News


కరెక్షన్‌లో పోర్ట్‌ఫోలియో నిర్మించుకోండి!

Thursday 5th March 2020
Markets_main1583387199.png-32296

ప్రయివేట్‌ రంగ బ్యాంక్స్‌ ఆకర్షణీయం
ఆటో కౌంటర్లనూ ఎంపిక చేసుకోవచ్చు
కరెక‌్షన్‌ కారణంగా మార్కెట్లు మెరుగుపడ్డాయ్‌
నీలేష్‌ శెట్టి, క్వాంటమ్‌ మ్యూచువల్‌ ఫండ్‌

ఆరు నెలల క్రితంతో పోలిస్తే ప్రస్తుతం మార్కెట్లపట్ల ఆశావహంగా ఉన్నట్లు క్వాంటమ్‌ మ్యూచువల్‌ ఫండ్‌ అసోసియేట్‌ మేనేజర్‌ నీలేష్‌ శెట్టి పేర్కొంటున్నారు. మార్కెట్ల ధోరణి,  గ్రామీణ డిమాండ్‌, ప్రయివేట్‌ రంగ బ్యాంక్స్‌, ఆటో తదితర రంగాలపై ఒక ఇంటర్వ్యూలో పలు అభిప్రాయాలు వ్యక్తం చేశారు. వివరాలు చూద్దాం..

దృష్టి సారించవచ్చు
ఇటీవల వచ్చిన కరెక్షన్‌ కారణంగా దేశీ స్టాక్‌ మార్కెట్లలో పెట్టుబడులవైపు దృష్టి సారిస్తున్నాం. ఆరు నెలల క్రితం చూస్తే.. దేశ ఆర్థిక పురోగతికి సంబంధంలేకుండా స్టాక్‌ మార్కెట్ల విలువలు పెరిగిపోయాయి. దిద్దుబాట్ల కారణంగా ప్రస్తుతం మార్కెట్లపట్ల సానుకూల ధోరణి ఏర్పడింది. దిద్దుబాట్ల సమయంలో పెట్టుబడులకు ఆసక్తి చూపుతున్నాం. కొన్ని రంగాలలో రికవరీ సంకేతాలు కనిపిస్తున్నాయి. రికార్డ్‌ స్థాయి వ్యవసాయోత్పత్తి, ద్రవ్యోల్బణం వంటి అంశాల నేపథ్యంలో గ్రామీణ ప్రాంత కొనుగోలు శక్తి పుంజుకునే వీలుంది. అయితే కరోనా వైరస్‌ భయాలతో ప్రస్తుతం మార్కెట్లలో సెంటిమెంటు బలహీనపడింది. ఈ సమయంలో ఇన్వెస్ట్‌ చేయడం ద్వారా దీర్ఘకాలిక పోర్ట్‌ఫోలియోను నిర్మించుకోవడం మేలు చేయగలదు.

దిగివస్తున్నాయ్‌
తొలుత నాణ్యమైన ప్రయివేట్‌ బ్యాంక్‌ కౌంటర్లను కొనుగోలు చేస్తూ వచ్చాం. ఇవి చాలావరకూ ప్రీమియం ధరలకు చేరాయి. ప్రస్తుత దిద్దుబాట్ల కారణంగా వీటి ధరలు దిగివస్తున్నాయి. ఈ బాటలో కొన్ని ఎంపిక చేసిన ఆటో రంగ కౌంటర్లు సైతం కరెక్షన్‌ను చవిచూస్తున్నాయి. వీటితోపాటు సిమెంట్‌ రంగంలోనూ కొన్ని కౌంటర్లు దిద్దుబాటుకు లోనుకావడం ద్వారా ఆకర్షిస్తున్నాయి. కొన్ని సిమెంట్‌​కౌంటర్లు రీప్లేస్‌మెంట్‌ విలువతో పోలిస్తే డిస్కౌంట్‌లో ట్రేడవుతున్నాయి. గ్రామీణ ప్రాంతాలలో వినియోగం పెరిగితే ఈ రంగాలు జోరు చూపే వీలుంది.

ఆటోకు కష్టకాలం
నిజానికి కరోనాతో తలెత్తిన సరఫరాల కొరత, బీఎస్‌-6 ప్రమాణాలు వంటి అంశాలు దేశీయంగా ఆటో రంగానికి సమస్యలు సృష్టిస్తున్నాయి. కరోనా మరింత విస్తరిస్తే.. వచ్చే ఆరు నెలల కాలంలో ఆటో రంగానికి మరిన్ని ఇబ్బందులు ఎదురుకావచ్చు. అయితే దేశీయంగా ఆటో రంగానికి భారీ అవకాశాలున్నాయి. ఇతర వర్ధమాన మార్కెట్లతో పోల్చినా.. మరో దశాబ్ద కాలంపాటు ఆటో అమ్మకాలు పెరిగే వీలుంది. నిజానికి ఈ రంగంలోని పలు కౌంటర్లు విలువ రీత్యా కనిష్టాలకు చేరాయి. దీర్ఘకాలిక ధృక్పథంతో చూస్తే ఆటో రంగం స్ట్రక్చరల్‌ స్టోరీగా కనిపిస్తోంది. ఫలితంగా ఎంపిక చేసిన కౌంటర్లకు పోర్ట్‌ఫోలియోలో చోటివ్వవచ్చు. ప్రధానంగా ద్విచక్ర వాహనాలు, ట్రాక్టర్ల విభాగంలో ఇప్పటికే భారీ పెట్టుబడులను వెచ్చించాం.

ఫెడ్‌ బాటలో.. 
అమెరికా ఫెడరల్‌ రిజర్వ్‌ బాటలో రిజర్వ్‌ బ్యాంక్‌ సైతం​వడ్డీ రేట్ల తగ్గింపు లేదా ఇతర చర్యలు తీసుకునే అవకాశముంది. అయితే నిజానికి ఆర్థిక వ్యవస్థ మందగించడం వల్ల డిమాండ్‌ క్షీణిస్తోంది. ఇందుకు కేవలం​పరపతి విధానాలు మాత్రమే సరిపోవు. ఆర్థిక మందగమనానికి ఇంకా పలు కారణాలున్నాయి. దీంతో మానిటరీ విధానాలతోనే సమస్యలను తొలగించలేము. కాగా.. రుతుపవనాల విస్తరణ, రిజర్వాయర్లలో నీటి నిల్వలు వంటి అంశాల నేపథ్యంలో పంటలు పుష్కలంగా పండే అవకాశముంది. అంతేకాకుండా వ్యవసాయోత్పత్తులకు తగిన ధరలు సైతం లభించే వీలుంది. గత మూడు నెలలుగా ఆహార ద్రవ్యోల్బణం 11 శాతానికి చేరింది. కొద్ది నెలలుగా పాల ఉత్పత్తుల ధరలు తదితరాలను పరిగణిస్తే.. గ్రామీణ ప్రాంతాల నుంచి డిమాండ్‌ పెరగడం కనిపిస్తోంది. ఇది వినియోగదారులకు ఇబ్బంది కలిగించినా ఉత్పత్తిదారులకు మేలు చేకూరుస్తోంది. గత కొన్నేళ్లుగా గ్రామీణ వినియోగం మందగించడంతో అమ్మకాలు క్షీణిస్తున్న అంశాన్ని కంపెనీలు పేర్కొంటూనే ఉన్నాయి. అయితే ఈ ఏడాది పరిస్థితులు రికవరీని సూచిస్తున్నాయి. దీనికి వచ్చే ఏడాది సైతం రుతుపవనాలు అనుకూలించవలసి ఉంది. సమీప కాలానికి గ్రామ ప్రాంతాల నుంచి వినియోగం పుంజుకోనుంది.You may be interested

రూ.43,000 పైన స్థిరంగా బంగారం!

Thursday 5th March 2020

చైనాలోనేకాగా ఇతర దేశాల్లో సైతం కోవిడ్‌-19 వైరస్‌ వేగంగా విస్తరిస్తున్న నేపథ్యంలో ప్రపంచ ఈక్విటీ మార్కెట్లు అనిశ్చితిలో కొనసాగుతుండడంతో బంగారం ధరలు పెరుగుతూ పోతున్నాయి. తాజాగా బంగారం ధర రూ.43,000 పైకి చేరింది. గురువారం ఉదయం 11 గంటల ప్రాంతంలో దేశీయ మల్టీకమోడిటీ మార్కెట్‌లో నిన్నటితో పోలిస్తే రూ.50 తగ్గి 10 గ్రాముల బంగారం 43,422.00 వద్ద ట్రేడ్‌అవుతోంది. అంతర్జాతీయ మార్కెట్‌లో నిన్నటితో పోలిస్తే 2 డాలర్లు తగ్గి ఔన్స్‌

ఎఫ్‌ఎమ్‌సీజీ షేర్లకు కొనుగోళ్ల మద్దతు

Thursday 5th March 2020

మార్కెట్ ర్యాలీలో భాగంగా గురువారం ఉదయం ట్రేడింగ్‌ సెషన్‌లో ఎఫ్‌ఎమ్‌సీజీ షేర్లకు కొనుగోళ్ల మద్దతు లభిస్తుంది. ఫలితంగా ఎన్‌ఎస్‌ఈలో ఈ రంగ షేర్లకు ప్రాతినిథ్యం వహించే నిఫ్టీ ఎఫ్‌ఎంసీజీ ఇండెక్స్‌ 1.50శాతానికి పైగా లాభపడింది. ఐటీసీ(1.50శాతం), హిందూస్థాన్‌ యూనిలివర్‌ (3.50శాతం)షేర్లు లాభపడటం ఇండెక్స్‌ ర్యాలీకి కారణమైనట్లు విశ్లేషకులు భావిస్తున్నారు. ఉదయం గం.10:30ని.లకు ఇండెక్స్‌ నిన్నటి ముగింపు స్థాయి(29,223.75)తో పోలిస్తే 1.57శాతం లాభంతో 29,682.05 వద్ద ట్రేడ్‌ అవుతోంది. ఇదే సమాయనికి

Most from this category