News


అంచనాలు అధికం... అందుకోలేని బడ్జెట్‌!

Saturday 1st February 2020
Markets_main1580557504.png-31406

దేశీయ సూచీలు శనివారం భారీ పతనం నమోదు చేశాయి. బడ్జెట్లో కోట్ల రూపాయాల మేర సాగు, ఇన్‌ఫ్రా రంగాలకు మద్దతు పథకాలు ప్రకటించినా, డీడీటీ ఎత్తివేసినా, ఐటీ స్లాబులు తగ్గించినా.. సూచీలకు పెద్దగా రుచించలేదు. నిర్మలమ్మ సంస్కరణలు మార్కెట్‌ అంచనాలను సంతృప్తి పరచలేకపోయాయని రాయిటర్స్‌ వ్యాఖ్యానించింది.

బడ్జెట్‌, మార్కెట్‌పై వివిధ అనలిస్టుల అభిప్రాయాలు ఇలా ఉన్నాయి...
= వినోద్‌ నాయర్‌, జియోజిత్‌ ఫిన్‌సర్వ్‌: మార్కెట్లో అంచనాలతో పోలిస్తే బడ్జెట్‌ చాలా పేలవంగా ఉంది. ఎకానమీకి మరింత మద్దతు, మరింత లిక్విడిటీ చర్యలను మార్కెట్లు ఆశించాయి. వచ్చే ఏడాదికి విత్తలోటు అంచనాలు పెంచాల్సిఉంది. సాధారణ ప్రజల దృష్టితో చూస్తే బడ్జెట్‌ బాగుంది కానీ, ప్రస్తుత ఎకానమీ పరిస్థితుల్లో మరిన్ని చర్యలు అవసరం.
= నిర్మల్‌జైన్‌, ఐఐఎఫ్‌ఎల్‌: అంచనాలు చాలా ఎక్కువగా ఉండడంతో ఎన్ని మంచి చర్యలున్నా మార్కెట్‌కు సంతృప్తి కలగలేదు. విదేశీ ఇన్వెస్టర్లకు ఎన్నో ఉద్దీపనలున్నాయి. డీడీటీని షేర్‌హోల్డర్లపై మోపడం సరైనది కాదు. దీనివల్ల ప్రైవేట్‌ రంగ పెట్టుబడులపై నెగిటివ్‌ ప్రభావం కొనసాగవచ్చు.
= విజయ్‌ చందోక్‌, ఐసీఐసీఐ సెక్యూరిటీస్‌: వృద్ధి పట్టాలెక్కించడమే ప్రధాన ఎజెండాగా బడ్జెట్‌ఉంది. ఐటీ సరళీకరణ వినిమయంలో ఊపు తెస్తుంది. డీడీటీ ఎత్తివేయడం ఈక్విటీలకు మేలు చేయవచ్చు. 
= నీలేశ్‌ షా, కోటక్‌ మహీంద్రా ఏఎంసీ: బడ్జెట్‌ బాగుంది. కానీ సంస్కరణలు ఎంతమేర సరైనదిశలో అమలవుతాయో చూడాలి.  ప్రభుత్వ ఉద్ధేశాలు అమలు దిశగా ఎలా మారతాయో వేచిచూడాలి.
= విజయ్‌ భూషన్‌, ఏఎన్‌ఎంఐ: డీడీటీ ఎత్తివేయడం మంచి చర్య. రిటైల్‌ ఇన్వెస్టర్లు బాగా ప్రయోజనం పొందుతారు. ఎల్‌ఐసీ ఐపీఓకి రావడం దేశీయ క్యాపిటల్‌ మార్కెట్స్‌కు మంచిది. 
= ధర్మేశ్‌ కాంత్‌, ఇండియా నివేశ్‌: ఎల్‌టీసీజీ, ఎస్‌టీటీ అంశాల్లో మార్కెట్‌ అంచనాలు నెరవేరలేదు. ఈక్విటీ మార్కెట్లో పెట్టుబడుల వరదు ఇవే కీలకం. ఐటీ సరళీకరణ పాజిటివ్‌ అంశం. 
= కృష్ణ కుమార్‌, ఎమ్‌కే గ్లోబల్‌: భారీ ఉద్దీపనలు లేకపోవడం, ఎల్‌టీసీజీ తీసివేయకపోవడం స్టాక్‌మార్కెట్లకు రుచించలేదు. డీడీటీ ఎత్తివేయడం కొంతమేర ప్రయోజనకారి. ఐటీ సరళీకరణ కొంత అయోమయంగా ఉంది.
= లక్ష్మీ అయ్యర్‌, కోటక్‌ మహీంద్రా: విత్తలోటు అంచనా, మార్కెట్‌ అంచనాలకు అనుగుణంగానే ఉంది. కార్పొరేట్‌ బాండ్స్‌లో ఎఫ్‌పీఐ పరిమితి పెంచడం మంచి చర్య. దీనివల్ల లిక్విడిటీ పెరగవచ్చు. 



You may be interested

బడ్జెట్‌ 2020: ఈ రంగాలకు ప్రయోజనం..!

Saturday 1st February 2020

దేశీయ ఆర్థిక వ్యసస్థ వృద్ధి 11ఏళ్ల కనిష్టానికి దిగజారిన తరుణంలో శనివారం కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్‌ బడ్జెట్‌ ప్రవేశపెట్టారు. వరుసగా రెండోసారి ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన ఈ బడ్జెట్‌పై మార్కెట్‌ వర్గాలతో పాటు ఆర్థిక వ్యవస్థ కూడా భారీగా ఆశలు పెంచుకుంది. ఆదాయాల్ని, కొనుగోలు శక్తిని పెంచడం ఈ బడ్జెట్‌ ప్రధాన లక్ష్యమని, ద్రవోల్యణం ఎక్కువగా ఉందని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్‌

బడ్జెట్‌ ఎఫెక్ట్‌...సెన్సెక్స్‌ 1000 పాయింట్లు క్రాష్‌

Saturday 1st February 2020

40వేల దిగువన ముగిసిన సెన్సెక్స్‌ 318 పాయింట్లు నష్టపోయిన నిఫ్టీ బడ్జె్ట్‌ మార్కెట్‌ వర్గాలను మెప్పించకపోవడంతో స్టాక్‌ మార్కెట్‌ శనివారం భారీ నష్టంతో ముగిసింది. ప్రధాన సూచీలైన సెన్సెక్స్‌, నిఫ్టీలు 2శాతం పతనాన్ని చవిచూశాయి. అన్ని రంగాలపై కస్టమ్‌ డ్యూటీ పెంచడంతో పాటు ఇన్ఫ్రారంగానికి ఆశించిన స్థాయిలో కేటాయింపులు జరపకపోవడంతో మార్కెట్లో అమ్మకాల సునామీ సాగాయి. లాంగ్‌ టర్మ్‌ క్యాపిటల్‌ గెయిన్స్‌ ట్యాక్స్‌ (ఎల్‌టీసీజీ)ని రద్దు అంశాన్ని పరిగణలోకి తీసుకోకపోవడం మార్కెట్‌ వర్గాలను

Most from this category