News


ప్రభుత్వ రంగ షేర్ల ర్యాలీ

Wednesday 30th October 2019
Markets_main1572412186.png-29228

బుధవారం మార్కెట్‌ ప్రారంభంలోనే ప్రభుత్వరంగ షేర్లకు కొనుగోళ్ల మద్దతు లభిస్తోంది. ఫలితంగా బీఎస్‌ఈ పీఎస్‌యూ ఇండెక్స్‌ ఉదయం సెషన్‌లో 1.50శాతం లాభపడింది. ప్రభుత్వరంగానికి చెందిన ఐటీఐ, సెంట్రల్‌ బ్యాంక్‌, భెల్‌, యూనైటెడ్‌ బ్యాంక్‌, ఆర్‌సీఎఫ్‌ షేర్లు 10శాతానికి పైగా లాభపడ్డాయి. బీఈఎంఎల్‌, జీఎండీసీలిమిటెడ్‌, సిండికేట్‌ బ్యాంక్‌, జమ్మూకాశ్మీర్‌ బ్యాంక్‌, హిందూస్థాన్‌ కాపర్‌, బీడీఎల్‌, ఆంధ్రాబ్యాంక్‌, యూనికో బ్యాంక్‌, ఎస్‌సీఐ షేర్లు 10 నుంచి 5శాతం పెరిగాయి. కార్పోరేషన్‌ బ్యాంక్‌, ఐడీబీ బ్యాంక్‌, హిందూస్థాన్‌ పెట్రోనెట్‌, ఇంజనీరింగ్‌ ఇండియా కంపెనీలు 5శాతం వరకు లాభపడ్డాయి. పీఎస్‌బీ, ఐఓసీ షేర్లు 5నుంచి 3శాతం వరకూ లాభపడ్డాయి. ఇండెక్స్‌ క్రితం ముగింపు(6,941.38)తో పోలిస్తే 1.50శాతం లాభంతో 7046 పాయింట్ల వద్ద ట్రేడ్‌ అవుతోంది. 



You may be interested

దుమ్మురేపుతున్న మిడ్‌క్యాప్స్‌!

Wednesday 30th October 2019

-280 స్టాకులు వాటి 200 డీఎంఏకి పైనే    విస్తృత మార్కెట్‌లో చాలా వరకు స్టాకులు ప్రతికూల సెంటిమెంట్‌నే ఎదుర్కొంటున్నప్పటికి, అక్టోబర్‌ 18 నుంచి ఇప్పటి వరకు బీఎస్‌ఈ 500 ఇండెక్స్‌లో 70కి పైగా స్టాకులు వాటి 200 డీఎంఏ(డైలీ మూవింగ్‌ యావరేజ్‌) కంటే పైకి  ఎగిశాయి. ఈ సమయంలో సెన్సెక్స్‌ ఏకంగా 3 శాతం పైగా లాభపడింది. దీర్ఘకాలానికి గాను ఈ స్టాకులు బాగున్నాయనే సంకేతాలను ఈ ఇండికేటర్‌ ఇస్తుందన్నది విశ్లేషకుల భావన. ప్రస్తుతం

బలమైన మద్దతు...11700 పాయింట్ల స్థాయి!

Wednesday 30th October 2019

నిఫ్టీపై నిపుణుల అంచనా దేశీయ మార్కెట్లు కొత్త సంవత్‌లో కదం తొక్కడం ఆరంభించాయి. దీపావళి నుంచి ఆటో, మెటల్‌, ఎనర్జీ స్టాకుల్లో పెరిగిన కొనుగోళ్లు నిఫ్టీని 11800 పాయింట్ల పైకి పంపాయి. దీంతో ఇప్పటివరకు కీలక నిరోధంగా ఉన్న 11700 పాయింట్లను నిఫ్టీ విజయవంతంగా దాటినట్లయింది. ఇప్పటివరకు నిరోధంగా ఉన్న 11700 పాయింట్లు ఇకపై కీలక మద్దతుగా నిలుస్తుందని టెక్నికల్‌ అనలిస్టులు చెబుతున్నారు. దీపావళికి ముందు ఐదు సెషన్లుగా నిఫ్టీ 11500-

Most from this category