News


ఈక్విటీ పెట్టుబడులు పాపం కాదు: విజయ్‌ కేడియా

Monday 8th July 2019
Markets_main1562582876.png-26902

చిన్న వయుసులోనే మల్టీబ్యాగర్‌గా దలాల్‌ స్ట్రీట్‌లో గుర్తింపు పోందారు విజయ్‌ కేడియా. విలువైన పెట్టుబడిదారుగా గుర్తింపు పొందిన కేడియా ప్రభుత్వం బడ్జెట్‌లో మార్కెట్‌లపై పన్నులను విధించి పేద, మధ్య తరహ ఇన్వెస్టర్లు నష్టపోవడానికి కారణం అయ్యిందని ఆరోపించారు. మిగిలిన విషయాలు ఆయన మాటల్లోనే.....

‘‘స్టాక్‌ మార్కెట్లలో ఇన్వెస్ట్‌ చేయడం సిగరెట్‌ తాగడం, మద్యం సేవించడం వంటి పాపాలుగా ప్రభుత్వం పరిగణిస్తోంది. లేకపోతే ఈక్విటీలపై పన్నులను విధించేందుకు ఎందుకు మార్గాలను వెతుకుతోందో అర్ధం కావడం లేదు. ఈ బడ్జెట్‌లో డివిడెండ్‌లపై ఉన్న పన్నును తొలగిస్తారని అనుకున్నాం. కానీ కంపెనీలు చేసే బై బ్యాక్‌లపై సర్‌చార్జీలను పెంచింది. డివిడెండ్లపై పన్నుగానీ, బైబ్యాక్‌లపై పన్నుగానీ అర్థరహితమైనవి. డివిడెండ్‌లు ఇన్వెస్టర్ల సంపదను పెంచితే, బై బ్యాక్‌లు ఆ షేర్ల విలువను పెంచుతాయి. కానీ ప్రభుత్వం ఈ విషయాన్ని పట్టించుకోవడం లేదు. స్టాక్‌ మార్కెట్‌లలో పెట్టుబడులు పెట్టడం సంపన్నుల వ్యాపారంగా ప్రభుత్వం భావిస్తోంది. కానీ మార్కెట్లలో పెట్టుబడులు పెట్టే ఇన్వెస్టర్లలో 90 శాతం పేద, మధ్య మధ్యతరగతి ప్రజలే ఉంటారు. లాభాలు పొం‍దడం పక్కన పెడితే 50 శాతానికి పైగా ఇటువంటి ఇన్వెస్టర్లు తమ కష్టార్జితాన్ని పెట్టుబడులుగా పెట్టి నష్టపోతున్నారు. ప్రభుత్వానికి ఈ విషయాలు పట్టవు. ఎందుకంటే ప్రభుత్వం డీల్‌ చేసేది కేవలం ధనవంతులైన బ్రోకర్లు, ఫండ్‌ మానేజర్లతోనేగా. 
    మీడియా కూడా సూటు బూటు వేసుకున్న వివిధ శాఖల మానేజర్లు, హార్వర్డ్‌లో చదివిన విదేశి సంస్థాగత ఫండ్‌ మేనెజర్లుతో ఇంటర్యూలు తీసుకోడానికి ఎగబడతాయి. మార్కెట్ల పరిస్థితి ఎలా ఉన్నా... లాభపడేది ఫండ్‌ మెనేజర్లు, బ్రోకర్లు, సెబీ, స్టాక్‌ ఎక్సెంజీలు, ప్రభుత్వం మాత్రమే. పేద, మధ్యతరగతి ఇన్వెస్టర్ల నష్టపోయినా,   వీరు మాత్రం లాభాలను గడిస్తారు. వీరు మధ్యవర్తులుగా చెలామణి అవుతు లాభపడతారు.  ఇన్వెస్టర్లు నష్టపోయిన మార్కెట్‌లో అయినా మధ్యవర్తులు 90 శాతం ఆదాయం గడిస్తున్నారు. నష్టపోయిన ఇన్వెస్టర్లకు ఏం చేయాలో కూడా అర్థం కాకపోతుంటే ప్రభుత్వం మాత్రం స్టాక్‌ మార్కెట్ల పరిస్థితి బాగున్నట్టు ప్రవర్తిస్తోంది.
      ప్రాథమిక సూచీలు నిజమైన మార్కెట్‌ పరిస్థితిని తెలియపరచలేవు. ప్రాథమిక సూచీల జీవీత కాల గరిష్ఠాలను చూసిన ఓ ఐదు స్టాకులు ఇండెక్స్‌ను లాభాల్లోకి తీసుకొస్తాయి. కానీ ప్రభుత్వం మాత్రం ఇన్వెస్టర్లందరూ లాభాలు పొం‍దారనుకుంటుంది. స్మాల్‌ క్యాప్‌, మిడ్‌ క్యాప్‌లో జరిగే అవకతవకలకు బలయ్యేది చిన్న మదుపర్లే. బ్యాంకుల్లో దాచుకునే బంగారం లేదా ఫిక్సిడ్‌ డిపాజిట్లపై అధికంగా లాభాలొస్తున్నాయి కానీ ఈక్విటీ మార్కెట్లో లాభాలు పొందడం మాత్రం కష్టంగా మారింది. మన ప్రభుత్వాలు ఈక్వీటీ మార్కెట్లను భిన్నంగా చూసేంత వరకు ఈ మార్కెట్లలో డబ్బు సంపాదించడం కష్టంతో కూడుకున్న పని’’ అని అన్నారు.



You may be interested

సెన్సెక్స్‌ 800 పాయింట్లు క్రాష్‌

Monday 8th July 2019

బడ్జెట్‌ ప్రతిపాదనలు మార్కెట్‌ వర్గాలను మెప్పించకపోవడంతో రెండో రోజూ సూచీలు నిలువునా పతనమయ్యాయి. ప్రపంచ మార్కెట్లలో నెలకొన్న బలహీన సంకేతాలు, ముడిచమురు ధరల పెరుగుదల, రూపాయి ఒడిదుడుకుల ట్రేడింగ్‌, రేపటి నుంచి ప్రస్తుత ఆర్థిక సంవత్సరపు క్యూ1 ఫలితాల విడుదల నేపథ్యంలో ఇన్వెస్టర్లు అప్రమత్తత తదితర అంశాలు కూడా మార్కెట్‌ సెంటిమెంట్‌ను బలహీనపరిచాయి. సెన్సెక్స్‌ ఏకంగా 793 పాయింట్లు నష్టపోయి 39 వేల దిగువున 38,720 వద్ద ముగిసింది. నిఫ్టీ

ఫైనాన్షియల్‌ సర్వీసుల షేర్లు...నిలువునా పతనం

Monday 8th July 2019

మార్కెట్‌ పతనంలో భాగంగా సోమవారం ఫైనాన్షియల్‌ సర్వీసుల షేర్లు తీవ్ర స్థాయిలో నష్టపోయాయి. బడ్జెట్లో డిజిటల్‌ లావాదేవీలను ప్రోత్సాహించే దిశగా రూ. కోటికి మించి నగదు తీసుకుంటే 2శాతం పన్ను విధించారు. అలాగే  కంపెనీలు ప్రకటించే బై బ్యాక్‌లపై 20శాతం పన్ను చెల్లించాలని బడ్జెట్లో ప్రతిపాదించారు. ఈ రెండు అంశాలతో నేడు ఈ షేర్లు తీవ్రంగా అమ్మకాల ఒత్తిడిని ఎదుర్కోన్నాయి. ఎన్‌ఎస్‌ఈలో ఈ రంగ షేర్లకు ప్రాతినిధ్యం వహించే నిఫ్టీ ఫైనాన్షియల్‌

Most from this category