News


2019: ఈ స్టాక్స్‌.. హీరోలు

Thursday 26th December 2019
Markets_main1577352927.png-30456

కేంద్రంలో సుస్థిర ప్రభుత్వం నెలకొనడం, ప్రభుత్వ సంస్కరణలు, రిజర్వ్‌ బ్యాంక్‌ రేట్ల కోతలు, విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్ల(ఎఫ్‌పీఐలు) పెట్టుబడులు తదితర సానుకూల అంశాల నేపథ్యంలో ఈ ఏడాది ఇప్పటివరకూ దేశీ స్టాక్‌ మార్కెట్లు సగటున 10 శాతంపైగా లాభాలు ఆర్జించాయి. మార్కెట్ల ప్రామాణిక ఇండెక్స్‌ సెన్సెక్స్‌ 13 శాతంపైగా ర్యాలీ చేయగా.. ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 11 శాతం పురోగమించింది. మరోవైపు అంతర్జాతీయ స్థాయిలో కొన్ని నెలలుగా ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు సవాళ్లు విసురుతున్న అమెరికా, చైనా వాణిజ్య వివాదాలకు చెక్‌ పడటంతో గత వారం సెంటిమెంటు మరింత బలపడింది. వెరసి అమెరికా మార్కెట్లతోపాటు.. సెన్సెక్స్‌, నిఫ్టీ చరిత్రాత్మక గరిష్టాలను అందుకున్నాయి. ఈ నేపథ్యంలో వివిధ సానుకూల వార్తల కారణంగా కొన్ని కంపెనీల షేర్లు ప్రధాన స్టాక్‌ సూచీల్ని మించి దూకుడు చూపాయి.ఈ కౌంటర్లలో ఇన్వెస్టర్లు కొనుగోళ్లకు కట్టుబడటంతో భారీ లాభాలతో సందడి చేశాయి. వివరాలు చూద్దాం

లాభాల హైజంప్‌
బీఎస్‌ఈలో లిస్టయిన కొన్ని ప్రధాన కంపెనీల కౌంటర్లలో కొన్ని 200 శాతం నుంచి 50 శాతం వరకూ లాభపడ్డాయి. వీటిలో అదానీ గ్రీన్‌ ఎనర్జీ 200 శాతం దూసుకెళ్లగా.. సీమెక్‌ 125 శాతం జంప్‌చేసింది. ఈ బాటలో ఆవాస్‌ ఫైనాన్షియర్స్‌, తాన్లా సొల్యూషన్స్‌, గార్డెన్‌ రీచ్‌ షిప్‌ బిల్డర్స్‌, రిలయన్స్‌ నిప్పన్‌, క్రెడిట్‌ యాక్సెస్‌ గ్రామీణ్‌, హెచ్‌డీఎఫ్‌సీ అసెట్‌ మేనేజ్‌మెంట్‌, క్యాంటబిల్‌ రిటైల్‌, హిందుస్తాన్‌ ఫుడ్స్‌, అయాన్‌ ఎక్ఛేంజ్‌, ఆస్ట్రా జెనెకా 125-90 శాతం మధ్య ఎగిశాయి. ఎన్‌బీఎఫ్‌సీ రంగంలో మణప్పురం ఫైనాన్స్‌ 85 శాతం ర్యాలీ చేయగా.. ఇన్ఫో ఎడ్జ్‌, హింద్‌ రెక్టిఫయర్స్‌, గుజరాత్‌ గ్యాస్‌, డిక్సన్‌ టెక్నాలజీస్‌, పీఐ ఇండస్ట్రీస్‌, ఏజీసీ నెట్‌వర్క్‌, అబాట్‌ ఇండియా 80 స్థాయిలో జంప్‌ చేశాయి.

బ్లూచిప్స్‌ తీరిలా...
ఈ ఏడాది మార్కెట్లను మించుతూ లాభాలు అందించిన బ్లూచిప్స్‌ కౌంటర్ల జాబితా చూస్తే.. సెన్సెక్స్‌ దిగ్గజాలలో బజాజ్‌ ఫైనాన్స్‌, ఐసీఐసీఐ బ్యాంక్‌, భారతీ ఎయిర్‌టెల్‌ 50-40 శాతం స్థాయిలో పురోగమించాయి. ఇక రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌, కొటక్‌ మహీంద్రా బ్యాంక్‌, ఏషియన్‌ పెయింట్స్‌ సైతం 40-30 శాతం మధ్య ర్యాలీ చేశాయి. ఇటీవల మార్కెట్‌ ఫేవరెట్‌గా నిలుస్తున్న హెచ్‌డీఎఫ్‌సీ లైఫ్‌ ఇన్సూరెన్స్‌ 59 శాతం ఎగసింది.

టాప్‌-10 బ్లూచిప్స్‌
కంపెనీ పేరు ధర(23-12-2019) లాభం(శాతంలో)
బజాజ్‌ ఫైనాన్స్‌ రూ.4177  61
హెచ్‌డీఎఫ్‌సీ లైఫ్‌ రూ.617 59
సీమెన్స్‌ రూ.1545 55
టాటా గ్లోబల్‌ రూ.319 51
ఐసీఐసీఐ బ్యాంక్‌  రూ.545 50
బజాజ్‌ ఫిన్‌సర్వ్‌ రూ.9324 46
ఎయిర్‌టెల్‌ రూ.451 43
రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ రూ.1568 39
కొటక్‌ మహీంద్రా రూ.1706 38
బీపీసీఎల్‌  రూ.496 34You may be interested

32,000 దిగువన బ్యాంక్‌ నిఫ్టీ ముగింపు

Thursday 26th December 2019

డిసెంబ‌ర్ డెరివేటివ్ కాంట్రాక్టు గ‌డువు ముగింపు నేప‌థ్యంలో గురువారం బ్యాంకింగ్‌ రంగ షేర్లలో భారీగా అమ్మకాలు నెలకొన్నాయి. ఫలితంగా నేడు మార్కెట్‌ ముగిసే సరికి 32వేల స్థాయిని కోల్పోయి 31,997.70 వద్ద స్థిరపడింది. ఎన్‌ఎస్‌ఈలో బ్యాంకింగ్‌ రంగ షేర్లకు ప్రాతినిథ్యం వహించే నిఫ్టీ బ్యాంక్‌ నిఫ్టీ ఇండెక్స్‌ నేడు 32,276.15 వద్ద ట్రేడింగ్‌ను ప్రారంభించింది. నేడు డిసెంబ‌ర్ డెరివేటివ్ కాంట్రాక్టు గ‌డువు ముగింపు నేప‌థ్యంలో బ్యాంకింగ్‌ రంగ షేర్లలో అమ్మకాలు

ఈ టాప్‌ ఫండ్స్‌లో రిస్క్‌ తక్కువ

Thursday 26th December 2019

హెచ్‌డీఎఫ్‌సీ ఈక్విటీ సేవింగ్స్‌ ఐసీఐసీఐ ప్రుడెన్షియల్‌ ఈక్విటీ సేవింగ్స్‌ ఐడీఎఫ్‌సీ రెగ్యులర్‌ సేవింగ్స్‌ వేల్యూ రీసెర్చ్‌ ధీరేంద్ర కుమార్‌ రికమండేషన్స్‌ గతేడాది పలు ఒడిదొడుకులు, నియంత్రణల్లో మార్పులు వంటి అంశాల నడుమ మ్యూచువల్‌ ఫండ్‌ మార్కెట్లు ఆకర్షణీయ పనితీరును చూపలేకపోయాయంటున్నారు వేల్యూ రీసెర్చ్‌ సీఈవో ధీరేంద్ర కుమార్‌. ఒక ఆంగ్ల చానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో విభిన్న ఇన్వెస్టర్లకు విభిన్న ఫండ్స్‌ను సూచించారు. ఇతర వివరాలు చూద్దాం.. 2019లో ఈక్విటీ విభాగంలో లార్జ్‌క్యాప్‌ ఫండ్స్‌ ముందు నిలిచాయి. వ్యక్తిగత

Most from this category