News


ప్రభుత్వ రంగ కంపెనీ షేర్ల భారీ పతనం

Friday 5th July 2019
Markets_main1562306065.png-26815

బడ్జెట్‌ రోజున ప్రభుత్వరంగ షేర్లు భారీగా పతనమయ్యాయి. బీఎస్‌ఈలో ప్రభుత్వరంగ కంపెనీలకు ప్రాతినిథ్యం వహించే బీఎస్‌ఈ పీఎస్‌యూ ఇండెక్స్‌ 1శాతం నష్టపోయింది. నేడు కేంద్ర ప్రభుత్వం ఈ ఆర్థిక సంవత్సరంలో నిధుల సమీకరణలో భాగంగా ఆయాఆయా ప్రభుత్వరంగ కంపెనీల్లో భారీ వాటా ఉపసంహరణ లక్ష్యంగా పెట్టుకున్న నేపథ్యంలో ఈ రంగ షేర్లలో అమ్మకాలు వెల్లువెత్తాయి. ఫలితంగా నేటి బడ్జెట్‌ ప్రసంగానికి ముందే ఎన్‌టీపీసీ, ఓఎన్‌జీసీ, హెచ్‌పీసీఎల్‌, ఐఓసీ, ఐఓసీ, ఎన్‌ఎండీసీ, ఎంఆర్‌పీఎల్‌, బీపీసీఎల్‌ షేర్లు 3శాతం వరకు నష్టపోయాయి. గత మధ్యంతర బడ్జెట్‌లో ప్రభుత్వరంగ కంపెనీల నుంచి రూ.90,000 కోట్ల లక్ష్యంగా పెట్టుకున్న కేంద్రం ఈసారి రూ.1లక్ష కోట్ల నుంచి రూ.1.10 కోట్ల నిధుల ఉపసంహరణ లక్ష్యంగా పెట్టుకోవచ్చని మార్కెట్‌ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. 
 



You may be interested

స్వల్ప ఊగిసలాటలో మార్కెట్లు

Friday 5th July 2019

ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ శుక్రవారం పార్లమెంట్‌లో 2019-20 బడ్జెట్‌ను ప్రవేశ పెట్టారు. ఈ నేపథ్యంలో ఈక్విటీ మార్కెట్లు స్వల్ప శ్రేణిలో ఊగిసలాడుతున్నాయి. నిఫ్టీ నేడు 11965 పాయింట్ల వద్ద ఆరంభమై 11981 పాయిం‍ట్ల గరిష్టానికి చేరింది. అయితే వెనువెంటనే చిన్నపాటి ప్రాఫిట్‌ బుకింగ్‌  రావడంతో క్రమంగా 11950 పాయింట్లకు క్షీణించింది. అనంతరం 11926 పాయింట్ల కనిష్ఠానికి చేరి ప్రసుతం 11932 పాయింట్ల వద్ద కదలాడుతోంది. సెన్సెక్స్‌ 39895 పాయింట్ల

ఆగని యస్‌బ్యాంక్‌ షేర్ల పతనం

Friday 5th July 2019

నేడు మరో 6.50శాతం క్షీణత ప్రైవేట్‌ బ్యాంకింగ్‌ దిగ్గజం యస్‌ బ్యాంక్‌ షేర్లు పతనం కొనసాగుతుంది. క్రితం రోజు 3.50శాతం నష్టపోయి ఈ బ్యాంకు షేర్లు శుక్రవారం ట్రేడింగ్‌ ప్రారంభంలోనే 6.50శాతం పతనమయ్యాయి. నేడు బీఎస్‌ఈలో ఈ షేర్లు రూ.95.00ల వద్ద ట్రేడింగ్‌ను ప్రారంభించాయి. మార్కెట్‌ ప్రారంభం నుంచే ఈ కంపెనీ షేర్లు అమ్మకాల ఒత్తిడికి లోనవడంతో 6.50శాతం నష్టపోయి రూ.90.25ల వద్ద ఇంట్రాడే కనిష్టానికి చేరుకున్నాయి. ఉదయం గం.10:45ని.లకు షేరు

Most from this category