News


మార్కెట్‌ను మెప్పించని బడ్జెట్‌

Friday 5th July 2019
Markets_main1562322243.png-26830

  • 395 పాయింట్లు నష్టపోయిన సెన్సెక్స్‌ 
  • 135.60 పాయింట్లను కోల్పోన నిఫ్టీ 

బడ్జెట్‌ స్టాక్ మార్కెట్‌ను మెప్పించలేకపోయింది. నేడు మోదీ 2.0 ప్రభుత్వం ప్రవేశపెట్టిన తొలి బడ్జెట్‌లో లిస్టెడ్‌ కంపెనీల్లో పబ్లిక్‌ వాటా పెంపు, ప్రభుత్వ కంపెనీల్లో భారీ స్థాయిలో నిధుల ఉపసంహరణ, ఆర్థిక లోటు కట్టడి, విదేశీ రుణాలు లాంటి ప్రతికూలాంశాలు ఇన్వెస్టర్లను నిరుత్సాహపరిచాయి. ఫలితంగా సెన్సెక్స్‌ 394.67 పాయింట్లు నష్టపోయి 39,513.39 వద్ద, నిఫ్టీ 135.60 పాయింట్లను కోల్పోయి 11,811.20 వద్ద ముగిశాయి. మెటల్‌, ఫార్మా, రియల్టీ, మీడియా, అటో రంగ షేర్లలో అమ్మకాల ఒత్తిడికి లోనయ్యాయి. అయితే, ప్రస్తుత బడ్జెట్లో ప్రభుత్వరంగ బ్యాంకులకు రూ.70,000కోట్ల రీ క్యాపిటలైజేషన్‌ ప్రకటించడంతో ప్రభుత్వరంగ బ్యాంకింగ్‌ షేర్లు స్వల్పంగా లాభపడ్డాయి. ఎన్‌ఎస్‌ఈలో కీలకమైన బ్యాంకు నిఫ్టీ ఇండెక్స్‌ 5 పాయిం‍ట్ల స్వల్ప లాభంతో 31,475.80 వద్ద స్థిరపడింది. బడ్జెట్‌ ప్రసంగానికి ముందు స్వల్ప లాభాల్లో కదలాడుతున్న సూచీలు బడ్జెట్‌ ప్రసంగం ప్రారంభం నుంచి తీవ్ర అమ్మకాల బత్తిడికి లోనయ్యాయి. ఒకదశలో 591 పాయింట్ల దశలో కదలాడగా, నిఫ్టీ 11800 పాయింట్ల దిగువున కనిష్టానికి తగ్గింది.

సన్‌ఫార్మా, యూపీఎల్‌, మహీంద్రా అండ్‌ మహీంద్రా, ఎన్‌టీపీసీ, యస్‌ బ్యాంక్‌ షేర్లు 4.50శాతం నుంచి 8.50 శాతం నష్టపోయాయి. ఎస్‌బీఐ బ్యాంక్‌, ఐటీసీ, కోటక్‌ బ్యాంక్‌, ఇండస్‌ ఇండ్‌ బ్యాంక్‌, ఇండియాబుల్‌హౌసింగ్‌ఫైనాన్స్‌ షేర్లు 1శాతం నుంచి 3.50శాతం లాభపడ్డాయి. 

  • కష్టాలు ఎదుర్కోంటున్న విద్యుత్‌ రంగంలో నిర్మాణాత్మక చర్యలు చేపట్టడంతో పాటు ఉదయ్‌ పథకాన్ని పునరుద్ధరించాల్సిన అవసరం ఉందని ఆర్థిక మంత్రి ప్రకటించడంతో విద్యుత్‌ రంగ షేర్లైన ఎన్‌టీపీసీ 2.50శాతం, అదానీ పవర్‌ 1.50శాతం, టాటా పవర్‌ 1శాతం, జేఎస్‌డబ్ల్యూ ఎనర్జీ అరశాతం నష్టపోయాయి.
  • ప్రభుత్వరంగ కంపెనీల నుంచి రూ.1.50లక్షల కోట్ల నిధుల ఉపసంహరణ లక్ష్యంగా పెట్టుకోవడంతో ఎన్‌టీపీసీ, ఓఎన్‌జీసీ, హెచ్‌పీసీఎల్‌, ఐఓసీ, ఐఓసీ, ఎన్‌ఎండీసీ, ఎంఆర్‌పీఎల్‌, బీపీసీఎల్‌ షేర్లు 3శాతం వరకు నష్టపోయాయి 
  •  లిస్టెడ్‌ కంపెనీల్లో పబ్లిక్‌ వాటాను 35శాతానికి పెంచడటంతో ఏవియేషన్‌, ఇన్సూరెన్స్‌ రంగ కంపెనీలకు చెందిన షేర్లు తీవ్ర అమ్మకాల ఒత్తిడికి లోనయ్యాయి.
  • బంగారం, విలువైన మెటల్స్‌పై కస్టమ్స్‌ డ్యూటీ 10శాతం నుంచి 12.5శాతానికి పెంచడంతో ఆ రంగాల షేర్లు  2-7 శాతం క్షీణించాయి. 
  • పెట్రోల్‌, డిజీల్‌పై ప్రత్యేక అదనపు ఎక్సైజ్‌ డ్యూటీ విధించారు.  ప్రతి లీటర్‌పై రూ 1 అదనపు సెస్‌, మరో రూ.1 రోడ్‌ సెస్‌ విధించారు. ఫలితంగా హెచ్‌పీసీఎల్‌, బీపీసీఎల్‌, ఇండియన్‌ ఆయిల్‌ కార్పోరేషన్‌ షేర్లు 5నుంచి 6శాతం క్షీణించాయి. 



You may be interested

ఆటో షేర్ల భారీ పతనం

Friday 5th July 2019

బడ్జెట్‌లో ఆటో రంగానికి అనుకున్నంత చేయూత లేకపోవడంతో పాటు అంతర్జాతీయంగా తయారి రంగం మందగించడంతో  నిఫ్టీ ఆటో సూచీ శుక్రవారం ట్రేడింగ్‌లో 228.10 పాయింట్లు నష్టపోయి 7,849.10 పాయింట్ల వద్ద ముగిసింది. ఎం అండ్‌ ఎం 4.73 శాతం నష్టపోయింది. ఇండెక్స్‌లో బాగా నష్టపోయిన షేరు ఇదే. దీనితో పాటు భారత్‌ ఫోర్జ్‌ 4.19 శాతం, హీరో మోటర్‌ కార్ప్‌ 3.85 శాతం , అశోక్‌ లేలాండ్‌ 3.45 శాతం,

ఒకేరోజు రూ. 730 పెరిగిన బంగారం

Friday 5th July 2019

బంగారం, విలువైన మెటల్స్‌ దిగుమతులపై కస్టమ్స్‌ డ్యూటీని 10 శాతం నుంచి 12.5శాతానికి పెంచడంతో శుక్రవారం ఎమ్‌సీఎక్స్‌ ట్రేడింగ్‌లో బంగారం ధరలు 2.14శాతం లాభపడింది. ఫలితంగా రూ.731 పెరిగి పది గ్రాములు రూ.34,948.00 గా ట్రేడవుతోంది. శుక్రవారం ట్రేడింగ్‌లో రూ. 34,250.00 వద్ద ప్రారంభమై ఒక దశలో రూ. 34,205.00 ఇంట్రడే కనిష్ఠాన్ని తాకింది. 

Most from this category