News


వారంలో 10-20శాతం నష్టాలను చవిచూసిన 18 షేర్లివే...

Saturday 13th July 2019
Markets_main1563013295.png-27045

మోదీ 2.0 ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్‌ మార్కెట్‌ను మెప్పించలేకపోయింది. ఫలితంగా బెంచ్‌మార్క్‌ సూచీలైన నిఫ్టీ, సెన్సెక్స్‌ ఈ వారంలో 2శాతం క్షీణించాయి. ఈ ఐదు ట్రేడింగ్‌ సెషన్స్‌లో రూ.3.27లక్షల కోట్ల ఇన్వెస్టర్ల సంపద హరించుకుపోయింది. గతవారం ఆర్థికమంత్రి ప్రతిపాదించిన బడ్జెట్‌లో భారత్‌ను 5 ట్రిలియన్ డాలర్ల ఆర్థికవ్యవస్థ వైపు తీసుకెళ్లడానికి అన్ని అంశాలు ఉన్నాయి. అయితే, సంపన్న వర్గాలపై పన్ను విధించాలనే ప్రతిపాదన, భారత్‌తో ఇన్వెస్ట్‌ చేస్తున్న  2000కు పైగా విదేశీ ఫండ్స్‌లపై పాటు అధిక నెట్‌వర్త్‌ కలిగిన సంపన్నులపై తీవ్ర ప్రతికూల ప్రభావాన్ని చూపింది. ఫలితంగా మార్కెట్లో విస్తృతమైన అమ్మకాలు జరిగాయి. ముఖ్యంగా ఇండెక్స్‌లల్లో లార్జ్ క్యాప్‌ కంపెనీ షేర్లైన టీసీఎస్‌, హెచ్‌డీఫ్‌సీ బ్యాంక్‌, నెస్లే ఇండియా, మారుతి సుజుకీ, ఎల్‌అండ్‌టీ, టైటాన్‌ కంపెనీ, ఐసీఐసీఐ బ్యాంక్‌, ఎస్‌బీఐ, భారతీ ఎయిర్‌టెల్‌, విప్రో, టాటామోటర్స్‌ లాంటి షేర్లు భారీగా నష్టపోయాయి. 

‘‘సంపన్న వర్గాలపై మరింత పన్ను విధింపు, బై బ్యాక్‌ ఇష్యూపై 20శాతం పన్ను విధింపు, లిస్టెడ్‌ కంపెనీల్లో పబ్లిక్‌ వాటాను 10శాతం పెంచడటం తదితర ఎవరూ ఊహించని విధానాలను ఆర్థిక మంత్రి బడ్జెట్‌లో ప్రవేశపెట్టడంతో మార్కెట్‌ ఈ వారం ప్రారంభరోజైన సోమవారం భారీగా నష్టపోయింది. దాదాపు మూడేళ్ల తరువాత ఒకరోజు ట్రేడింగ్‌ సెషన్‌లో భారీ పతనాన్ని చవిచూశాయి. విశ్లేషకులు సూచీల భారీ క్షీణతకు బడ్జెట్‌ను కారణంగా ఆపాదించారు. అయితే, అధిక వాల్యూవేషన్‌ వెయిటేజీ సూచీల నాటకీయ క్షీణతకు కారణమని జీమిత్‌ మోదీ సామ్‌కో సెక్యూరిటీస్‌, స్టాక్‌ నోట్‌ ఫౌండర్‌ జీమిత్‌ మోదీ అభిప్రాయపడ్డారు. నిఫ్టీ 50 ఇండెక్స్‌ ప్రస్తుతం ఆల్‌టైం గరిష్టస్థాయి పీ/ఈకి 29 రెట్ల అధికంగా ట్రేడ్‌ అవుతోంది. అటువంటి పరిస్థితులలో.., బడ్జెట్‌ స్వల్ప కాలికానికి ఎలాంటి ప్రయోజనాన్ని సమకూర్చకపోవచ్చనే అంచనాలతో సహజంగానే మార్కెట్‌ ప్రతికూలంగా స్పందించవలసి వచ్చిందని జీమిత్‌ మోదీ అన్నారు. 

బీఎస్‌ఈ సెన్సెక్స్‌ 1.97శాతం, నిఫ్టీ 2.1శాతం క్షీణించాయి. అలాగే బీఎస్‌ఈ స్మాల్‌క్యాప్‌ ఇండెక్స్‌ 2.58 శాతం నష్టపోగా, బీఎస్‌ఈ మిడ్‌క్యాప్‌ ఇండెక్స్‌ 1.17శాతం పతనమైంది. ఈ వారం రోజుల్లో బీఎస్‌ఈ 500 ఇండెక్స్‌లో 370 స్టాక్‌లు ఇన్వెస్టర్లకు నష్టాలను పంచగా, వాటిలో 18 స్టాక్‌లు 10నుంచి 20శాతం వరకు క్షీణించాయి. వాటిలో జెట్‌ ఎయిర్‌వేస్‌, సద్భవ్‌ ఇంజనీరింగ్స్‌, మైండ్‌ట్రీ, ఆర్‌ఈసీ, దిలీప్‌ బిల్డ్‌కాన్‌, జై ప్రకాష్‌ అసోసియేట్స్‌, ఇండియాబుల్స్‌ వెంచర్స్‌, హెచ్‌ఈజీ, టైటాన్‌ కంపెనీ షేర్లు ఉన్నారు. 

ఇక వచ్చే వారంలో మార్కెట్‌కు కార్పోరేట్‌ కంపెనీల ఫలితాలు కీలకం కానున్నాయి. మైండ్‌ట్రీ, విప్రో, ఏసీసీ, కాల్గేట్‌, డాబర్‌ ఇండియా, ఆర్‌ఐఎల్‌, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకులతో సుమారు 70 కంపెనీలు తమ క్యూ2 ఫలితాలను ప్రకటించనున్నాయి. ఈ నేపథ్యంలో ఇన్వెస్టర్లు, ట్రేడర్లు అప్రమత్తత వహించే అవకాశం ఉంది. అలాగే నిన్న ప్రకటించిన ద్రవ్యోల్బణ, పారిశ్రామికోత్పత్తి గణాంకాలు మార్కెట్‌ను ఏ మేరకు ప్రభాతం చేస్తాయో అనే అంశాన్ని పరిశీలించాల్సి ఉంటుంది. గణాంకాలు మార్కెట్‌ ఆశించిన స్థాయిలో లేవు. కావును మార్కెట్‌ నెగిటివ్‌లో ప్రారంభమయ్యే అవకాశం ఉంది. ఒకవేళ నిఫ్టీ నష్టాల బాట పట్టినట్లైతే.., 11460 వద్ద కీలకమైన నిరోధ స్థాయి కలిగి ఉంది. You may be interested

అవెన్యూ సూపర్‌మార్ట్‌ క్యూ1 నికర లాభం రూ.323 కోట్లు

Saturday 13th July 2019

నూతనంగా 8 స్టోర్లను ఆవిష్కరణ డీ-మార్ట్ పేరుతో రిటైల్ అవుట్‌లెట్లను నడుపుతున్న అవెన్యూ సూపర్‌మార్ట్ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికంలో రూ.323 కోట్ల నికర లాభాన్ని ఆర్జించింది. గతేడాది ఇదే క్యూ1లో ఆర్జించిన రూ.245 కోట్ల నికరలాభంతో పోలిస్తే ఇది 32శాతం అధికం. కన్సాలిడేషన్‌ ప్రాతిపదికన ఈ క్యూ1లో కంపెనీ ఆదాయం 27శాతం వృద్ధి చెంది రూ.5,815 కోట్లను సాధించింది. గతేడాది క్యూ1 కాలానికి కంపెనీ ఆదాయం రూ.4,576 కోట్లుగా

ఈ అపోహలు సంపద సృష్టికి అడ్డంకి

Saturday 13th July 2019

‘ఈక్విటీ మార్కెట్లలలో పెట్టుబడులు పెట్టడానికి చాలా మంది ఆసక్తి చూపిస్తుంటారు. ఇది జూదం అని నమ్మేవారు దీని నుండి దూరంగా ఉండటానికి  ప్రయత్నిస్తుంటారు. స్టాక్ మార్కెట్లపై అవగాహన కలిగి ఉన్నవారు త్వరగా డబ్బు సంపాదించే మార్గంగా దీనిని భావిస్తారు. చాలామందికి ఈక్విటీ మార్కెట్లపై కొన్ని అపోహలున్నాయి’ అని ఎడల్‌వెయిస్‌ వెల్త్‌ మేనేజ్‌మెంట్‌ రాహుల్‌ జైన్‌ అన్నారు. ఈ అపోహలపై స్పష్టతనిచ్చేందుకు ప్రయత్నించారు. ముఖ్యమైన విషయాలు ఆయన మాటల్లోనే.... అపోహ 01- మార్కెట్లలో

Most from this category