News


చౌక నిధులతో బబుల్‌ !

Wednesday 4th March 2020
Markets_main1583313869.png-32275

వడ్డీ రేట్లను తగ్గిస్తున్న కేంద్ర బ్యాంకులు 
2008లో పరిస్థితులు తలెత్తవచ్చు
రెండేళ్లలో బబుల్‌ ఏర్పడే అవకాశం
- జిమ్‌ రోజర్స్‌, రోజర్స్‌ హోల్డింగ్స్‌

పలు దేశాల కేంద్ర బ్యాంకులు వడ్డీ రేట్లను మరోసారి నమ్మశక్యంకాని స్థాయిలో తగ్గిస్తూ వెళుతున్నాయి. ఇది ప్రపంచ ఆర్థిక వ్యవస్థలకు మేలు చేయదంటున్నారు రోజర్స్‌ హోల్డింగ్స్‌ చైర్మన్‌ జిమ్‌ రోజర్స్‌. దీంతో రెండేళ్లలో  గాలి బుడగ(బబుల్‌) పరిస్థితులు తలెత్తే అవకాశముందని హెచ్చరిస్తున్నారు. ఒక ఇంటర్వ్యూలో ఈక్విటీ మార్కెట్లు, బంగారం తదితర అంశాలపై పలు అభిప్రాయాలు వ్యక్తం చేశారు. వివరాలు చూద్దాం..

ప్రస్తుతం కనిపిస్తున్న సంక్షోభ పరిస్థితులను ఎదుర్కొనేందుకు పలు దేశాల కేంద్ర బ్యాంకులు మరింత కరెన్సీ విడుదలకు ఆసక్తి చూపుతున్నాయి. తద్వారా వినియోగాన్ని పెంచాలని ఆశిస్తున్నాయి. ఇది ప్రపంచానికి మేలు చేయదు. అయితే స్వల్ప కాలంలో ప్రోత్సాహకర పరిస్థితులు కనిపించినప్పటికీ చివరికి ఇది బబుల్‌కు దారితీస్తుంది. నా అంచనాలు కరెక్టయితే రెండేళ్లలోనే బబుల్‌ పరిస్థితులు కనిపించవచ్చు. జీ7 దేశాధినేతలు, అమెరికన్‌ ప్రెసిడెంట్‌ ట్రంప్‌ భారీ నిధులను వినియోగానికి వెచ్చించే యోచనలో ఉన్నారు. అధిక లిక్విడిటీ కారణంగా స్వల్ప కాలంలో మార్కెట్లు మరింత గరిష్టాలకు చేరవచ్చు. బాండ్లకు సైతం డిమాండ్‌ పెరిగే వీలుంది. 

2008లోనూ.. 
ఇంతక్రితం 2008లో ప్రపం‍చ దేశాలలో అధిక రుణ భారం కారణంగా ఆర్థిక సంక్షోభం తలెత్తింది. 2008 తదుపరి కూడా రుణాలు పెరుగుతూ పోయాయి. ప్రస్తుతం చైనా సైతం భారీ రుణాలను మోస్తోంది. 2008లో చైనా వద్ద భారీ లిక్విడిటీ ఉంది. దీంతో చైనా నిధులు వినియోగానికి ఊపునిచ్చాయి. ఇప్పుడు చైనాసహా జర్మనీ వరకూ భారీ డెట్‌ పరిస్థితులు నెలకొన్నాయి. ప్రస్తుతం పలువురు మార్కెట్‌ నిపుణులు దీర్ఘకాలిక బుల్‌ మార్కెట్‌ అంటూ మాట్లాడుతున్నారు. కానీ భవిష్యత్‌లో బేర్‌ ట్రెండ్‌ తలెత్తనుంది. భారీ పతనాలకు అవకాశముంది. కొన్ని మార్కెట్లు 50-60-80 శాతంవరకూ పతనంకావచ్చు. బేర్‌ మార్కెట్లు అంటే ఇలానే ఉంటాయి. నేను భయాలను ప్రేరేపించడానికి ఇలా చెప్పడంలేదు. అయితే బేర్‌ ట్రెండ్‌ ఎప్పుడు ఏర్పడుతుందన్నది ఎవరికీ అంతుచిక్కే విషయంకాదు. నా అంచనా అయితే 2022కల్లా ఈ పరిస్థితులు తలెత్తవచ్చు. 

పతనంలోనే
నిజానికి నేను మార్కెట్ల పతనంలోనే ఇన్వెస్ట్‌ చేసేందుకు ఆసక్తి చూపుతాను. చైనా మార్కెట్‌ చరిత్రాత్మక గరిష్టం నుంచి 60 శాతం పతనమైంది. ఇదే విధంగా జపాన్‌ 50 శాతం క్షీణించింది. దీంతో నేను జపనీస్‌ మార్కెట్లో ఇన్వెస్ట్‌ చేస్తాను. ఇక ప్రపంచంలోని ప్రధాన విమానయాన సంస్థ ఏషియన్‌ ఎయిర్‌లైన్స్‌ కరోనా కారణంగా డిమాండ్‌ లేకపోవడంతో ముందురోజు అట్లాంటిక్‌కు సేవలను రద్దు చేసింది. ఇలాంటి ఒత్తిడిల మధ్య ఇన్వెస్ట్‌ చేసేందుకు ఆసక్తి చూపుతుంటాను. నిజానికి వైరస్‌ కారణంగా భయపడవలసిన పనిలేదు. ఈ ఏడాది అమెరికాలో ఫ్లూ కారణంగా 40,000 మంది చనిపోయారు. అయినా ప్రజలు మెక్‌డొనాల్డ్స్‌కు వెళ్లడం మానలేదు. అయితే కరోనా కొత్త తరహా వ్యాధికావడంతో ఆందోళనలు పెరిగాయి. ఇది అత్యంత వేగంగా విస్తరిస్తున్నప్పటికీ దీంతో వయసు మీదపడిన వాళ్లు మాత్రమే మరణిస్తున్నారు. 

బంగారం
2010 తదుపరి బంగారంలో కొనుగోళ్లు నిలిపివేశాను. అయితే గతేడాది వేసవి నుంచీ తిరిగి కొంటున్నాను. సంక్షోభ పరిస్థితుల్లో అందరూ పసిడిని కొనుగోలు చేయడం మామూలే. ప్రభుత్వాలు, కరెన్సీలకంటే ప్రజలకు పసిడి, వెండిపట్ల నమ్మకం ఎక్కువ. దేశీయంగా చూస్తే టూరిజం, హోటల్స్‌, రెస్టారెంట్లు తదితరాలు తాత్కాలికంగా నీరసించినా తిరిగి పుంజుకునేందుకు అవకాశముంది.You may be interested

టాటామోటార్స్‌ షేరు 5% డౌన్‌

Wednesday 4th March 2020

బుధవారం టాటా మోటార్స్‌ షేరు 5 శాతానికి పతనమైంది. 2020 ఫిబ్రవరిలో 34.42 శాతం పడిపోయాయని కంపెనీ మంగళవారం ప్రకటించడంతో నేడు షేరు విలువ పడిపోయింది. కోవిడ్‌-19 ప్రభావంతో చైనానుంచి సరఫరా కావాల్సిన విడిభాగాలు ఆగిపోవడంతో టాటామోటార్స్‌ ఉత్పత్తి తగ్గిందని కంపెనీ తెలిపింది. గతేడాది ఫిబ్రవరిలో 56,826 యూనిట్లుగా ఉన్న ఉత్పత్తి ఈ ఫిబ్రవరిలో 37,826కు పడిపోయింది. అంతేకాకుండా వాణిజ్య వాహనాల ఉత్పత్తి గతేడాదిలో 45.8 శాతంగా ఉంటే ఈ

యస్‌ బ్యాంక్‌ మరోసారి నిధుల సమీకరణ ప్రయత్నాలు

Wednesday 4th March 2020

52వారాల కనిష్టానికి షేరు మూలధన నిధులను పెంచుకునేందుకు యస్‌ బ్యాంక్‌ యాజమాన్యం మ్యూచువల్‌ ఫండ్లను సంప్రదించినట్లు వార్తలు వెలుగులోకి రావడంతో ఈ బ్యాంక్‌ షేరు బుధవారం ట్రేడింగ్‌లో దాదాపు 8.50శాతం నష్టాన్ని చవిచూసింది. యస్‌బ్యాంక్‌ సుమారు 300-500 మిలియన్‌ డాలర్ల విలువైన తాజా ఈక్విటీ మూలధనాన్ని మ్యూచువల్‌ ఫండ్ల నుంచి సమీకరించేందుకు ప్రయత్నం చేస్తున్నట్లు  బిజినెస్‌ స్టాండర్డ్‌ వార్తకథనాన్ని ప్రచురించింది. ఈ అంశంపై మ్యూచువల్‌ ఫండ్ల సంస్థలు ఎలాంటి నిర్ణయాన్ని తీసుకోలేదు.

Most from this category