News


బడ్జెట్‌-2019 అప్‌డేట్‌: ద్రవ్యలోటు లక్ష్యం 3.3 శాతం

Friday 5th July 2019
Markets_main1562304276.png-26812

 • కేంద్ర బడ్జెట్‌ 2019ని ఆమోదించిన కేబినెట్‌ .
 • 1.85 ట్రిలియన్‌ డాలర్ల ఆర్థిక వ్యవస్థను గత ఐదేళ్లలో 2.7 ట్రిలియన్‌ డాలర్లకు పెంచాం. ఇది 2020 ఆర్థిక సంవత్సరంలో 3 ట్రిలియన్‌ డాలర్లకు పెరగనుంది.
 • ఇంకొన్నేళ్లలో 5 ట్రిలియన్‌ డాలర్లే లక్ష్యం.
 • మౌలిక, డిజిటల్‌, ఎమ్‌ఎస్‌ఈలలో ఉద్యోగ కల్పనకు అధికంగా పెట్టుబడులు.
 • సాగరమాల, భారతమాల పథకాల వలన మౌలిక రంగం అభివృద్ది.
 • జీఎస్‌టీ నమోదైనా ఎస్‌ఎంఈలకు రూ. 350 కోట్ల రాయితీలు కేటాయించాం.
 • ఒకే దేశం ఒకే పవర్‌ గ్రిడ్‌కు కట్టుబడి ఉన్నాం.
 • 657 కీ.మీ మెట్రోరైల్‌ పనులు ప్రస్తుతం జరుగుతున్నాయి.
 • ఎన్‌బీఎఫ్‌సీల డెట్‌ సెక్యూరిటీస్‌లోకి ఎఫ్‌ఐఐ, ఎఫ్‌పీఐల అనుమతి.
 •  ఈ ఆర్థిక సంవత్సరంలో రూ.1 లక్ష కోట్ల విలువ కలిగిన ఎన్‌బీఎఫ్‌సీల కొనుగోలు చేస్తే ఒకసారికి ప్రభుత్వం ఆరు నెలలు హామీగా ఉం‍టుంది.
 • ఏవియేషన్‌, మీడియా, ఇన్సూరెన్స్‌ రంగాలలో ఎఫ్‌డీఐల పరిమితి పెంపు.
 • ఎన్‌ఆర్‌ఐ శాఖను ఎఫ్‌పీఐ రూటుతో విలీనం. 
 • ఆర్‌ఈఐటీల డెట్‌ సెక్యూరిటీస్‌లోకి  ఎఫ్‌పీఐల అనుమతి.
 • పీఎమ్‌ఏవై పథకం కింద ఆర్థిక సంవత్సరం 20-22 నాటికి 1,95 కోట్ల ఇళ్ల నిర్మణం.
 • పీఎం గ్రామ్‌ సడక్‌ యోజన పథకం కింద వచ్చే ఐదేళ్లలో 1.25 లక్షల రోడ్లను నవీకరించేందుకు రూ.80, 250 కోట్ల పెట్టుబడులు.
 • లిస్టెడ్‌ కంపెనీలలో పబ్లిక్‌ షేరు హోల్డింగ్‌ను 35 శాతంకు పెంచేవిధంగా సెబీపై ఒత్తిడి. 
 • భారత్‌ నెట్‌ ద్వారా ప్రతి పంచాయితీకి అందుబాటులోకి రానున్న ఇంటర్నెట్‌.
 • జాతీయ పరిశోధన సంస్థ ఏర్పాటు.
 •  ప్రపంచస్థాయి ఉన్నత విధ్యా సంస్థలకు ఎఫ్‌వై20లో రూ. 400కోట్ల కేటాయింపు. 
 • పాఠశాల, ఉన్నత చదువులలో మార్పుకై కొత్త విధ్యా విధానం.
 • స్వతంత్ర ప్రతిపత్తి కలిగిన ఉన్నత విధ్యా కమిషన్‌ ఏర్పాటు.
 • ఐదేళ్ల క్రితం వరకు​ ప్రపంచ స్థాయి విధ్యాసంస్థలలో 200 ర్యాంకింగ్‌లో భారతీయ సంస్థ ఒకటి కూడా ఉండేది కాదు. ఇప్పుడు 200 ర్యాంకింగ్‌లో మూడు సంస్థలున్నాయి. 
 • 10,000 రైతు సంస్థల ఏర్పాటు.
 • ఖేలో ఇండియా పథకానికి ప్రభుత్వం కట్టుబడి ఉంది. 
 • 2019 అక్టోబర్‌ 02 నాటికి బహిరంగ మలమూత్ర విసర్జన రహిత దేశంగా ఇండియా.
 • ఇండియా పాస్‌పోర్ట్‌ ఉన్న ఎన్‌ఆర్‌ఐలకు ఆధార్‌ కార్డు జారీ.
 • ఎల్‌ఈడీ బల్బుల ఏర్పాటు వలన రూ.18,314 కోట్లు పొదుపు చేశాం.
 • ఫేమ్‌ 2 కు రూ.10,000 కోట్ల కేటాయింపు.
 • హెచ్‌ఎఫ్‌సీ నియంత్రణను ఎన్‌హెచ్‌బీ నుంచి ఆర్బీఐకి బదిలి.
 • ప్రభుత్వ రంగ బ్యాంకులకు రూ.70,000 కోట్ల రీ క్యాపిటలైజేషన్‌.
 • వచ్చే ఐదేళ్లలో మౌలిక రంగంలో రూ.100 లక్ష కోట్ల పెట్టుబడులకై ప్రతిపాదన.
 • ఎఫ్‌వై 20లో రూ.1.05 లక్షల కోట్ల పెట్టుబడుల ఉపసంహరణే లక్ష్యం.
 • రూ. 20 నాణేలు తొందరలో అందుబాబులోకి రానున్నాయి.
 • ఆదాయ పన్ను రిటర్న్‌ల కోసం పాన్‌ లేకపోతే ఆధార్‌ వినియోగించుకోవచ్చు.
 • పన్నుల సేకరణ 2013-14 లో 6.37లక్షల​ కోట్లుండగా, 2018-19 నాటికి  11.37 లక్షల కోట్లకు పెరిగింది. 
 •  వార్షిక టర్నోవర్‌ లిమిట్‌ రూ.250 కోట్లున్న కంపెనీలు 25 శాతం కార్పోరేట్‌ టాక్స్‌ను చెల్లిస్తుండగా అ పరిమితిని రూ.400 కోట్లకు పెంపు.
 • ఎలక్ట్రిక్‌ వాహనాల కొనుగోలుకై తీసుకున్న రుణాలపై అదనంగా రూ. 1.05 లక్షల వడ్డి మినహాయింపు.
 • ఒక బ్యాం‍కు ఖాతాపై ఏడాదికి కోటికి మించి నగదును విత్‌డ్రా చేసుకుంటే 2 శాతం టీడీఎస్‌.
 • డిజిటల్‌ చెల్లింపులపై చార్జీల మినహాయింపు.
 • రూ.5 కోట్ల సంపాదన దాటితే 7 శాతం ఆదాయపు పన్ను పెంపు.
 • ఇందనాలపై ఒక రూపాయి పెరిగిన ఎక్సైజ్‌ డ్యూటీ.
 • రూ.2-5 కోట్ల సంపాదనపై సర్‌ చార్జిలు పెంపు.
 • రూ.2-5 కోట్ల సంపాదనపై  3శాతం ఆదాయపు పన్ను.
 • బంగారం, విలువైన మెటల్స్‌పై దిగుమతి సుంకం 10 శాతం నుంచి 12.5శాతానికి పెంపు.
 • వ్యక్తిగత ఆదాయ పన్నులు యదాతథం.
 • రక్షణ రంగాన్ని ఆధునీకరించేందుకు రక్షణ పరికరాల దిగుమతులకు ప్రాథమిక కస్టమ్స్ సుంకం నుంచి మినహాయింపు.
 • ఎఫ్‌వై 20లో కేంద్ర ద్రవ్యలోటు లక్ష్యాన్ని 3.4 శాతం నుం‍చి 3.3 శాతానికి తగ్గింపు.
 • ఎఫ్‌వై 20 లో పన్నేతర ఆదాయ లక్ష్యం రూ. 3.13 లక్షల కోట్లు.
 • ఎఫ్‌వై 20 లో గ్రాస్‌ అప్పుల లక్ష్యం రూ. 7.1 లక్షల కోట్లు.
 • ఎఫ్‌వై 20 లో నికర పన్ను ఆదాయం లక్ష్యం రూ. 16.49 లక్షల కోట్లు.
 • ఎఫ్‌వై 20 లో రూ. 50,000 కోట్ల ప్రభుత్వ బాండుల తిరిగి కొనుగోలు.
 •  ఎఫ్‌వై 20 లో పెట్రోలియం రాయితీల లక్ష్యం రూ.37 478 కోట్లు.
 • ఎఫ్‌వై 20 లో ఎక్సైజ్‌ డ్యూటీ ఆదాయం రూ. 3 లక్షల కోట్లు.
 • ఎఫ్‌వై 20 లో ఆర్బీఐ, బ్యాంకుల నుంచి డివిడెండ్‌ రూపేణ పొందే నగదు లక్ష్యం రూ. 1.06 లక్షల కోట్లు : ఆర్థిక మంత్రిYou may be interested

బడ్జెట్‌ అప్‌డేట్‌-ప్రభుత్వ రంగ బ్యాంకులకు రూ.70,000 కోట్లు

Friday 5th July 2019

కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ శుక్రవారం ఉదయం 11 గంటలకు బడ్జెట్‌ ప్రసంగాన్ని ప్రారంభించారు.  -ప్రభుత్వ రంగ బ్యాంకులకు రూ.70,000 కోట్లు

స్థిరంగా పసిడి ధరలు

Friday 5th July 2019

ప్రపంచమార్కెట్లో మార్కెట్లో పసిడి ధరలు స్థిరంగా ట్రేడ్‌ అవుతున్నాయి. డాలర్‌ ఇండెక్స్‌ స్థిరమైన ర్యాలీ, ఆసియా మార్కెట్లు రెండు నెలల గరిష్టం వద్ద ట్రేడ్‌ అవుతుండటం ఇందుకు కారణమవుతున్నాయి. ఆసియా శుక్రవారం ఉదయం ట్రేడింగ్‌లో ఔన్స్‌ పసిడి ధర 1డాలరు స్వల్ప నష్టంతో 1,420డాలర్ల వద్ద ట్రేడ్‌ అవుతోంది. అమెరికా నేడు విడుదల చేసే జూన్‌ మాసపు వ్యవసాయేతర ఉద్యోగ గణాంకాల విడుదల కోసం పసిడి ఇన్వెస్టర్లు ఎదురు చూస్తున్నారు.

Most from this category