News


నేడు మార్కెట్లకు సెలవు

Wednesday 2nd October 2019
Markets_main1569996747.png-28673

మహాత్మగాంధీ జయంతి సందర్భం‍గా బుధవారం మార్కెట్లకు సెలవు దినం. నేడు బీఎస్‌ఈ, ఎన్‌ఎస్‌ఈలు పనిచేయవు. అలాగే ఫారెక్స్‌ మార్కెట్‌కు కూడా సెలవు. కమోడిటీ ఎక్చ్సేంజ్‌ మాత్రం మధ్యాహ్నం వరకు పనిచేయదు. సాయంత్రం 5గం.లకు ట్రేడింగ్‌ ప్రారంభవుతోంది. స్టాక్‌ మార్కెట్‌ తిరిగి యథావిధిగా గురువారం (3న) ప్రారంభమవుతుంది. బలహీన ఆర్థిక గణాంకాల నమోదు, సెప్టెంబర్‌ అటోరంగ షేర్ల విక్రయాలు మార్కెట్‌ వర్గాలను మెప్పించకపోవడం, పీఎంసీ బ్యాంక్‌ సంక్షోభ భయాలు, సెప్టెంబర్‌ తయారీ రంగం ఆగస్ట్‌తో పోలిస్తే ఎలాంటి వృద్ధి కనబరచకపోవడం, ఫారెక్స్‌ మార్కెట్లో డాలర్‌ మారకంలో రూపాయి విలువ 22 పైసలు క్షీణించడటంతో లాంటి ప్రతికూలాంశాలతో బ్యాంకింగ్‌ రంగ షేర్లలో అమ్మకాలు వెల్లువెత్తడంతో మార్కెట్‌ మూడో రోజూ నష్టంతో ముగిసింది. సెన్సెక్స్‌ 362 పాయింట్లు పతనమై 38,305 వద్ద, నిఫ్టీ 114.55 పాయింట్లు నష్టపోయి 11,360 వద్ద స్థిరపడ్డాయి. రేపటి నుంచి రెండురోజుల పాటు జరగనున్న ఆర్‌బీఐ నాలుగో ద్వైపాక్షిక పరపతి విధాన సమీక్ష మార్కెట్‌కు కీలకం కానుంది. ఈసారి కూడా వడ్డీరేట్లకు కీలకమైన రెపో రేటును తగ్గించే వీలున్నట్లు ఆర్థికవేత్తలు భావిస్తున్నారు. 



You may be interested

ఎస్‌జీఎక్స్‌ నిఫ్టీ 87 పాయింట్లు డౌన్‌..!

Wednesday 2nd October 2019

సింగపూర్‌లో ట్రేడయ్యే ఎస్‌జీఎక్స్‌ ఇండెక్స్‌ బుధవారం తీవ్ర ఒడిదుడుకుల్లో ట్రేడ్‌ అవుతోంది. ఈ ఇండెక్స్‌ నేడు.... కిత్రంరోజు ఇండియాలో ముగిసిన నిఫ్టీ ఫ్యూచర్‌ ముగింపు(11430)తో పోలిస్తే 17 పాయింట్ల లాభంతో 11447.50 వద్ద ట్రేడింగ్‌ను ప్రారంభించింది. ఒకదశలో 22 పాయింట్లు మేర లాభపడి 11452.00 వద్ద ఇంట్రాడే గరిష్టాన్ని అందుకుంది. ఆసియా మార్కెట్లతో పాటు మధ్యాహ్నం యూరప్‌ మార్కెట్ల బలహీనంగా ప్రారంభం కావడం, అమెరికా ఫ్యూచర్లు నష్టాల ట్రేడింగ్‌తో ఇండెక్స్‌ నష్టాల

10 ఏళ్ల కనిష్ఠానికి యుఎస్‌ తయారీ రంగం!

Wednesday 2nd October 2019

దీర్ఘకాలంగా కొనసాగతున్న యుఎస్‌-చైనా ట్రేడ్‌వార్‌ వలన సెప్టెంబర్‌ నెలకు సంబంధించి యుఎస్‌ తయారిరంగ డేటా పదేళ్ల కనిష్ఠానికి పడిపోయిందని ఐఎస్‌ఎం(ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ సప్లే మేనేజ్‌మెంట్‌) ఇండెక్స్‌ పేర్కొంది. జులై నెలలో 49.1 శాతంగా ఉన్న తయారిరంగం పనితీరు డేటా, సెప్టెంబర్‌లో 47.8 శాతానికి పడిపోయిందని, 2009 జూన్‌ తర్వాత ఇదే కనిష్ఠ స్థాయని ఈ డేటా పేర్కొంది. కాగా సెప్టెంబర్‌లో ఈ డేటా 50.2 శాతంగా ఉంటుందని విశ్లేషకులు అంచనావేసినప్పటికీ పదేళ్ల

Most from this category