News


ప్రజారంజకంగానే బడ్జెట్‌ : మార్కెట్‌ విశ్లేషకులు

Saturday 29th June 2019
Markets_main1561803307.png-26688

  • నిఫ్టీ ఆల్‌టైం హైని అందుకోవడం కష్టమే..

వచ్చేవారంలో కొత్త ప్రభుత్వం ప్రవేశపెట్టబోయే బడ్జెట్‌ ప్రజారంజకంగా ఉంటుందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ముఖ్యంగా చిన్న పరిశ్రమలు, రైతులను దృష్టిలో పెట్టుకుని బడ్జెట్‌ తయారీ ఉంటుందని వారు అంచనా వేస్తున్నారు. ఇదే ప్రభుత్వం గత ఫిబ్రవరిలో ప్రవేశపెట్టిన మధ్యంతర బడ్జెట్‌ మార్కెట్‌ వర్గాలను మెప్పించకపోవడంతో ఈసారి బడ్జెట్‌పై సాధారణ ప్రజలు బడ్జెట్‌పై బారీగా ఆశలు పెట్టుకున్నారు. జూన్‌ 05న ప్రవేశపెట్టబోయే బడ్జెట్‌ దేశీయ ఆర్థిక వ్యవస్థకు విధివిధానాలను నిర్దేశించబోతుంది. మరోవైపు ఇదే సమయంలో ప్రస్తుతం దలాల్‌ స్ట్రీట్‌లో ఇన్వెస్టర్లు, ట్రేడర్లు పాజిటివ్‌ మూడ్‌లో లేరు. మూడు నెలలు వరుసగా లాభాల ముగింపు అనంతరం నిఫ్టీ ఇండెక్స్‌ తొలిసారిగా జూన్‌ డెరివేట్‌ ఎప్అండ్‌ఓ నష్టాలతో ముగించింది. ప్రస్తుతం మార్కెట్లో ఎక్కువగా షేర్లు ధీర్ఘాకాలికంగా 200 రోజుల ఎక్స్‌పోన్షియల్‌ మూవింగ్‌ ఏవరేజ్‌ దిగువన ట్రేడ్‌ అవుతున్నాయి. బడ్జెట్‌ ప్రవేశపెట్టిన వెంటనే స్టాక్‌ ధరలు తొందరగా స్పందించకపోవచ్చు. కాబట్టి నిఫ్టీ ఇండెక్స్‌ తన జీవితకాల గరిష్టస్థాయి(12,103) ఇప్పట్లో అధిగమించకపోవచ్చు.

స్టాక్‌ ఇన్వెస్టర్లు, ట్రేడర్లు బడ్జెట్‌ పరిశీలనతో, ప్రపంచ పరిస్థితులు, ప్రస్తుత ఆర్థిక సంవత్సరపు క్యూ1 ఫలితాలను నిశితంగా పరిశీలించాల్సి ఉంటుందని విశ్లేషకులు సూచిస్తున్నారు. బడ్జెట్‌ తరువాత స్టాక్‌ మార్కెట్లో షేర్లు వాల్యూషన్లు విపరీతంగా పెరిగే అవకాశం ఉంది. కాబట్టి ఇన్వెస్టర్లు ఇండస్ట్రీ దిగ్గజాలైన హెచ్‌యూఎల్‌, ఇన్ఫోసిస్‌, బ్యాంకింగ్‌ రంగంలో ఫెడరల్‌ బ్యాంకు లాంటి షేర్లను అట్టిపెట్టుకోవాలని వారు సూచిస్తున్నారు. 

ఇటీవల సెబీ మ్యూచువల్‌ ఫండ్స్‌పై కఠిన నిబంధనలను విధించారు. నిబంధనలను మ్యూచువల్ ఫండ్లు సాదారంగా స్వీకరించడం శుభపరిణామం. అయినప్పటికీ, రూ.25.93 ట్రిలియన్ల భారత మ్యూచువల్‌ ఫండ్‌ వ్యవస్థ చెప్పదగ్గ ప్రభావానికి లోనవుతుందని విశ్లేషకులు అభిప్రాయపడ్డారు. 


నాన్‌బ్యాంకింగ్‌ఫైనాన్స్‌, హౌసింగ్‌ ఫైనాన్స్‌ రంగంలో నెలకొన్న ద్రవ్య సంక్షోభం ఈక్విటీ మార్కెట్లకు మంచి పరిణమం కాదనే విశ్లేషకులంటున్నారు. అయితే, హౌసింగ్‌ ఫైనాన్స్‌ కంపెనీల లయబిలిటీనీ, మూలధన అడెక్వసీ నిష్పత్తిని పెంచుకునేందుకు నేషనల్‌ హౌసింగ్‌ బ్యాంకు కొన్ని కీలకమైన సవరణలు చేసిందనే విషయాన్ని వారు ఈ సందర్భంగా గుర్తు చేశారు. కనీస మూలధన సమృద్ధి నిష్పత్తిని పెంచడం, పరపతిని తగ్గించడం, ప్రజా డిపాజిట్లను ఎంతవరకు సమీకరించడం ద్వారా హెచ్‌ఎఫ్‌సిల బ్యాలెన్స్ షీట్‌ను బలోపేతం చేయాలని రెగ్యులేటర్ యోచిస్తోంది. నిజానికి గత 8నెలల నుంచి హెచ్‌ఎఫ్‌సీల పరిస్థితి చాలా కఠినంగా తయారైంది. అయితే ఆయా కంపెనీలు పంపిణీలను అరికట్టడం,  అమ్మకాలు తగ్గించడం ద్వారా పరిస్థితిని నెట్టుకొస్తున్నాయి. అయినప్పటికీ.., నిర్మాణ సమస్యలు ఇప్పటికీ కొనసాగుతున్నాయి. అందువల్ల, మేము ఈ రంగంపై ఇన్వెస్టర్లు అప్రమత్తగా వ్యవహరించాలని విశ్లేషకులు సూచిస్తారు. హెచ్‌డీఎఫ్‌సీ లిమిటెడ్, బజాజ్ ఫైనాన్స్, బజాజ్ ఫిన్సర్వ్ వంటి బలమైన బ్యాలెన్స్ షీట్ ఉన్న సంస్థలలో పెట్టుబడులు పెట్టాలని వారు సలహానిస్తున్నారు.You may be interested

చమురు ఉత్పత్తి కోత కొనసాగింపు!

Saturday 29th June 2019

సౌదీతో రష్యా ఒప్పందం ఒపెక్‌తో కుదుర్చుకున్న చమురు ఉత్పత్తి తగ్గింపు ఒప్పంద కాల పరిమితిని 6 నుంచి 9 నెలల వరకు పెంచాలనే నిర్ణయాన్ని రష్యా-సౌది అరేబియా ఇరుదేశాలు అంగీకరించాయని రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్‌ శనివారం తెలిపారు. ప్రస్తుత ఒప్పందం ఇప్పుడున్న పద్ధతిలోనే, అంతే పరిమాణంలో కొనసాగుతుందని పుతిన్‌ సౌది అరేబియా యువరాజు మహ్మద్‌ బిన్‌ సల్మాన్‌తో భేటి అనంతరం ప్రకటించారు.  రోజుకు 12 లక్షల బ్యారెల్‌ చమురు ఉత్పత్తి

బడ్జెట్‌ నుంచి ఆటోరంగానికి ఏం కావాలి?

Saturday 29th June 2019

గత ఏడాది నుంచి దేశియ ఆటో రంగం అధ్వాన్న స్థితిలో ఉంది. వైఓవై (ఇయర్‌ ఆన్‌ ఇయర్‌) ప్రకారం ఆటోమొబైల్స్‌ అమ్మకాలు 20 శాతం మేర తగ్గాయి. ఈ జాబితా ఇంకా పెరుగుతునే ఉంది. 2019 బడ్జెట్‌లో ఈ రంగానికి దన్నుగా ఎటువంటి పాలసీలున్నాయి? ఆటోరంగం ఈ బడ్జెట్‌ ఎటువంటి అంశాలను కోరుకుంటుంది? ఆటోమొబైల్స్‌పై జీఎస్‌టీ రేటు తగ్గింపు: ఆటోమొబైల్స్‌పై విధిస్తున్నా 28శాతం జీఎస్‌టీ వలన వీటిని సిగరెట్స్‌, లక్సరీ వస్తువులలా అంటరానివిగా

Most from this category