బ్యాంకు నిఫ్టీలో కాల్ బటర్‌ఫ్లై వ్యూహం బెటర్!
By D Sayee Pramodh

ప్రధాన సూచీలతో పోలిస్తే ఇటీవల కాలంలో పేలవ ప్రదర్శన చూపుతున్న బ్యాంకు నిఫ్టీ క్రమంగా పాజిటివ్‌గా మారుతోంది. సూచీలోని ప్రధాన కంపెనీలు మంచి ఫలితాలు చూపుతుండడంతో బ్యాంకు నిఫ్టీలో బుల్స్ సందడి పెరిగింది. నిఫ్టీలో షార్ట్‌కవరింగ్, ఓపెన్ ఇంట్రెస్ట్‌లో తరుగుదల.. ఇవన్నీ మొత్తంమీద మార్కెట్లో పాజిటివ్ వాతావరణాన్ని చూపుతున్నాయి. బ్యాంకు నిఫ్టీలో 29-30 వేల మధ్య కాల్స్, పుట్స్, లాంగ్స్, షార్ట్స్ ఎక్కువగా కనిపిస్తున్నాయి. ప్రధానంగా 29500 పాయింట్ల వద్ద భారీగా కాల్స్ పోగవడంతో ఈ స్థాయిని దాటగలిగితే తక్షణం 2 శాతం దూకుడు కనిపించే ఛాన్సులున్నాయి. దీంతో క్రమంగా 30వేల పాయింట్లను కూడా తాకే అవకాశం ఉందని నిపుణుల అంచనా. ఈ నేపథ్యంలో కాల్బటర్ఫ్లై వ్యూహం అవలంబించాలని నిపుణులు సూచిస్తున్నారు. ఈ వ్యూహంలో టార్గెట్ 29800 పాయింట్లపైన ఉండగా, స్టాప్‌లాస్ 29500 పాయింట్ల దిగువన ఉంటుంది. ఇందులో 29000, 30000 కాల్స్ చెరొక లాట్ చొప్పున కొని, రెండులాట్ల 29500 పుట్స్‌ను విక్రయిస్తారు. వ్యూహానికి బ్రేక్ ఈవెన్ స్థాయి 29564. రిస్క్ రివార్డు నిష్పత్తి 3.6:1గా ఉంటుంది. గమనిక: నిపుణుల సూచనలను అమలు చేసే ముందు సొంత అధ్యయనం తప్పనిసరి.
వ్యూహం:
You may be interested
30,000 పాయింట్ల చేరువలో బ్యాంక్ నిఫ్టీ
Tuesday 29th October 2019ఉదయం ట్రేడింగ్‌లో స్తబ్ధుగా సాగిన బ్యాంకు షేర్లలో మిడ్‌సెషన్ కల్లా కొనుగోళ్ల మద్దతు లభించింది. దాంతో ఈ సూచీ 30,000 పాయింట్ల స్థాయిని సమీపించింది. నేడు బ్యాంక్ నిఫ్టీ ఇండెక్స్ 29,527.60 వద్ద ట్రేడింగ్‌ను ప్రారంభించింది. ఉదయం ట్రేడింగ్ సెషన్లో బ్యాంక్ రంగ షేర్లు స్వల్పంగా అమ్మకాల ఒత్తిడికి లోనవడంతో ఇండెక్స్ ఒకదశలో అరశాతం (131 పాయింట్లు) నష్టపోయి 29385.45 వద్ద ఇంట్రాడే కనిష్టాన్ని నమోదు చేసింది. అనంతరం అనూహ్యంగా బ్యాంకింగ్
అటో, మెటల్ షేర్ల ర్యాలీ
Tuesday 29th October 2019మంగళవారంనాటి మార్కెట్ ర్యాలీని మెటల్, అటో షేర్లు ముందుండి నడిపిస్తున్నాయి. ఈ రంగ షేర్ల ర్యాలీ కారణంగా సూచీలు భారీ లాభాల్ని అర్జిస్తున్నాయి. మంగళవారం ఉదయం సెషన్లో ఎన్ఎస్ఈలో మెటల్ షేర్లకు ప్రాతినిథ్యం వహించే నిఫ్టీ మెటల్ ఇండెక్స్ 4శాతం లాభపడగా, అటో రంగషేర్లకు ప్రాతినిథ్యం వహించే నిఫ్టీ అటో ఇండెక్స్ 3.50శాతం పెరిగింది. అమెరికా చైనాల మధ్య మొదటి దశ ఒప్పంద చర్చలు సఫలీకృతమయ్యే దిశగా సాగుతుండంతో మెటల్ షేర్లకు కలిస్తోంది.