News


నేడు మార్కెట్లకు సెలవు.

Thursday 15th August 2019
Markets_main1565848797.png-27770

స్వాతంత్ర దినోత్సవ సందర్భం‍గా గురువారం మార్కెట్లకు సెలవు దినం. అందుచేత బీఎస్‌ఈ, ఎన్‌ఎస్‌ఈలు పనిచేయవు. అలాగే ఫారెక్స్‌, కమోడిటీ ఎక్సేంజ్‌లు కూడా నేడు సెలవు. స్టాక్‌ మార్కెట్‌ తిరిగి యథావిధిగా శుక్రవారం (16న) ప్రారంభమవుతుంది. చైనా వస్తువులపై దిగుమతి సుంకాల విధింపును అమెరికా వాయిదా వేయడంతో పాటు దేశీయ ఆర్థిక గణాంకాలు ఆశించిన స్థాయిలో నమోదు కావడంతో ఆర్‌బీఐ మరోసారి వడ్డీరేట్ల తగ్గింపునుకు మొగ్గుచూపవచ్చనే అంచనాలతో కొనుగోళ్లు పెరగడంతో బుధవారం మార్కెట్‌ భారీ లాభంతో ముగిసింది. మెటల్‌, ఇన్ఫ్రా, బ్యాంకింగ్‌, ఎఫ్‌ఎంసీజీ, ఐటీ షేర్ల ర్యాలీతో సెన్సెక్స్‌ 353.37 పాయింట్ల లాభంతో 37,311.53 వద్ద నిఫ్టీ 103.50 పాయింట్లు పెరిగి 11,029.40 వద్ద ముగిసింది. బీఎస్‌ఈ మిడ్‌క్యాప్‌ 1శాతం ర్యాలీ చేయగా, స్మాల్‌క్యాప్‌ ఇండెక్స్‌ అరశాతం పెరిగింది. నిన్నటి ట్రేడింగ్‌లో మొత్తం రూ.3234 కోట్ల విలువైన కొనుగోళ్లు జరిగాయి. ఈ మొత్తంలో ఎఫ్‌ఐఐలు రూ.1614.63 కోట్ల విలువైన ఈక్విటీ షేర్లను, దేశీయ ఇన్వెస్టర్లు(డీఐఐ) రూ.1619.82 కోట్ల విలువైన ఈక్విటీ షేర్లను కొనుగోలు చేశారు.



You may be interested

మౌలికానికి రూ. 100 లక్షల కోట్ల పెట్టుబడులు: ప్రధాని

Thursday 15th August 2019

 వచ్చే ఐదేళ్లలో భారత ఆర్థిక వ్యవస్థ పరిమాణాన్ని 5 లక్షల కోట్ల డాలర్లకు పెంచడానికి సహాయపడే ఆధునిక మౌలిక సదుపాయాల అభివృద్ధికి తమ ప్రభుత్వం రూ. 100 లక్షల కోట్ల పెట్టుబడులు పెట్టనున్నట్లు ప్రధాని మంత్రి నరేంద్ర మోడీ గురువారం ప్రసంగంలో అన్నారు. 73 వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా, ఢిల్లీలోని ఎర్రకోట ప్రాకారాల నుంచి దేశాన్ని ఉద్దేశించి ఆయన ప్రసంగించారు. 'ఈజీ ఆఫ్ డూయింగ్ బిజినెస్' ర్యాంకింగ్‌లో,  భారత్

ఆర్థిక ​ఉద్దీపన చర్యలుంటాయి: ప్రధాని

Thursday 15th August 2019

దేశ ఆర్థిక పరిస్థితులను గురించి, వివిధ రంగాలు ఎదుర్కొంటున్న సమస్యలను గురించి గురువారం ప్రధాన మంత్రి నరేంద్రమోదీ తన స్వాతంత్ర దినోత్సవ  ప్రసంగంలో మాట్లాడారు. వృద్ధి మందగమనాన్ని తగ్గించడానికి ఒక ఉద్ధీపన పథకాన్ని సిద్ధం చేయడంలో ఆర్థిక మంత్రిత్వ శాఖ నిమగ్నమయ్యిందని వివరించారు. ఈ ఉద్దీపన ప్యాకేజీలో డిమాండ్ పెంచడానికి ప్రోత్సాహకాలు, కొన్ని పరిశ్రమలకు సంబంధించి-నిర్దిష్టమైన చర్యలు, సూపర్ రిచ్ సర్‌చార్జ్ నుంచి విదేశి పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లకు ఉపశమనం కలిగించే చర్యలుండవచ్చని

Most from this category