News


నిఫ్టీ చార్టుల్లో బుల్లిష్‌ క్యాండిల్‌!

Saturday 14th December 2019
Markets_main1576297876.png-30225

నిఫ్టీ వరుసగా మూడో సెషన్‌లో(శుక్రవారం) కూడా గ్యాప్‌అప్‌తో ఆరంభమై మంచి లాభాలతో ముగిసింది. ఇంట్రాడేలో 12099 పాయింట్లను తాకింది. ప్రస్తుతం నిఫ్టీ డైలీ, వీక్లీ చార్టుల్లో బుల్లిష్‌ క్యాండిల్స్‌ ఏర్పడ్డాయి. దీనికితోడు ఈ క్యాండిల్స్‌ హయ్యర్‌ హై, హయ్యర్‌లో రూపంలోఉన్నాయి. ఇలాంటి క్యాండిల్స్‌ ఏర్పడడం బుల్లిష్‌నెస్‌కు సంకేతమని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. మూడు సెషన్ల అప్‌మూవ్‌తో ప్రస్తుత కరెక‌్షన్‌ 11832 పాయింట్ల వద్ద బాటమ్‌ అవుట్‌ అయినట్లు భావిస్తున్నారు. నిఫ్టీ ఇండికేటర్లు బుల్లిష్‌గా మారాయని, నిఫ్టీ మరోమారు తన ఆల్‌టైమ్‌ హై 12158ని తాకుతుందని చార్ట్‌వ్యూ ఇండియా ప్రతినిధి మజార్‌ మహ్మద్‌ అంచనా వేశారు. అయితే నాలుగు రోజలు నష్టాలను రెండ్రోజుల్లో అధిగమించినందున బుల్స్‌ కొంత అలుపు తీర్చుకునే ఛాన్సులు కూడా ఉన్నాయన్నారు.

ప్రస్తుతం నిఫ్టీ తన ఆల్‌టైమ్‌ హైకి 72 పాయింట్ల దూరంలో ఉంది. నిఫ్టీ మరొక్క గ్యాప్‌ అప్‌ ఓపెనింగ్‌ చూపితే తప్పక గత గరిష్ఠాలను దాటుతుందన్నది నిపుణుల భావన. నిఫ్టీ 12035 పాయింట్ల పైన ఉన్నంత వరకు 12200- 12300 పాయింట్లను చేరే ఛాన్సులు ఎక్కువని మార్కెట్‌ నిపుణుడు చందన్‌ తపారియా అభిప్రాయపడ్డారు. దిగువన 12000, 11950 పాయింట్ల వద్ద మద్దతు ఉందన్నారు. నిఫ్టీ స్థిరంగా 12080ని దాటడం పాజిటివ్‌ అంశమని, ఈ తరుణంలో దిగువకు వచ్చినప్పుడల్లా లాంగ్స్‌ తీసుకోవచ్చని మరో నిపుణుడు శ్రీకాంత్‌ చౌహాన్‌ తెలిపారు. నిఫ్టీకి తదుపరి నిరోధాలు 12160, 12250 పాయింట్ల వద్ద ఉంటాయని, 10900 పాయింట్లు మద్దతుగా ఉంటుందని చెప్పారు. 
 



You may be interested

పసిడికి కలిసొచ్చిన డాలర్‌ బలహీనత

Saturday 14th December 2019

డాలర్ బలహీనతకు తోడు బాండ్‌ ఈల్డ్స్‌ పతనంతో శుక్రవారం పసిడి ధర లాభంతో ముగిసింది. అమెరికాలో రాత్రి ఔన్స్‌ పసిడి ధర 9డాలర్లు 1,481.20 డాలర్ల వద్ద స్థిరపడింది. బ్రిటన్‌లో గురువారం జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో కన్జర్వేటివ్ పార్టీ ఘనవిజయం సాధించింది. కన్జర్వేటివ్ పార్టీ యూరోపియన్‌ యూనియన్‌ నుంచి వైదొలిగేందుకు (బ్రెగ్జిట్‌)కు అనుకూలంగా ఉండటంతో డాలర్‌తో పోలిస్తే పౌండ్ విలువ మూడు శాతం పెరిగింది. ఈ ఏడాది మే నుంచి

పేటీఎమ్‌కు రూ.4,724 కోట్ల పెట్టుబడులు

Saturday 14th December 2019

న్యూఢిల్లీ: డిజిటల్‌ చెల్లింపుల సంస్థ పేటీఎమ్‌ మరోసారి నిధులు సమీకరించింది. పేటీఎమ్‌ మాతృసం‍స్థ, వన్‌97 కమ్యూనికేషన్స్‌ రూ.4,724 కోట్లు(66 కోట్ల డాలర్లు) సమీకరించిందని, చైనా అన్‌లైన్‌ దిగ్గజం అలీబాబాకు చెందిన అలీపేతో పాటు టి రొవె ప్రైస్‌ నిర్వహణలోని ఫండ్స్‌, సాఫ్ట్‌ బ్యాంక్‌కు చెందిన ఎస్‌వీఎఫ్‌ పాంథర్‌(కేమ్యాన్‌) ఈ పెట్టుబడులు పెట్టాయని తెలిసింది. ఈ వివరాలను బిజినెస్‌ ఇంటెలిజెన్స్‌ ప్లాట్‌ఫార్మ్‌ టోఫ్లర్‌ పేర్కొంది. ఈ విషయమై పేటీఎమ్‌ స్పందించలేదు. కాగా

Most from this category