News


బడ్జెట్‌ రోజున బీఎస్‌ఈ ఓపెన్‌

Wednesday 22nd January 2020
Markets_main1579680637.png-31101

ఈసారి బడ్జెట్‌ ప్రవేశపెట్టే రోజు శనివారం కావడంతో ఈ రోజు స్టాక్‌ ఎ‍క్చ్సేంజీలు పనిచేస్తాయా... లేదా..?! అనే అనుమానాలకు బీఎస్‌ఈ స్టాక్‌ ఎక్చ్సేంజ్‌ తెరదించింది. బడ్జెట్‌ ప్రవేశపెట్టేరోజు శనివారం అయినప్పటికీ స్టాక్‌ ఎక్చ్సేంజీ పని చేస్తుందని బీఎస్‌ఈ స్టాక్‌ ఎక్చ్సేంజ్‌ స్పష్టం చేసింది. ఈ మేరకు ఓ సర్క్యూలర్‌ జారీచేసింది. ‘‘కేంద్రం ప్రభుత్వం ఫిబ్రవరి 1 శనివారం నాడు 2020-21 ఆర్థిక సంవత్సరపు బడ్జెట్‌ను ప్రవేశపెట్టనుంది. ఆ రోజు శనివారం ఐనప్పటికీ, సాధారణ పనిదినాల మాదిరిగానే ఎక్చ్సేంజ్‌ పనిచేస్తుంది. ప్రీ-ఓపెనింగ్‌ ఉదయం గం.9:00 నుంచి గం.9:15వరకు ఉంటుంది. అలాగే సాధారణ ట్రేడింగ్‌ గం.9:15ని.లకు నుంచి 3:30ని.లకు వరకు ఉంటుంది’’ అని తెలిపింది. మరో ప్రధాన స్టాక్‌ ఎక్స్‌ఛేంజ్‌ ఎన్‌ఎస్‌ఈ నుంచి బుధవారం మధ్యాహ్నం వరకూ ఎటువంటి ‍ప్రకటనా వెలువడలేదు. అంతకు ముందు 2015లో, అరుణజైట్లీ ఆధ్వర్యంలో బడ్జెట్‌ ప్రవేశపెట్టిన రోజు ఫిబ్రవరి 28న శనివారం ఐనప్పటికీ ఈ రోజు ఇరు ఎక్చ్సేంజీలు పనిచేశాయి.

కేంద్రం బడ్జెట్ సందర్భరంగా భారీగా తాయిలాలు ప్రకటించవచ్చని దలాల్ స్ట్రీట్ ఆశలు పెట్టకుంది. వినియోగ శక్తిని పెంచడానికి వ్యక్తిగత పన్ను రేటు కోతలు, ఎంఎస్‌ఎంఈ, గృహరంగాలపై ఒత్తిళ్లను తగ్గించే ప్రకటనలు, ప్రైవేట్, విదేశీ పెట్టుబడులను ఆకర్షించే విధానాలపై కేంద్రం దృషిని సారించి ఉండవచ్చని ప్రముఖ బ్రోరేజ్‌ సంస్థ షేర్‌ఖాన్‌ అంచనావేస్తుంది. 



You may be interested

డివిడెండ్‌ ఈల్డ్‌తో మంచి షేర్లు గుర్తించగలమా?

Wednesday 22nd January 2020

ఈక్విటీపై రిటర్న్స్‌ రెండు రకాలుగా ఉంటాయి. ప్రైస్‌ రిటర్న్‌ మరియు ఆర్జించిన డివిడెండ్‌ రూపాల్లో ఆర్‌ఓఈ ఉంటుంది. షేర్‌హోల్డర్లకు ఇచ్చే నగదు చెల్లింపులను డివిడెండ్స్‌ అంటారు. బలమైన నగదు ప్రవాహం ఉన్న కంపెనీలు క్రమానుగతంగా డివిడెండ్స్‌ను ప్రకటిస్తుంటాయి. వార్షిక డివిడెండ్‌ చెల్లింపులను షేరు ధరతో భాగించి వందతో గుణిస్తే డివిడెండ్‌ ఈల్డ్‌(శాతం) వస్తుంది. ఉదాహరణకు ఒక కంపెనీ షేరు ధర రూ.100 అనుకుని, దాని డివిడెండ్‌ రూ.3 అనుకుంటే, ఆ కంపెనీ

2020లో పెట్టుబడులకు 15 స్టాక్స్‌

Wednesday 22nd January 2020

గత రెండేళ్లుగా దేశీ స్టాక్‌ మార్కెట్లలో ప్రధాన కంపెనీలు ర్యాలీ చేస్తూవచ్చాయని, ఇకపై ఈ పరిస్థితి మారనుందని బ్రోకింగ్‌ సంస్థలు చెబుతున్నాయి. జీడీపీ బలపడేందుకు వీలుగా బడ్జెట్లో ప్రభుత్వం చర్యలు, ప్రోత్సాహకాలను ప్రకటించనున్నట్లు అంచనా వేశాయి. దీంతో ఆర్థిక వ్యవస్థకు కీలకమైన రంగాలు పుంజుకోనున్నట్లు తెలియజేశాయి. వెరసి 2020లో మిడ్‌, స్మాల్‌ క్యాప్‌ ఇండెక్సులు సైతం 15-20 శాతం స్థాయిలో రిటర్నులు ఇచ్చే వీలున్నట్లు పేర్కొంటున్నాయి. ఇదే సమయంలో మార్కెట్లు

Most from this category