News


బుల్‌ రన్‌..సెన్సెక్స్‌ 1237, నిఫ్టీ 384 పాయింట్లు అప్‌

Monday 23rd September 2019
Markets_main1569222680.png-28493

‍ప్రభుత్వం దేశీయ కంపెనీలపై విధిస్తున్న కార్పోరేట్‌ ట్యాక్స్‌ను 30 శాతం నుంచి 22 శాతానికి తగ్గించడంతో దేశీయ ఈక్విటీ మార్కెట్‌లు భారీ స్థాయిలో లాభపడి ట్రేడవుతున్నాయి. గత సెషన్‌లో మొదలైన బుల్స్‌ ఆధిపత్యం సోమవారం ట్రేడింగ్‌లో కూడా స్పష్టంగా కనిపిస్తోంది. మధ్యాహ్నాం 12.15 సమయానికి దేశీయ బెంచ్‌మార్క్‌ సూచీలు నిఫ్టీ 50 384.20 పాయింట్లు లేదా 3.41 శాతం పెరిగి 11,658.40 పాయింట్ల వద్ద ట్రేడవుతోంది. అదేవిధంగా బీఎస్‌ఈ సెన్సెక్స్‌ 1,237.34 లేదా 3.25 శాతం పెరిగి 39,251.96 పాయింట్ల వద్ద ట్రేడవుతోంది. ఎన్‌ఎస్‌ఈలో నిఫ్టీ బ్యాంక్‌ ఇండెక్స్‌ 1,527.10 పాయింట్లు లేదా 5.27 శాతం లాభపడి 30,508.65 పాయింట్ల వద్ద ట్రేడవుతోంది. ఈ ఇండెక్స్‌లో ఇండస్‌ ఇండ్‌ బ్యాంక్‌ 8.17 శాతం, ఐసీఐసీఐ బ్యాంక్‌ 6.44 శాతంతో ర్యాలీ చేస్తున్నాయి.
   నిఫ్టీ 50లో ఎల్‌ అండ్‌ టీ 9.74 శాతం, ఏసియన్‌ పెయింట్స్‌ 8.80 శాతం, బజాజ్‌ ఫిన్సర్వ్‌ 8.60 శాతం, బ్రిటానియా 8.48 శాతం, ఐటీసీ 8.36 శాతం లాభపడి పాజిటివ్‌గా ట్రేడవుతున్న షేర్లలో ముందున్నాయి. అదే విధంగా ఇన్ఫోసిస్‌ 4.22 శాతం, డా. రెడ్డీస్‌ 3.62 శాతం, టీసీఎస్‌ 3.34 శాతం, విప్రో 2.97 శాతం, జీ ఎంటర్‌టైన్‌మెంట్‌ 2.69 శాతం నష్టపోయి, నష్టాల్లో ట్రేడవుతున్న షేర్లలో ముందున్నాయి. 



You may be interested

ఫార్మా షేర్లకు యూఎస్‌ఎఫ్‌డీఏ సెగ

Monday 23rd September 2019

యూఎస్‌ఎఫ్‌డీఏ సంబంధిత సమస్యల కారణంగా ఫార్మా ఇండెక్స్‌లో అధిక వెయిటేజీ కలిగిన డాక్టర్‌ రెడ్డీస్‌, లుపిన్‌, సిప్లా షేర్ల పతనంతో నిఫ్టీ ఫార్మా ఇండెక్స్‌ నష్టాల బాట పట్టింది. ఎన్‌ఎస్‌ఈలో నిఫ్టీ షేర్లకు ప్రాతినిథ్యం వహించే నిఫ్టీ ఫార్మా ఇండెక్స్‌ 8,063.10 వద్ద ట్రేడింగ్‌ను ప్రారంభించింది. మార్కెట్‌ ఆరంభంలో కొనుగోళ్ల మద్దతు లభించడంతో ఇండెక్స్‌ 1.21శాతం ర్యాలీ చేసింది. అనంతరం ఇండెక్స్‌లో ప్రధాన షేర్ల పతనంతో తిరిగి నష్టాల్లోకి మళ్లింది. రూపాయి

స్థిరంగా పసిడి

Monday 23rd September 2019

పసిడి ధర సోమవారం స్థిరంగా కదులుతుంది. నేడు ఔన్స్‌ పసిడి ధర 3డాలర్ల లాభంతో 1,527 డాలర్ల వద్ద ట్రేడ్‌ అవుతోంది. అంతర్జాతీయ ఉద్రికత్తలు పసిడి ర్యాలీకి మద్దతినిస్తున్నాయి. అలాగే అమెరికా-చైనాల మధ్య వాణిజ్య చర్చలపై సరైన స్పష్టత కొరుకు ఎదురుచూస్తున్నారు. పసిడి ప్రస్తుతం మిశ్రమ జోన్‌లో ఉందని ఓసీబీసీ బ్యాంక్‌ ఆర్థికవేత్త హవాయి లీ అభిప్రాయపడ్డారు. సౌది అరేబియాలో ఉద్రిక్తతలు పెరగడం, వాణిజ్య చర్చల్లో భాగంగా గతవారాంతంలో అమెరికా

Most from this category