించిన ‘‘బై’’ రేటింగ్‌ను కొనసాగించడంతో పాటు షేరు టార్గెట్‌ ధరను రూ.2,010లకు పెంచుతున్నట్లు ప్రకటించింది. ‘‘రిలయన్స్‌ జియో కాల్‌,

బ్యాంక్‌ నిఫ్టీ 1.25% క్రాష్‌

Friday 6th December 2019

బ్యాంక్‌ నిఫ్టీ ఇండెక్స్‌ శుక్రవారం మిడ్‌సెషన్‌ సమయానికి 1.32శాతం నష్టపోయింది. ఈ దఫా వడ్డీరేట్లపై ఎలాంటి మార్పు లేకుండా యథాతధంగా ఉంచుతున్నట్లు ప్రకటించడంతో నిన్న ఆర్‌బీఐ పాలసీ కమిటి నిర్ణయం తీసుకోవడంతో బ్యాకింగ్‌ రంగ షేర్లు మార్కెట్‌ ప్రారంభం నుంచి అమ్మకాల ఒత్తిడికి లోనవుతున్న సంగతి తెలిసిందే. అందులో భాగంగా ప్రభుత్వరంగ బ్యాంక్‌ షేర్లు ఎక్కువగా నష్టపోయాయి. మిడ్‌సెషన్‌ను ప్రైవేట్‌ రంగ షేర్లలో సైతం అమ్మకాలు వెల్లువెత్తాయి. ఫలితంగా బ్యాంక్‌

Most from this category