News


దేశీ మార్కెట్లపట్ల బుల్లిష్‌: మొబియస్‌

Tuesday 3rd March 2020
Markets_main1583213802.png-32240

చైనాకు ప్రత్యామ్నాయంగా భారత్‌కు అవకాశాలు
కరోనా ప్రభావం​అత్యంత తక్కువకావడం సానుకూలం
మొబియస్‌ కేపిటల్‌ పార్టనర్స్‌ వ్యవస్థాపకులు మార్క్‌ మొబియస్‌

ప్రస్తుతం ప్రపం‍చాన్ని వణికిస్తున్న కరోనా వైరస్‌ దేశీయంగా పెద్దగా ప్రభావం చూపబోదని వర్ధమాన మార్కెట్ల ఫండ్‌ మేనేజర్‌ మార్క్‌ మొబియస్‌ పేర్కొంటున్నారు. కరోనా ప్రభావం ఇక్కడ అత్యంత తక్కువగా నమోదుకావడం సానుకూల అంశమని చెబుతున్నారు. మొబియస్‌ కేపిటల్‌ పార్టనర్స్‌ వ్యవస్థాపకులు మార్క్‌ మొబియస్‌ ఒక ఇంటర్వ్యూలో చైనాలో పరిస్థితులు, దేశీ అవకాశాలు తదితర అంశాలపై అభిప్రాయాలను వ్యక్తం చేశారు. వివరాలు చూద్దాం..

బుల్లిష్‌గా
కోవిడ్‌-19 ప్రపంచ దేశాలను వణికిస్తున్నప్పటికీ దేశీ స్టాక్‌ మార్కెట్లపట్ల బుల్లిష్‌గా ఉన్నాం. ఇక్కడ కరోనా కేసులు నామమాత్రంగానే నమోదుకావడం సానుకూల అంశం. చైనాలో పుట్టి అంతర్జాతీయంగా విస్తరిస్తున్న కరోనా వైరస్‌ కారణంగా దేశీ తయారీ రంగానికి అవకాశాలు పెరిగే వీలుంది. ఇకపై ప్రపంచ దేశాలు చైనాకు ప్రత్యామ్నాయంగా ఇతర దేశాల తయారీ కేంద్రాలపై దృష్టిసారించే అవకాశముంది. ఇది దేశీ కంపెనీలకు లబ్ది చేకూర్చనుంది.  

డివిడెండ్‌, పసిడి
ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా స్టాక్‌ మార్కెట్లలో ఆందోళనకర పరిస్థితులు నెలకొన్నాయి. దీంతో దేశీయంగా అత్యధిక డివిడెండ్‌ పంచే కంపెనీలవైపు దృష్టి సారించడం మేలు. అంతేకాకుండా బంగారం కొనుగోలుకీ ప్రాధాన్యత ఇవ్వవచ్చు. దేశీయంగా కరోనా ప్రభావం నామమాత్రంకావడం, చైనాకు ప్రత్యామ్నాయంగా విడిభాగాలు, ముడిసరుకులు అందించగల ప్లాంట్ల కారణంగా ఇక్కడి స్టాక్‌ మార్కెట్లపట్ల బుల్లిష్‌ ధోరణితో ఉన్నాం. ఇందుకు అనుగుణంగా ప్రభుత్వం ఎగుమతులు, పెట్టుబడులకు తలుపులు తెరవాల్సి ఉంటుంది.

అలజడి
ప్రస్తుతం కరోనా వైరస్‌ ప్రపంచవ్యాప్తంగా విస్తరిస్తుండటంతో అంతటా ఆందోళనలు నెలకొన్నాయి. ప్రయాణాలు రద్దుకావడం, పనులు నిలిచిపోవడం, వినియోగం నీరసించడం వంటి అంశాలు ఆర్థిక వృద్ధిపై ప్రతికూల ప్రభావాన్ని చూపే అవకాశముంది. వైరస్‌ చైనాలో​పుట్టి విస్తరించడంతో ప్రధానంగా సరఫరాలకు దెబ్బ తగులుతోంది. అంతర్జాతీయంగా పలు పరిశ్రమలు చైనా నుంచి ముడిసరుకులు, విడిభాగాల దిగుమతులపై ఆధారపడటంతో పరిస్థితులు వికటిస్తున్నాయి. ప్రపంచంలోనే చైనా అతిపెద్ద తయారీ కేంద్రంగా నిలుస్తున్న కారణంగా ఆందోళనలు పెరుగుతున్నాయి. పరిశ్రమల విషయానికివస్తే.. అమెరికాలో ఫార్మా, ఆటో, ఎలక్ట్రానిక్స్‌ వంటి రంగాలు సమస్యలు ఎదుర్కొనే వీలుంది. 

కేంద్ర బ్యాంకులు
కరోనా కట్టడికి తాజాగా కేంద్ర బ్యాంకులు సన్నాహాలు చేస్తున్నాయి. అయితే ఏ విధమైన చర్యలు చేపడతాయన్నది ఆసక్తిని రేకెత్తిస్తోంది. యూరోపియన్‌ యూనియన్‌లో అయితే ఇప్పటికే వడ్డీ రేట్లు నామమాత్ర స్థాయిలో కొనసాగుతున్నాయి. ఇక యూఎస్‌లోనూ ఫెడ్‌ ఫండ్స్‌ రేట్లు అంత ఎక్కువగా ఏమీలేవు. వ్యక్తిగత ఖాతాలకు నిధులను జమ చేయడం ద్వారా కరోనా సమస్యలకు చెక్‌ పెట్టే అవకాశాలను కేంద్ర బ్యాంకులు పరిశీలించవచ్చు. You may be interested

కరోనాకు ఫైజర్‌ నుంచి ఔషధం!

Tuesday 3rd March 2020

16 శాతం దూసుకెళ్లిన షేరు  ప్రస్తుతం ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్‌ నివారణకు వీలుగా అమెరికన్‌ మాతృ సంస్థ కెమికల్‌ కాంపౌండ్‌ను అభివృద్ధి చేసిన వార్తలతో ఫార్మా రంగ దిగ్గజం ఫైజర్‌ లిమిటెడ్‌ కౌంటర్‌కు ఉన్నట్లుండి డిమాండ్‌ పెరిగింది. ఇన్వెస్టర్లు కొనుగోళ్లకు క్యూకట్టడంతో ఎన్‌ఎస్‌ఈలో తొలుత ఫైజర్‌ లిమిటెడ్‌ షేరు 16 శాతం దూసుకెళ్లింది. రూ. 4,925ను తాకింది. ఇది చరిత్రాత్మక గరిష్టంకాగా.. ప్రస్తుతం 5.6 శాతం జంప్‌చేసి రూ. 4,483

స్వల్పంగా పెరిగిన పుత్తడి

Tuesday 3rd March 2020

సోమవారం భారీగా పెరిగిన పసిడిధరలు మంగళవారం స్వల్పంగా పుంజుకున్నాయి. దేశీయ మల్టీ కమోడిటీ మార్కెట్‌లో నిన్నటితో పోలిస్తే రూ.150 పెరిగి 10 గ్రాముల బంగారం రూ.42,026.00 వద్ద ట్రేడ్‌ అవుతోంది. అంతర్జాతీయ మార్కెట్‌లో నిన్నటితో పోలిస్తే 6 డాలర్లు పెరిగి ఔన్స్‌ బంగారం 1,600.85 డాలర్ల  వద్ద ట్రేడ్‌ అవుతోంది. (సోమవారం బంగారం(స్పాట్‌) ముగింపు ధరల కోసం ఆయా నగరాల గుర్తులపై క్లిక్‌ చేయగలరు)  

Most from this category